Home » D kameshwari » Sikshaw


    "రజియా" నాగొంతులో మార్దవం నాకే ఆశ్చర్యం కలిగించింది. ఏదో చెప్పాలని వున్నా ఏం చెప్పాలో తెలియక తడబడ్డాను. ఈలోగా రజియా తల్లి "వచ్చారా బాబూ! ఈ వరం రోజులుగా మీ గురించి మేం అందరం అనుకోని క్షణం లేదు. మీరు మాకు చేసిన సహాయం మరవలేం." అంటూ మొదలు పెట్టింది. ఏదో మాట్లాడుతూనే వున్నా మా యిద్దరి చూపులు, మనసులు  మాట్లాడుకుంటూనే వున్నాయి.
    ...... అప్పటినుంచి ప్రతి ఆదివారం రజియా యింటికి వెళ్ళడం అలవాటయిన కార్యక్రమంగా మారింది. ఆదివారం రజియా యింటికి వెళ్ళడం అలవాటయిన కార్యక్రమంగా మారింది. ఆదివారం వాళ్ళతో పాటే భోజనం చెయ్యాలని రమ, శకుంతల బలవంతపెట్టారు మొదటి వారం రోజంతా నలుగురం పేకాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేసి సాయంత్రం సినిమాకో, షికారుకో వెళ్ళడం అలవాటయిన కార్యక్రమంగా మారింది ఆ రోజంతా నిమిషంలా గడిచిపోయేది. ఆదివారం ఎప్పుడొస్తుందా అని మిగతా రోజులు నిరీక్షించడం, రజియా గురించి ఆలోచించడం తప్ప మరే ధ్యాసాలేకుండా తయారయ్యాను. హాస్పిటల్ డ్యూటీ ఏదో యాంత్రికంగా చేసేవాడిని. రమ, శకుంతల మమ్మల్నిద్దరిని హాస్యాలు పట్టిస్తూ ఏడిపిస్తూండేవారు. రజియా కోపం నటిస్తూ ఇద్దరిని కేకలు వేసేది- అది నటన అని ఆహస్త్యోక్తులు వినడం మా యిద్దరికీ యిష్టమేననీ నాకు తెలుసు- సినిమాకి వెడితే కావాలని రజియాని నా ప్రక్కన కూర్చోపెట్టేవారు.
    రమ, శకుంతల -- సినిమాలో ప్రేమ సన్నివేశాలని చూస్తూంటే నన్ను, రజియాని ఆదృశ్యాలలో ఊహిస్తూ రజియా స్పర్శకి పులకిస్తూ నన్ను నేను మరిచే పులకింతలో వుండేవాడిని- రజియా నా పక్కన కూర్చోడానికే సిగ్గుపడుతూ ఒదిగి కూర్చునేది. అది గమనించనట్లు మాట్లాడే నెపంతో చూడనట్టు రజియా వైపు వంగి ఆమెతో మాట్లాడుతుండే వాడిని. ఏ చెయ్యో తగిలితే రజియా ముడుచుకు పోయేది. కొంటెగా చూసేవాడిని. నా కళ్ళలోకి చూడలేనట్టు సిగ్గుతో కళ్ళు వాల్చుకునేది రజియా.
    ప్రతి రోజు -- ప్రతిక్షణం - ప్రతి  సంఘటన రజియాని నన్ను దగ్గర చేర్చింది రజియాతో పరిచయం అయ్యే వరకు స్త్రీ పురుష ఆకర్షణ యింత తీయగా వుంటుందన్న సంగతి నాకు తెలియదు. వయసులో వుండే స్త్రీ పురుష హృదయాలు ఒకరి సన్నిధిలో ఒకరుంటే యింతలా స్పందిస్తాయన్నది ఎందరి గుండెలలో తనిఖీ చేసిన నా స్టెత్ స్కోపు తెలియచెప్పలేదు. రజియాపట్ల నాకున్నది  ప్రేమ, ఆకర్షణా మోహమా? దీని పేరేమిటో గాని మనిషిని యింతలో సర్వం మరిచిపోయేట్టు చేస్తుందని యిది వరకు నాకు తెలియదు. ప్రేమకోసం రాజ్యం తృణప్రాయంగా వదిలిన రాజు  పిచ్చివాడని ఇన్నాళ్ళు అన్పించేది. కాని యిప్పుడర్దం అయింది. లైలా మజ్నులు, రోమియోజూలియట్ ల కధలన్నీ కేవలం అభూత కల్పనలనుకున్నాను యిన్నాళ్ళు కాదని యిప్పుడు తెలుసుకున్నాను. ఈరెండు నెలల పరిచయంలో రజియా లేనిదే నా జీవితానికి పరిపూర్ణత సిద్ధించదన్న నిజం పూర్తిగా గుర్తించాను తక్కిన లోకం ఏమయిపోనీ రజియా నాకు కావలి అన్న నిర్ణయానికి వచ్చేశాను ....... కాని రాజియాతో ఎలా చెప్పను! ఇన్నాళ్ళు స్నేహితుల్లా తిరిగాం ........ చనువుగా మాట్లాడుకున్నాం, కళ్ళతో పలకరించుకున్నాం తప్ప హృదయాలు విప్పి చెప్పుకోలేదు. రజియా మనసు నా మనసులాగానే ఆలోచిస్తుందన్న నమ్మకం నాకున్నది, రజియాకి నా మనసు విప్పి చెప్పే సందర్భంలో యింకా జతపడలేదు.
    రజియా తల్లి హఠాత్తుగా గుండెనొప్పి వచ్చి చనిపోయింది ....... ఆ ఆదివారం నేను వెళ్ళేసరికి రమ అందించిన వార్త అది రజియా ప్రపంచంలో ఏకాకి అయిపోయిందన్నమాట. రజియాకి సానుభూతి చూపించడానికి, ఓదార్చడానికి వూరు వెడితే అన్పించింది - రమ శకుంతల రేపు వెడుతున్నాడట వాళ్ళది ముస్లిం సాంప్రదాయం పరాయి మగవాడు స్నేహితుడు అని చెప్పుకుంటూ వెడితే బంధువులు ఏమనుకుంటారో వెళ్ళడం మంచిది కాదన్న శకుంతల అభిప్రాయం నిజమే అనిపించింది. నా తరపున వాళ్ళని రజియాకి సానుభూతి అందించి, నే రాని కారణం చెప్పమని చెప్పి రజియాకి ఉత్తరం రాసి యిచ్చాను. ఊరినించి వచ్చిన రమ శకుంతలలు అందించిన వార్తకి చకితుడనయి పోయాను. తల్లి పోగానే ఏకాకి అయిన రజియాని చెప్పుకోడానికి మాత్రమే అన్న అయిన అతను వచ్చి చదువు మాన్పించి ఊరికి తీసుకెళ్ళడానికి నిర్ణయం చేశాడని రజియా చదువింక మూడునెలలుంది. ఈ మూడునెలలు నన్ను ఆదుకొంటూ ఎంత ప్రార్ధించినా అన్న వినడంలేదని రజియా ఏమి చెయ్యాలో తోచక కన్నీరు మున్నీరుగా విలపిస్తుందని- అన్నగారింట్లో పని మనిషిగా మాత్రం స్థానం ఉంటుందని తనని ఆదుకొనేవారు ఎవరని స్నేహితురాళ్ళని కౌగలించుకొని ఏడ్చిందట. రమ, శకుంతల ఎంత చెప్పినా ఆ అన్న వినలేదట. వదినగారు జీతంలేని దాసి దొరికినందుకు సంతోషిస్తుందని, పదోరోజు రాగానే రజియాని అన్న వెంటబెట్టుకుపోతాడని అక్కడ జరిగిన సంగతులన్నీ చెప్పారు. అంతావినగానే రజియా దుస్థితికి చలించాను. ఏంచెయ్యాలో తోచని అయోమయంలో వుండిపోయాను. ఆఖరికి రమే ధైర్యంచేసి "మీరు ధనవంతులు రజియాకి డిగ్రీ చేతికి వచ్చేవరకు కాస్తాదుకోలేరా. రజియాకోసం ఆ మాత్రం  సహాయం చెయ్యలేరా అంది. కర్తవ్యం అర్ధమయి తప్పకుండా ఆదుకుంటాను. నా మనసులో మాట చెప్పాను." అంటూ అభినందించాను. కాని నాసహాయం రజియా అంగీకరిస్తుందా? రజియా అంగీకరించినా అన్న వప్పుకుంటాడా అపరిచితుడైనా నేను ఏ అధికారంతో రజియా భారం స్వీకరించను అంటూ సందేహించాను. ఎంత స్వాభిమానం ఉన్నా, ఆ నరకంలోంచి బయట పడడానికి రజియా మీ సహాయం తప్పక స్వీకరిస్తుంది ఎటొచ్చి ఆ అన్నే ఏమంటాడో అతన్ని మీరు కాస్త ఎదుర్కొని నచ్చచెప్పండి" అంది శకుంతల ఏమయినా సరే రజియాని దుస్థితి నించి కాపాడాలని నిర్ణయించుకున్నాను.
    రజియా ఊరు చేరాను. రజియా అన్నని చూడగానే సదభిప్రాయం కలగలేదు. నేనెవరో ఎందుకొచ్చానో వివరాలు పదేపదే అడిగి ఎన్ని చెప్పినా రజియాని, ఓ పట్టాన నన్ను చూడనీయలేదు. రజియాకి మగ స్నేహితులుకూడా ఉన్నారన్నమాట పట్నంలో వెలుగబెడుతున్న చదువు యిదన్నమాట. అంటూ మొరటుగా వ్యంగ్యోక్తులు, హేళనలు విసిరాడు. తమ స్త్రీలకి వరదాని పురుషులని చూడరాదని పట్నంలో ఏ భాగోతం ఆడినా ఇప్పుడు ఇంటినిండా బంధువుల మధ్య తన గౌరవం నిలుపుకోవాలిగనక రజియాని చూసే వీలులేదు. అని ఖచ్చితంగా చెప్పాడు. అంతదూరం వచ్చికనీసం రజియా నైనా చూడకుండా ఎలా వెళ్ళగలను అంతటి నిస్సహాయస్థితిలో రజియా ఖర్మానికి రజియాని వదిలివెళ్ళలేకపోయాను. ఏం చెయ్యాలో అంతుబట్టలేదు. ఆ క్షణంలో భగవంతుడే పంపినట్లు ఓ గదిలోంచి రజియా బయటికి వస్తూ కనిపించింది. విధి వరండాలో కూర్చున్న నాకు. 'రజియా' ఆనందంగా అరిచాను-రజియా ఒక్కక్షణం దిగ్భ్రాంతితో చూస్తూ నిలబడిపోయి మరుక్షణం పరిగెత్తి గుమ్మం దగ్గరికి వచ్చింది. "మీరు-మీరు వచ్చారా?" ఆనందో ద్రేకంతో అంది రజియా యీ వారంలో గుర్తుపట్టలేనంతగా మారింది. కళ్ళక్రింద నల్లని చారలు- లోతుకుపోయినకళ్ళు ఎప్పుడో ఉబ్బినకళ్ళు శోకదేవతలా కనపడిన రజియాని చూసి 'రజియా' అని మాత్రం అనగలిగాను, రజియాకి నన్ను చూడగానే దుఃఖం కట్టలు తెంచుకు వచ్చింది. చేతులలో మొహం దాచుకుని ఏడవసాగింది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra