Home » Vasireddy seeta devi novels » Sandhi Yugamlo Sthree


    ఆ మధ్య ఒక గృహిణి ఒకడు బ్లాక్ మెయిల్ చెయ్యసాగాడు. భర్తలేనప్పుడు ఇంటికి వచ్చి నోటికి వచ్చినవి మాట్లాడేవాడు కారణం కాలేజీలో చదువుకొనే రోజుల్లో ఇద్దరూ సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఇద్దరూ కలిసి తీయించుకున్న ఫోటోలు ఉన్నవి వాళ్ల లవ్ ఎఫైర్ గురించి ఆ కాలేజీలో చదివిన చాలామందికి తెలుసు అతను కట్నం కోసం వేరే అమ్మాయిని పెళ్ళిచేసుకున్నాడు.   
    ఆమె తల్లిదండ్రులు చూసిన అబ్బాయిని బుద్ధిగా పెళ్ళి చేసుకుంది ఒకరోజు అతన్ని తన ఇంటికి రావద్దని గట్టిగా చివాట్లు వేసింది ఆమె భర్తకు ఫోటోలు, ఉత్తరాలు చూపిస్తానని బెదిరించాడు తనతో రహస్య సంబంధం పెట్టుకుంటే ఈ విషయం బయటకు రాకుండా చూస్తానన్నాడు ఆ అమ్మాయికి కోపం వచ్చింది అసహ్యం వేసింది.  
    అతను ఆలోచించుకోడానికి రెండు రోజులు అవకాశం ఇచ్చి వెళ్ళాడు ఆమె ఆ నరకాన్ని భరించలేకపోయింది ఆ దుర్మార్గుడు అన్నంత పని చేస్తాడని ఆమెకు తెలుసు అందుకే ధైర్యం చేసి ఆ రాత్రి భర్తతో తనే అన్ని విషయాలూ చెప్పింది.    
    అతను ఆ రాత్రి ఏమి అనలేదు రెండో రోజు ఆమెతో ముభావంగా ఉన్నాడు బాంబు ఎప్పుడో పేలుతుందని ఆమెకు తెలుసు ఆదివారం ఉదయమే అతను వచ్చాడు ఆఫీసు గదిలో భర్తతో అతడు మాట్లాడుతున్నాడు నిలువెల్లా వణికిపోతూ తలుపు చాటున వాళ్ళ సంభాషణ వింటూ నిలబడింది.
    "మిస్టర్! నాకంతా తెలుసు సుశీల నాకు అన్నీ చెప్పింది ఆమె చేసిన తప్పే నువ్వూ చేశావు. కాని ఆమె బ్లాక్ మెయిల్ చేస్తుందనే భయం నీకులేదు. ఎందుకంటే నువ్వు మగవాడివి నీ భార్య నిన్ను వదిలెయ్యదు పెళ్ళికి ముందు నేనూ ఒక అమ్మాయిని ప్రేమించాను ఆమెతో తిరిగాను నా భార్య ఎవరూ చెయ్యని ఘోర అపరాధం ఏదో చేసిందని నేను అనుకోవడం లేదు ఇక నుంచి ఈ గడప తొక్కకు. యూ గెట్ అవుట్!" అన్నాడు ఆమె భర్త. అతను తల దించుకుని వెళ్ళిపోయాడు ఆమె భర్త ఆమె దగ్గిర ఆ విషయాలు ఎప్పుడూ మాట్లాడలేదు ఎప్పటిలాగే ఉంటున్నాడు ఇలాంటి సంస్కారం ఎందరిలో ఉంటుంది పురుషులంతా ఇలా ఆలోచించగలిగితే స్త్రీల కథలు ఇలా వుండవు.
    బ్లాక్ మెయిల్ చేసే మగవాడు హంతకుడి కంటే హీనుడు. అలాంటి వాళ్ళను సహించి వూరుకోకూడదు.
                                          ఎవరితోనూ చెప్పకేం?
    చాలామందికి రహస్యాలను మనసులో దాచుకోలేరు ఈ విషయం ముఖ్యంగా ఆడవాళ్ళను గురించే చెప్పాలి." ఆడదాని నోట్లో నువ్వు గింజ నానదు" అంటూంటారు కొంత వరకు అది నిజమేనేమో అనిపిస్తుంది. "ఎవరితో చెప్పవద్దు. నా మీద ఒట్టే" అంటూ ఏదో రహస్యం కమల విమలతో చెబుతుంది ఆ చెప్పినప్పటి నుంచీ కమలకు నిద్ర పట్టదు విమల ఎవరితోనైనా చెప్పిందేమోనని కమల తను తన మనసులో దాచుకోలేని విషయాన్ని విమల మాత్రం ఎలా దాచుకోగలుగుతుంది అని ఆలోచించదు విమల మరొకరికి "ఇలా కమల చెప్పిందని నేను చెప్పినట్లు ఎవరికీ చెప్పకేం? కమలకు మాటిచ్చాను ఎవరినీ చెప్పనని" అంటుంది విమల.
    తీరా చెప్పాక భయం పట్టుకుంటుంది ధనస్సు నుంచి బాణం వదిలాక పశ్చాత్తాప పడి లాభం లేదు. ఆ తరువాత ఎప్పుడైనా కమల కనిపించి ఏ కారణం చేతనైనా సరిగా మాట్లాడకపోతే విమలకు సుజాత మీద అనుమానం వస్తుంది సుజాతను వెళ్ళి నేను చెప్పిన విషయం కమలకు చెప్పేశావా అని అడుగుతుంది సుజాత ఎన్ని ఒట్లు వేసుకున్నా కమల నమ్మదు విమలలో గిల్టీ కాంక్షస్ (అపరాధభావం) ఏర్పడి కమలతో మొదటిలా హాయిగా మాట్లాడలేదు.
    కొందరు ఇంటిగుట్టును కూడా బయట పెట్టేసుకుంటారు మనసుకు బాధపెడుతున్న విషయాల్ని ఎవరికైనా చెప్పుకోవాలని మానవహృదయం ఆరాటపడుతుంది మరొకరికి చెప్పగానే కొంత గుండెల్లోని గుబులును దించేసుకున్నట్లు, తాత్కాలికంగా మనసు వూరట చెందవచ్చును కాని అది ఎంతోకాలం నిలవదు అసలు రహస్యం బయటపడుతుందేమోననే భయం మనసును చిట్టి వేస్తుంది అసలు బాధకంటే ఈ బాధ ఎక్కువై నిద్రకు కూడా దూరం కావాల్సి వస్తుంది.
    పుట్టింటి రహస్యాలు అత్తగారింటిలోనూ అత్తింటి రహస్యాలు పుట్టింటిలోనూ చెప్పే ఆడపిల్లలకు మనశ్శాంతి ఉండదు పుట్టింటివారు అత్తవారింటిని విమర్శించినపుడు అత్తగారింటిని, అత్తగారింట్లో పుట్టింటిని విమర్శించినపుడు పుట్టింటిని సమర్థించడంలోనే సుఖశాంతులు ఇమిడి ఉంటాయి.  
    స్నేహితుల మధ్య కూడా ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. మీనాక్షీ, సుందరీ, సరోజా సన్నిహితంగా ఉంటారు కాని అందులో ఏ ఇద్దరూ మూడో వ్యక్తి లేకుండా కలుసుకున్నా మూడో వ్యక్తి మీద మాట్లాడుకుంటారు. సరోజ ఒకరోజు సుందరితో మీనాక్షికి చదువుకునే రోజుల్లో ఒక ప్రియుడు ఉండే వాడనీ వాళ్ళిద్దరి కథా చాలా దూరం వెళ్ళిందనీ, ఒక అబార్షన్ కూడా అయిందనీ, చెప్పేసింది సరోజా మీనాక్షీ కలసి చదువుకున్నారు తీరా చెప్పాక సరోజకు భయం పట్టుకున్నది సుందరి చేత ఒట్టు కూడా వేయించింది ఒకసారి ఏదో విషయం మీద సుందరికీ, సరోజకూ మధ్య మాటా మాటా పెరిగింది ఇంకేముంది సుందరి మీనాక్షితో "సరోజని గురించి ఇలా చెప్పింది" అంటూ చెప్పేసింది స్నేహంగా ఉన్నప్పుడు చెప్పుకున్న విషయాలను విరోధం వచ్చినప్పుడు బయటపెట్టడంకు సంస్కారానికి తార్కాణం.
    కొందరికి "ఫలానా వాళ్ళు నిన్ను ఇలా అన్నారు అలా అన్నారు" అని చెప్పే అలవాటు ఉంటుంది. అలాంటి వారివల్ల మనసుకు వ్యధ కలుగుతుంది చెప్పుడు మాటలు వినడం వల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయి ఫలానా వాళ్ళు నీ గురించి ఇలా అన్నారు అని చెప్పే వ్యక్తి నీ గురించి కూడా అలాగే చెబుతుందని అర్థం చేసుకోవాలి. అలా చెప్పేవాళ్ళు మళ్ళీ అడగవద్దని ప్రాధేయపడతారు.
    మా పక్కింటి వాళ్ళకూ, మాకూ ఒకే పనిమనిషి ఉండేది ఒకరోజు మా పనిమనిషి లక్ష్మి వచ్చి "అమ్మా! పక్కింటి కాంతమ్మ మీకు గర్వం అంటూ ఉంటుంది మీరు పైకి చూసి నడుస్తారట మేడమీద నిలుచుని కుళాయి దగ్గర పోట్లాటలు గురించి రాస్తారట" అంటూ ఇంకా ఏమేమో చెప్పసాగింది నాకు కోపం వచ్చింది కాంతమ్మ మీద కాదు అలా వచ్చి చెప్పిన లక్ష్మి మీద "కాంతమ్మను అడగనా?" అన్నాను. "నీ కాళ్ళకు మొక్కుతా అడక్కండి. అడక్కండి. నా కొలువుపోతుంది." అంటూ ప్రాధేయపడసాగింది.
    ఇంకెప్పుడూ నా దగ్గిరకు వచ్చి వాళ్లు ఇలా అన్నారూ. వీళ్ళు అలా అన్నారూ అని చెప్పకు" అంటూ మందలించాను? లక్ష్మి ముఖం ముడుచుకున్నది కాంతమ్మతో ఒకప్పుడు హాయిగా మాట్లాడేదాన్ని ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాను బాగా చదువుకున్న వాళ్లు కూడా ఇలా చెబుతూ ఉంటారు నిజంగా అలా వచ్చి చెప్పే వాళ్ళకు మన మీద అభిమానమే ఉంటే మనకు వచ్చి మన మనసును బాధపెట్టరు అలా అన్న వాళ్ళనే మందలిస్తారు.  
    "కాలు జారితే తీసుకోవచ్చును నోరు జారితే తీసుకోలేం" అంటారు నిజమే మాట్లాడితే ముందే మాట్లాడాలి ఒకవేళ కష్టం సుఖం చెప్పుకున్నా యోగ్యుల దగ్గిర చెప్పుకోవాలి. లేదా - "నేను అలా అనలేదు ఇలా అన్నాను." అంటూ ప్రతివారికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తుంది. చాడీలు చెప్పడం దురలవాటు వినడం కూడా చెడు అలవాటే. ఎక్కడ విన్నవి అక్కడే మరిచిపోవడానికి ప్రయత్నించాలి.   
    ఇద్దరి స్నేహితుల మధ్య గండి ఏర్పడే మాటలు చెప్పకూడదు అలా చెప్పే వాళ్ళని మందలించాలి వాళ్లు అడగవద్దని ప్రాధేయపడ్డా అడిగి నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి అప్పుడు గాని ఇలాంటి మాటలు చెప్పే వాళ్ళకు బుద్ధిరాదు ఎక్కువ మాట్లాడటం ఒక జబ్బు. ఎక్కువ వినడం ఒక కళ. దీన్నీ అలవరుచుకున్న వాళ్ళను ఎక్కువమంది గౌరవిస్తారు ప్రేమిస్తారు.       
                                               ఉన్న మాట అంటే?
    "మీకింత స్త్రీ పక్షపాతం పనికిరాదు. తప్పకుండా మగవాళ్ళదేనంటారా? గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి!" ఒక యువకుడు నిలదీసి అడిగాడు.
    "ఏ విషయం?"
    "అదే మానభంగాల గురించి రాశారుగా? ఇలాంటి దుశ్చర్యలకు మీ ఆడవాళ్ళే కారణం! ఎందుకంటారు కదూ? మన సాంప్రదాయం ప్రకారం బట్టలు వేసుకుంటున్నారా మీ ఆడవాళ్ళు? ఈ మాక్సీ లేమిటి? ఈ ప్యాంటు లేమిటి? అంగసౌష్టవ ప్రదర్శనలు చేస్తూ బజార్లో తిరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారా మగవాళ్లు!"  
    'ఊరుకోకపోతే పళ్ళురాలగొడ్తారు' మనసులోనే అనుకున్నాను. ఆ యువకుడ్ని కిందకు పైకి చూశాను మెడల వరకు జుట్టు, లంగాలాబెల్ బాటం ప్యాంటు చుక్కల షర్టు నాకు నవ్వు వచ్చింది 'బాబూ! కోప్పడకు: ఒకటి అడుగుతాను చెప్పు: నీ డ్రస్సు మన సంప్రదాయ ప్రకారమే ఉందా? చక్కగా ధోవతి కట్టుకొని, పిలక పెట్టుకొని, వల్లెవాటువేసుకోక ఇదేం వేషం చెప్పూ:" అన్నాను పొద్దున్నే యింటికి వచ్చిన వ్యక్తిని బాధపెట్టాల్సి వచ్చినందుకు కొంచెం బాధపడుతూనే అన్నాను.
    అతని ముఖం ముడుచుకుపోయింది.
    "అది కాదండి? మన సంప్రదాయం ప్రకారం ఆడపిల్ల ఒక చక్కటి చీర, రవిక తొడుక్కుని కంటికి కాటుక, నొసటన బొట్టూ పెట్టుకొని, వదులుగా వాలుజడ వేసుకొని పువ్వులు పెట్టుకొని.... వయ్యారంగా హంస నడకలు నడుస్తుంటే.... -- "ఆహా! ఏమి వర్ణనయ్యా:" అన్నాను మధ్యలోనే అందుకొని. ఆ యువకుడి ముఖం కోపంతో తుమతుమలాడింది" బాబూ: నీకు ఈ సంగతి తెలియదేమో గతంలా మక్సీలు తగిలించుకోవడంలో, ప్యాంటూ షర్టూ వేసుకోవడంలో లేని ఆకర్షణా, అందం ఆ మాటకొస్తే నువ్వు చెప్పిన డ్రెస్సులోనే వుంది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra