Home » Vasireddy seeta devi novels » Sandhi Yugamlo Sthree


                                    అప్పు ఇచ్చి చూడు!
    ఆంటీ! మా అమ్మ ఒక కిలో బియ్యం ఉంటే అప్పు ఇవ్వమన్నది. రేపు సాయంత్రం ఇచ్చేస్తుందట." ఒక పన్నెండేళ్ళ పిల్ల లలిత దగ్గరకు వచ్చింది.
    "లేదమ్మా. ఇవ్వాల్టికి బొటాబొటిగా ఉన్నాయ్" అనేసింది లలిత. ఆ పిల్ల ముఖం చిన్న చేసుకొని ఖాళీ చేతితో తిరిగి వెళ్ళింది. లలిత నాకేసి తిరిగింది నేను ఆ అమ్మాయి వెళ్ళిన వైపే చూస్తూ ఆలోచిస్తున్నాను." ఏమిటి ఆలోచిస్తున్నావ్?" అన్నది లలిత.
    "అబ్బే ఏం లేదు" అన్నాను.
    "నాకు తెలుసులే నువ్వేం ఆలోచిస్తున్నావో? యిలాంటి వాళ్ళమీద జాలి చూపకూడదు ఈ అమ్మాయి నాన్న మావారి ఆఫీసులోనే పని చేస్తున్నాడు. మావారి కంటే జీతం ఎక్కువే. అయినా వూరి నిండా అప్పులు నిన్న ప్రొద్దున చుట్టాలు వచ్చారని గిన్నెడు నెయ్యి తీసుకెళ్ళారు నాలుగు రోజుల కింద అర్థకిలో చక్కెర తీసుకెళ్ళారు. నాలుగు నెలలు అయింది ఏభయి రూపాయలు అప్పు తీసుకున్నారు ఇంత వరకు ఒక్కటీ తిరిగి ఇవ్వలేదు.
    దాదాపు ఇరుగు పొరుగు అందరిళ్ళకూ చేబదుళ్ళకోసం తిరుగుతూనే ఉంటారు. జీతం అందగానే కనీసం అప్పులు తీరుద్దామనే ఆలోచన కూడా ఉండదు. రకరకాల పిండివంటలు చేసుకు తింటారు. రోజుకొక సినిమాకు వెళ్తారు. పదిహేనో తేదీ నుంచి ఊరి మీద పడ్తారు ఎక్కడా అప్పు దొరక్కపోతే ఇంట్లో సామాను మార్వాడీ ఇంట్లోకి వెళ్తుంది పట్టుచీరలు కూడా కుదువపెట్టి ఇంట్లో పరమాన్నం వండుకు తింటారు. భార్యకు ఆ మొగుడు అదేమిటని కూడా అడగడు" అన్నది లలిత.  
    దీన్నే అప్పుచేసి పప్పుకూడు తినడం అంటారు. ఆడవాళ్ళే కాదు -- చాలామంది మగవాళ్ళు కూడా తమ అవసరాలకు అప్పు తీసుకుంటారు. మళ్ళీ ఇవ్వాల్సి వచ్చేసరికి మనసు ఒప్పదు.


    రామం, శివం ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు ఇద్దరూ సన్నిహితంగా ఉంటారు రామం శివం దగ్గర ఒకరోజు రెండువందలు అడిగి తీసుకున్నాడు. ఫస్టు తారీఖు జీతం రాగానే ఇస్తానన్నాడు. "నా భార్య ప్రసవించే రోజులు దగ్గర పడ్తున్నాయి. ఆ అవసరం కోసమే ఎలాగో ఈ రెండు వందలూ కూడబెట్టాను. ఫస్టుకు తప్పక ఇవ్వాలి" అన్నాడు శివం "తప్పక ఇస్తాను అన్నాడు రామం ఫస్టు తారీఖు వచ్చింది అకౌంటెంటు బాంకు నుంచి రాగానే రామం జీతం తీసుకొని అర్థ రోజు సెలవుపెట్టి వెళ్ళిపోయాడు.
    నాలుగు గంటలకు శివం రామం సీటు దగ్గిరకు వెళ్ళాడు. సంగతి విని తెల్లముఖం వేశాడు ఆ తర్వాత రామం రెండు రోజులు ఆఫీసుకు రాలేదు. మూడో రోజు వచ్చాడు శివం డబ్బు అడిగాడు రామం జేబులో చెయ్యిపెట్టి పాతిక రూపాయలు తీసి "ప్రస్తుతానికి ఇంతే ఉంది. మిగతాది తర్వాత ఇస్తాలే" అన్నాడు దబాయింపుగా శివం ఏమి అనలేకపోయాడు అప్పుడో పది అప్పుడో పది ఇస్తూ రామం శివం అప్పు తీర్చడానికి దాదాపు సంవత్సరం గడిపాడు.
    అప్పు ఇచ్చి అవసరానికి ఆదుకోవడం మంచిదే. కాని తీసుకున్నవాడు అడిగేప్పుడు చూపించే వినయం ఇచ్చేప్పుడు చూపించడు. తన అవసరాల్నీ, కష్టాల్నీ రకరకాలుగా వర్ణించి చెబుతాడు ప్రాధేయపడ్తాడు ఆ తర్వాత అప్పు ఇచ్చినవాడు వినయంగా ఆడగాల్సి వస్తుంది అప్పు తీసుకొని అడక్కుండా ఇచ్చేవారు చాలాకొద్దిమంది ఉంటారు.
    కొందరు వ్యాపారస్థులు బాగా ఉన్నవాళ్ళే పెద్ద పెద్ద అమౌంట్స్ తీసుకుంటారు. ఆ తర్వాత ఆ డబ్బు వసూలు చేసుకోవడానికి ఇచ్చినవాడు నానాయాతనలూ పడ్తాడు. ఇస్తానులేవయ్యా నీ డబ్బు ఎగేసి పారిపోతానా ఏం? "అంటూ దబాయిస్తాడు అప్పు తీసుకున్నవాడు." అది.... కాదు నాకు.... చాలా అవసరంగా ఉంది. అంటూ "నీళ్ళు నములుతాడు ఇచ్చినవాడు".
    మాకు బాగా తెలిసిన ఒక వ్యక్తి ఒకసారి నా దగ్గర ప్రాణం మీదకు వచ్చిందని వెయ్యి రూపాయలు అప్పు తీసుకున్నాడు మూడు రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానన్నాడు బీదవాడేం కాదు మూడు నెలలు గడిచి పోయాయి. అతను అప్పు గురించి మాట్లాడడు ఒకసారి ఫోన్ చేసి గుర్తుచేశాడు. సాయంకాలం 'చెక్' పంపిస్తున్నానన్నాడు. చెక్ రాలేదు. మనిషి రాలేదు. ఇప్పటికి మూడేళ్ళు అయింది నాలుగైదుసార్లు అడిగాను.  చివరికి నాకే సిగ్గు అనిపించి అడగడం మానేశాను.
    "ఆవిడకేం పిల్లా పీచా, పెద్ద ఉద్యోగం. పైగా కథలూ గట్రారాసి సంపాదిస్తుంది ముష్టి వెయ్యి రూపాయలకు ఎన్నిసార్లు అడిగిందో నేనేం ఎగగొట్టి పారిపోతానా?" అని అన్నాడట మాకు తెలిసిన వ్యక్తి దగ్గర నా మనసు చివుక్కుమన్నది అడిగేద్దాం అనుకున్నాను డబ్బు ఎటూ రాదు విరోధం కొని తెచ్చుకోవడం అవుతుందని వూరుకున్నాను. ఇప్పుడు ఆ అప్పు గురించి ఇద్దరం మరిచిపోయినట్టే నటిస్తాము.  
    అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మంచిది అంటారు పెద్దలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఫర్వాలేదు అనుకున్న వాళ్ళకే అప్పు ఇవ్వండి అప్పు ఇచ్చి అడక్కండి విరోధం వస్తుంది పెద్ద మొత్తాలు అడిగినప్పుడు బాంకు అప్పు ఇస్తుందని చెప్పండి వాళ్ళే మనుకుంటారో అని మొహమాటపడకుండా "నేను అప్పులు ఇవ్వను. తీసుకోను " అని నిర్మొహమాటంగా చెప్పండి అంతేగాని అప్పు ఇచ్చి, జంకుతూ జంకుతూ మీ డబ్బు మీరు అడగడానికి నానా బాధలూ పడవద్దు.
                                                   బ్లాక్ మెయిల్
    బ్లాక్ మెయిల్ అనేకరాకాలు. ఇక్కడ నేను కొందరు యువతులు ఈ బ్లాక్ మెయిలుంగుకు ఎలా గురి అయి జీవితాలు పాడు చేసుకుంటున్నారో మాత్రమే చర్చిస్తాను.
    సునంద (పేరు కల్పితం) ఒక ప్రభుత్వ ఆఫీసులో పని చేస్తున్నది ఆమె ఎం.ఏ. పాసయింది పరువు ప్రతిష్టలుగల కుటుంబానికి చెందిన యువతి దాదాపు 25(ఇరవై అయిదు సంవత్సరాలు ఉంటాయి. కొంతకాలం  పెద్దవాళ్లు మంచి సంబంధాలు దొరక్క పెళ్ళి చెయ్యలేదు. ఆ తర్వాత ఆమె కొంతకాలం పెళ్ళి చేసుకోనని మొండికి వేసింది.      
    ఆ మధ్య సునంద తమ్ముడు కన్పించి వాళ్ళ అక్క వివాహం నిశ్చయం అయిందని చెప్పాడు. ఒక డాక్టర్ తో వివాహం నిశ్చయం అయింది సునంద అన్నగారు కూడా డాక్టరే. ఆయనే ఈ సంబంధం కుదిర్చాడు.    
    సునంద వివాహం జరిగిందో, లేదో తెలియదు నాకు ఆహ్వానం పంపించడం మర్చిపోయి ఉంటుందనుకున్నాను ఆ మధ్య ఒక షాపులో కన్పించింది వివాహం గురించి అడిగాను ఆ అమ్మాయి కళ్ళలో దిగులు నీడలు కదిలాయి.
    వివాహం కాలేదని చెప్పంది. కారణం అడిగితే ఆ అమ్మాయికి ఆమెతో పని చేస్తున్న సరోజ అన్నగారితో పరిచయం అయింది సరోజ ఏదో వంకతో ఆమెను తన ఇంటికి తీసుకెళ్ళేది. సరోజ అన్న సురేంద్ర ఇంజనీరు క్రమంగా సునందతో పరిచయం పెంచుకున్నాడు వయసులో ఉన్న సునంద అతని వైపు మొగ్గింది కాని హద్దులు దాటలేదు.
    అతను సునందను ఎలాగయినా లొంగదీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. "నువ్వు లేకుండా బతకలేనని ఏడ్చేవాడట." ఒకసారి అతను ఏదో ట్రైనింగుకు ఢిల్లీ వెళ్ళాడు రోజుకు ఒక ఉత్తరం రాయమని ప్రాధేయపడ్డాడట ఆ అమ్మాయి ఎన్నో ఉత్తరాలు రాసింది ఒకరోజు సరోజతో వాళ్ళింటికి వెళ్ళిందట సురేంద్ర భార్యకు అనుమానంగా ఉంది సునందను దులిపేసిందట సునంద ఆలోచనలో పడ్డది.
    ఈ ప్రయాణానికి గమ్యం ఆమెకు కన్పించలేదు తను చేస్తున్నది తప్పు అని తెలుసుకున్నది. దాంతో సురేంద్రను కలుసుకోవడం మానేసింది ఎంతో బాధపడింది అయినా మనసును అదుపులో పెట్టుకుంది అన్న తెచ్చిన సంబంధం ఒప్పుకుంది ముహూర్తాలు పెట్టారు ఆ సంగతి తెలిసి సురేంద్ర సునందను బెదిరించసాగాడు ఆ ఉత్తరాలు పెండ్లిపందిట్లో పెళ్ళి కొడుక్కి ఇస్తానని బెదిరించసాగాడు  దాంతో సునంద బెదిరిపోయింది అన్నకు చెప్పాలంటే భయం, తండ్రికీ చెప్పలేదు.
    చివరికి ధైర్యంచేసి పెళ్ళికుమారిడికే ఉత్తరం రాసింది అన్ని విషయాలూ రాసింది ఈ వివాహం తనకు ఇష్టం లేదని చెప్పి ఈ సంకటం నుంచి తనను రక్షించమని కోరింది. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచమని కూడా కోరింది అతను సంస్కారం గలవాడు అసలు విషయం చెప్పకుండా తనకు ఆ వివాహం ఇష్టం లేదని చెప్పేశాడు.     
    ఆ మధ్య ఒక యువతి సర్వీస్ హోంలో చేర్పించమని నా దగ్గరకు వచ్చింది ఆమె కథ యిది -- ఆ అమ్మాయికి ఎవరూ లేరు తల్లిదండ్రులు పదేళ్ళ వయస్సులో పోయారు. అక్కగారి ఇంట్లో పెరిగింది బావగారు చండశాసనుడు అక్కను నానా బాధలు పెడుతూ ఉంటాడు మరదలు పెద్దదైంది ఆ అమ్మాయిని బలవంతంగా లొంగదీసుకున్నాడు అక్కకు కూడా తెలుసు. అయినా కిక్కురుమనలేదు ఆ అమ్మాయికి పెళ్ళి చేయడం బావగారికి ఇష్టం లేదు.
    ఒకసారి మేనమామ వరుసైన పెద్దమనిషి వస్తే ఆ అమ్మాయి అక్క తనగోడు వెళ్ళబోసుకుంది. ఆ మేనమామ ఆ పిల్లకు పెళ్ళి చేశాడు బావగారికి యిష్టం లేదు అయినా తను ఏమి అనలేకపోయాడు మరదలుతో పెళ్ళి చేసుకోనని చెప్పమని చెప్పాడు, బెదిరించాడు ఆ అమ్మాయి వినలేదు పెళ్ళి అయింది అత్తగారింటికి వెళ్ళింది.      
    నెల తిరక్కుండా మళ్ళీ అక్క యింటికి చేరింది ఆమె బావగారు ఆ అమ్మాయి భర్తకు తమ మధ్య ఉన్న అక్రమసంబంధాన్ని గురించి చెప్పాడు తిరిగి వచ్చిన మరదలు మీద మరీ దౌర్జన్యం ప్రారంభించాడు అందుకే ఆ అమ్మాయి ఇంటి నుంచి పారిపోయి వచ్చింది సర్వీస్ హోంలో చేరింది.
    ఇలాంటి కథలు ఎన్నో వింటుంటాం! ఇలా ఎందుకు జరుగుతున్నది? మగవాడికి ఒక నీతి, ఆడదానికి ఒక నీతి అనే సంస్కారాన్ని వంట బట్టించుకోవడం వల్లనే!

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra