Home » Balabhadrapatruni ramani » Priyathama O Priyathama


    "అభీ" అన్న నీరసమైన పిలుపు వినిపించి, అయోమయంగా అటూ చూసాడు.
    జానకి కనిపించింది.
    "అమ్మా" అంటూ, మంజీరని వదిలించుకుని ముందుకి అడుగువేసాడు.
    జానకి పరమ చీధరింపుగా చూసి, కొంగు నోట్లో కుక్కుకుని, అక్కడి నుండి వడివడిగా వెళ్ళిపోయింది.
    "అమ్మా" అంటూ ఆమెని ఆపడానికి వెళ్తున్న అభినవ్ ని పట్టి లాగుతూ,
    "అబ్బా ఆగండి! తరువాత 'సీన్' కోసం అప్పుడే ఎందుకు అంత తొందరా?" అంటూ నవ్వింది మంజీర.
    అతను వెనక్కి తిరిగాడు. మరు నిమిషంలో మంజీర చెంప అదిరిపోయింది.
    ఊహించని ఈ సంఘటనకి, చెంప చేత్తో పట్టుకుని ఆమె బిత్తరబోతూ చూసింది.
    "నాతో ఎన్ని ఆటలన్నా ఆడు! కానీ మా అమ్మతో కాదు! ఆ అమాయకురాలికి లోకంలో నేను తప్ప ఎవరూ లేరు! నీకులా ఏ సమస్య వచ్చినా డబ్బుతో పరిష్కరించే తండ్రి అండ నాకు లేదు. ఫర్లేదు, 'ప్రొసీడ్' అనే ఫాస్ట్ నెస్ మా అమ్మకి లేదు. బట్టలు కుట్టీ, ఊరగాయలు పెట్టీ, రెక్కలు ముక్కలు చేసుకుని నన్ను చదివిస్తోంది ఆ అమాయకురాలు. అంతేకానీ, ఇలా అమ్మాయిలకి నెలలు తప్పించి, గుళ్ళల్లో ప్రదక్షిణాలు చేయించే మగాడు అయిపోవాలి కొడుకని కాదు! ఈ విషయం నీకు ఆట కావచ్చు కానీ మా అమ్మకి ఎంత పెద్ద విషయమో నువ్వు ఊహించలేవు. నా పిచ్చికానీ, అసలు నీలాంటి మూర్ఖురాలికి ఏం తెలుస్తుంది తల్లీ బిడ్డల ప్రేమ గురించి" అని ఆమెకేసి ఓ చూపు చూసి, వేగంగా వెళ్ళిపోయాడు అభినవ్.
    మంజీరకి తల గిర్రున తిరిగింది. అతను కొట్టిన దెబ్బకన్నా ఎక్కువగా అతని చూపు బాధించింది. అందులో, "నిన్ను నేను జన్మలో క్షమించను సుమా!" అన్న భావం కనిపించింది. ఏదో అతన్ని అల్లరిపెట్టి, తల్లి అతన్ని బాగా తిడుతుంటే, వెనక నుంచి వెళ్ళి, నవ్వుతూ అసలు విషయం చెప్పేసి, "నిన్ను కాపాడేసాను చూడు! నాకు ఏమిస్తావు?" అని అడగాలనుకుంది. అతనితో 'రాజీ' పడి అతని ప్రేమని అర్థించాలనుకుంది! కానీ అనుకున్నదొకటీ, జరిగిన దొకటీనూ!


                                                  *    *    *    *


    నిండు గోదావరిలా నిశ్శబ్దంగా సాగిపోయే తల్లి, ఇలా వరద గోదావరిలా విరుచుకుపడుతుంటే, ఆమెని ఎలా సాంత్వన పరచాలో అభినవ్ కి అర్థం కాలేదు.
    ఆమె ఆవేశంగా అతన్ని తిట్టి, వెక్కి వెక్కి ఏడుస్తోంది.
    అతను నిస్సహాయంగా తల వంచుకున్నాడు. తను ఏం జవాబు చెప్పినా ఆమెని సంతృప్తి పరచలేనని అతనికి తెలుసు.
    మంజీరని చూడగానే, తనలో కలిగే 'స్పందన'కి భాష్యం 'ప్రేమ' అయితే, తానామెని గాఢంగా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమకి పర్యవసానం పెళ్ళి అయితే, అది జరుగుతుందో, జరగదో అతనికి తెలీదు. ఆర్ధిక అసమానతల గురించి తల్లి తర్కిస్తే, తన దగ్గర ఆమెని ఓడించే వాదన లేదు. అవతలి వైపున ఉన్నది తల్లి కాకపోతే అది వేరే విషయం! తల్లి కాబట్టి అతను అసహాయుడైపోయాడు.
    జానకి కాసేపటికి తెపరిల్లి అతనికేసి చూసింది. "పేదవాడి కోపం పెదవికి చేటు అన్నారు పెద్దలు. ఏదొచ్చి ఎటుపోయినా, చివరికి మనదే తప్పంటారు. జాగ్రత్త" అని లోపలికి వెళ్ళిపోయింది.
    "పేదవాడి కోపమే కాదు, ప్రేమ కూడా పెదవికి చేటే" అనుకున్నాడు, పెదవుల్ని పంటితో నొక్కిపెడ్తూ అభినవ్.
    అతనికి ఆ నిమిషంలో మంజీరని చూడాలని ఎంతగానో అనిపించింది. అటువంటి క్షణాలూ, అనుభూతులూ ప్రేమికులకి సాధారణంగా ఎదురవుతూనే ఉంటాయి.


                                                    *    *    *    *


    మంజీర మూసిన కన్ను తెరవకుండా పడుకుని ఉంది. గుడి నుంచి ఎలా వచ్చిందో ఆమెకే తెలియదు. పుట్టి బుద్దెరిగాక అంత దీర్ఘమైన రాత్రి ఎప్పుడూ చూడలేదనుకుంది. మాటిమాటికీ జరిగిన సంగతులు కళ్ళముందుకు మళ్ళీ వచ్చి అలజడి సృష్టిస్తున్నాయి. మనిషి కనిపెట్టే యంత్రాలకి "ఆన్, ఆఫ్" ఉన్నట్లే మానవుడి మనస్సుకి కూడా ఉంటే బావుండ్ను అనుకుంది.
    ఇంట్లో అరుంధతి తప్ప ఎవరూ లేరు. 'లూ' ఆమెకి ఎక్కడున్నా పన్నెండింటికి ఫోన్ చేసి, "మందులు వేసుకున్నావా?, అన్నం తిన్నావా?" అని అడుగుతాడు. ఆమె ఆ ఫోన్ కాల్ కోసం ఆశగా చూస్తోంది.
    మంజీర కూడా ఫోన్ మ్రోగినప్పుడల్లా ఆశగా చూస్తోంది.
    "మంజీరా సారీ!" అన్న అభినవ్ 'కాల్' కోసం!
    ఫోన్ మ్రోగింది!
    మంజీర గబుక్కున అందుకుంది.
    అరుంధతి పరుగున వచ్చి, గది గుమ్మం దగ్గరే ఆగింది.
    "నీకే" అంటూ ఇబ్బంది మంజీర నీరసంగా.
    "అరూ! రెడీగా వుండు, మనం ఒకచోటికి వెళ్ళాలి" 'లూ' హడావుడిగా చెప్తున్నాడు.
    "ఎక్కడికీ? మంజీర ఒంటరిగా ఉంది. ఇంకా జ్వరం తగ్గలేదు."
    "పని మనిషిని ఉండమను. ఒక గంటలో వచ్చేద్దాము" అంటూ అతను పెట్టేసాడు ఫోన్.
    "మంజూ! ఒంట్లో ఎలా ఉంది? బావ ఎక్కడికో..." అంటూ అరుంధతి చెప్తుంటే.
    "వెళ్ళిరా, నాకేం ఫర్వాలేదు" అంది మంజీర.
    అరుంధతి చెవులకి తెల్లరాళ్ల దిద్దులు పెట్టుకుంది. 'లూ' తెచ్చిన వంకాయ రంగు సిల్కుచీర కట్టుకుని, అద్దంలో చూసుకుంటే తనకి తనే ముద్దొచ్చింది. జుట్టుకి చిన్న రబ్బర్ బ్యాండ్ వేసింది.
    "బావా! నాకీ వయసులో ఈ నగలూ, అలంకరణా ఏమిటీ?" అని ఆమె సిగ్గుపడితే,
    "నీకేం వయసు మీరిపోయిందనీ! నలభై ఏళ్ళకి పెళ్ళికూతుళ్ళవుతున్న అమ్మాయిలు ఉన్నారు" అన్నాడు 'లూ'.
    కారు హారన్ వినిపించింది.
    "అరూ! అరూ!" అన్న అతని పిలుపు వినగానే,
    "వస్తున్నాను..." అంటూనే అతని ముందుకి వెళ్ళిపోయింది. ఆ పిలుపుకి అంత ప్రభావం ఉందన్నమాట.
    వెళ్తున్న అరుంధతిని చూస్తుంటే, మంజీరకి ఒక్కక్షణం కుళ్ళుగా అనిపించింది. "అందరూ 'హ్యాపీ'గా ఉన్నారు, నేను తప్ప" అనుకుంది.
    లూ అరుంధతిని కళ్ళార్పకుండా చూశాడు.
    "అరూ, నీ ముందు ఈ కాలం అమ్మాయిలూ ఎందుకు పనికి వస్తారు? బొండుమల్లె చెండులా ఎంత ముద్దొస్తున్నావ్?" అన్నాడు.
    అరుంధతి చిరుకోపంగా "రోజు రోజుకీ చిన్నపిల్లాడిలా ఏం మాటలవీ?" అంది.
    "నీకు నేనూ, నాకు నువ్వూ ఎప్పుడు చిన్నపిల్లలమే! ఇంక ఎప్పుడూ అలా వయసు గుర్తుచెయ్యకు. నాకు కోపం వస్తుంది" అన్నాడు చిన్నపిల్లాడిలా కోపం తెచ్చుకుంటూ.
    అరుంధతి నవ్వేసి, "ఇంతకీ ఎక్కడికీ ఈ అర్థాంతరపు ప్రయాణం?" అంది.
    "కార్లో చెప్తా పద!" అన్నాడు.
    ఆమె అతన్ని అనుసరించింది.
    కార్లో చెప్పాడు. ఇల్లు కొందామనుకుంటున్నాను. ఒకసారి నీకు చూపిద్దామనీ!"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra