Home » Chandu harshavardhan » The Partner

 

    "నేను ఏం చేశాను ఏంటి? నువ్వే నన్ను ఊపిరి అడనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావాయే" అన్నది లలిత.
    "అయినా నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కోరికలను తీర్చుకుంటాం. ఈ వయసులో కాకపోతే ముసలివాళ్ళం అయ్యాక సుఖపడదామంటావా చెప్పు?" అంటున్నాడతను.
    "ఛ- ఛ ....అలా అని కాదు డియర్.... పిల్లలు వచ్చే టైం అయింది కదా అని."
    'అప్పుడే రారులే వాళ్ళు వచ్చే లోపు...."
    "ఊ.....సరే"
    ఆ తరువాత చాలాసేపు మాటలు వినిపించడం ఆగిపోయాయి.
    లలితా తీయని నిట్టూర్పులు మాత్రం వుండుండి వినిపిస్తున్నాయి.
    "డియర్, ఎంక్వయిరీ కోసం ఒక ఇన్ స్పెక్టర్ వచ్చింది."
    "ఎందుకు?"
    "ఎందుకేమిటి.....? మా అయన కోసం.....ఎక్కడకు వెళ్ళాడు.... ఎప్పుడు వస్తాడు అని రకరకాల ప్రశ్నలు వేసింది."
    "మరి నువ్వేం చెప్పావు....?"
    "చెప్పడానికి ఏముంది ....జరిగిందే చెప్పాను.....ఆ రోజు పోట్లాడి వెళ్ళిపోయిన మనిషి తిరిగి ఇంతవరకూ రాలేదు. ఇప్పుడు మీరొచ్చి అడుగుతుంటే ఏమయినా తెలిసిందేమోనని ఆశపడ్డాను . అసలు అయన ఎప్పుడూ ఇన్ని రోజులు రాకుండా వుండలేదు . ఆ రంకులాడి ఇంటికి వెళ్ళి వుంటారేమో కనుక్కోమని దాని అడ్రస్ ఇచ్చాను. బహుశా అక్కడకు కూడా వెళ్ళి వుండవచ్చు....అది ఏం చెప్పిందో?"
    "వాళ్ళ ముందు భయపడితే నిన్నే అనుమానిస్తారు. మన విషయం కూడా రాబడతారు. అందుకే భయపడకుండా వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పు.....అర్ధం అయిందా?"
    "అలాగేలే డియర్....." అన్నది లలిత.
    తరువాత ఇద్దరి మాటలు వినిపించడం ఆగిపోయాయి.
    ఇంకొక ఐదు నిమిషాల తరవాత గది తలుపులు తెరచుకుని బయటకు వచ్చిన ఆ వ్యక్తీ సోఫాలోని పిల్లలను చూసి గతుక్కుమన్నాడు.
    వాళ్ళు ఆ ముఖం చూడకముందే గబగబా చీకట్లలో కలిసిపోయాడు.
    అతని వెనుకనే వచ్చిన లలిత పిల్లలను చూసి ముఖం చిట్లించింది.
    "మమ్మీ..... మొన్న ఒకరోజు పోలీస్ అంటీ మా కాన్వెంట్ కు వచ్చింది...."
    "మీ నాన్నను ఆఖరి సారిగా ఎప్పుడు చూశారు? అని అడిగింది"
    సమాధానం ఏం చెప్పారోనని వాళ్లావేపు ఆందోళనగా చూసింది లలిత.
    "మా క్లాస్ టీచర్ కూడా ఫరవాలేదు..... బభయపడకండి..... మీకు తెలిసింది చెప్పండి అన్నది"
    "ఏం చెప్పారు ?" వాళ్ళ వేపు కోపంగా చూస్తూ గద్దించింది లలిత.
    "ఆరోజు ఉదయం మా అమ్మపై పెద్దగా కేకలు వేసి అమ్మ పిలుస్తున్నా వినిపించుకోకుండా డాడీ వెళ్ళిపోయారు తరవాత నుంచి ఇంటికి కూడా రావడం లేదు అని చెప్పాం."
    పిల్లలు ఇద్దరూ ఒకేమాట కోరాస్ గా చెప్పారు.
    'ఇంటి విషయాలు ఇంటిలో జరిగిన గొడవలు అలా బయటవాళ్ళకు చెప్పెయడమేనా?" అంటూనే ఇద్దరికీ నాలుగు వడ్డించింది.
    పిల్లలు ఇద్దరూ బిక్కమొఖం వేశారు.
    "ఇంకెప్పుడూ చెప్పం మమ్మీ? ప్రామిస్"
    ఏడుస్తూ , వెక్కిళ్ళతో చెప్పారు పిల్లలు.......
    "చెప్పింది చాలు కానీ ........రేపటి నుంచి కాన్వెంటు కు వెళ్ళడం మానేయ్యండి."
    'అదేమిటి మమ్మీ! రేపటి నుండే మాకు ఫస్ట్ యూనిట్ పరీక్షలు!"
    "పరీక్షలు లేవు.... గిరిక్షలు లేవు ....నోరు మూసుకుని ఒంటిలోనే పడి వుండండి...."
    ఇద్దరినీ చెరో రెక్క పట్టుకుని ఇంటిలోకి లాక్కు వెళుతూ దుమదుమ లాడింది లలిత..... తాము చేసిన తప్పు ఏమిటో అర్ధం కాలేదు ఆ చిన్నారిహృదయాలకు.....


                                                           *    *    *

 

    ఫోన్ రింగ్ అవడంతో రిసీవర్ తీసింది ఇన్ స్పెక్టర్ ధీరజ.
    "మేడమ్ !" అంటూ వినిపించిన గొంతును గుర్తు పటిందామే.
    చేస్తున్న పనిని ఆపి, లోగొంతుకతో రిప్లయ్ యిచ్చింది.
    "ఎస్! నేనే మాట్టాడుతున్నాను.... నువ్వు వెళ్ళినపని ఏమయింది?"
    "మీ అనుమానం కరెక్టే మేడమ్ ! మీకు ఆకాశరామన్న ఫోన్లు చేస్తున్న ఆ వ్యక్తీ ఎవరో ఎక్కడ నుంచి మాట్లాడుతున్నాడో తెలిసింది. కానీ అతనే ఆ పని చేస్తున్నాడని మనం నిరూపించలేము" అంటూ వినిపించింది అవతలి వైపు కంఠం.
    "అవును, అందుకే నీకప్పగించిన ఆ పనిమీదే వుండు. అది పూర్తీ అయ్యేవరకూ నీకు వేరే డ్యూటీ ఏమీ లేదు. అతనిని నీడలా వెన్నంటి వుంటూ మనకు అవసరం అయిన ఆధారాలు సేకరిస్తూ వుండు. అతని మూవ్ మెంట్స్ ఎప్పటికప్పుడు నాకు తెలియ చేస్తుండాలి. మనం అతనిని అనుమానించినట్టు అతనికి ఎంత మాత్రం తెలియడానికి వీల్లేదు. అర్ధమయిందా?"
    "అర్ధమయింది మేడమ్"
    "యింకేమయినా చెప్పేది వుందా?"
    "ఏమీ లేదు మేడమ్! ఆ వ్యక్తీ ఫోన్ చేస్తున్నాడని నిర్ధారించుకుంటే మా ఇన్ వెస్ట్ గేషన్ చురుగ్గా సాగుతుందని ఆరాటాన్ని ఆపుకోలేక మీకు చెప్పడానికి ఫోన్ చేశాను?"
    "ఇట్స్ అల్ రైట్?"
    ఫోన్ క్రెడిల్ చేసి దీర్ఘాలోచనలో మినిగిపోయింది ఇన్ స్పెక్టర్ ధీరజ.


                                                           *    *    *


    హాలులో ఫోన్ మోగింది.....
    బెడ్ మీద పడుకుని అందమయిన కళలు కంటున్న వకుళ ఒక్క గెంతులో వెళ్ళి రిసీవర్ తీసింది.
    "హాయ్ వకుళా డార్లింగ్"
    ఎవరిదో అపరిచిత గొంతు పలకరిస్తుంది....
    "నిన్నే డార్లింగ్ .....ఫోన్ ఎత్తి కూడా మాట్లాడవే?"
    "ఎవరు నువ్వు"
    "అలా అడిగావు బాగుంది.... కానీ నేను ఎవరో చెబితే నీకు తెలియదు గానీ, ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పమ్మా.....రాత్రి బాగా ఎంజాయ్ చేసినట్టున్నారూ కదూ"
    ఆ మాటలతో గతుక్కుమన్నది....
    "ఖంగారు పడిపోకు.. నేనేమీ నీ మొగుడు నియమించిన గూడచారిని కాను. ఇంతవరకూ నీ మొగుడికి నీపై అనుమానం రాదు. ఇకముందు వస్తుందేమో చెప్పలేను."
    "ఏమిటి నువ్వు మాట్లాడేది"
    వకుళ ధైర్యాన్ని కూడగట్టుకుంటూ రెట్టించింది.
    'అదే డార్లింగ్ ....నేను చెప్పినట్టు వినకపోతే నువ్వు చాటుగా సాగించే నీ రహస్య కామ కీడలను నీ భర్తకు చెబుతాను.....అదే జరిగింది అనుకో.....నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకో" విలాసంగా అన్నాడు.
    "నీ బెదిరింపులకు లొంగిపోతాను అనుకున్నావా?"
    "నోనో .....బెదిరిపోవద్దు .....జస్ట్ విను.....ఇప్పుడు నీ భర్త బెంగుళురూ కాంప్ కు వెళ్ళాడు. హోటల్ గ్రీన్ లాండ్స్ లో రూమ్ నెంబర్ 208 లో వున్నాడు. అయినా ఈ వివరాలు నీకు మాత్రం తెలియకుండా వుంటాయా....... ఇక నువ్వు ప్రతిరోజూ నీ పడక గదిని శృంగార నిలయం చేస్తున్న విషయం అయన చెవిలో వూదుతాను. వచ్చీ రావడంతోనే నీకు విడాకులు ఇవ్వడం ఖాయం.... అదే జరిగితే పాపం కాలు ,కింద పెట్టకుండా ఏసి గదులలో తిరిగిన దానిని చిప్ప చేత పట్టుకుని మురికి వీధులలో తిరగవలసిన గతి పడుతుంది...."
    "స్టాపిట్.....నా విషయాలు నీకు ఎందుకు..... ఇంతకీ నాకు ఎందుకు ఫోన్ చేసినట్టు?"
    'అది చెప్పడానికే ఫోన్ చేసింది? నీ మొగుడు కాంప్ లకు వెళ్ళి నప్పుడల్లా నీ ప్రియుడ్ని నడక గదికి రప్పించుకుని కులుకుతున్నావు. చాలా కాలం నుండీ రహస్యంగా జరిగిపోతున్న భాగవతం కావడం వలన ఎవరికీ తెలియలేదు. మరి నాకు ఎలా తెలిసింది. అని ఆశ్చర్యపోకు.... నీలాంటి పక్షులు ఎక్కడ దొరుకుతాయో వలవేసి పట్టుకోవడమే నావృత్తి  నావలలో చిక్కాక నాకు కావలసింది తీసుకునే వరకూ నిన్ను వదలను ఏమంటావ్?"
    "బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? అసలు ఎవరు నువ్వు"
    'అలానే అనుకో డార్లింగ్ ....నేను ఎవరో తెలుసుకోవడం అంత ముఖ్యం కాదు ....నాకు ఏం కావాలో అడగడం ముఖ్యం" వినోదంగా అన్నాడు అతను.
    "సరే.....నీకు ఏం కావాలి"
    "ఐదు లక్షల కాష్. లేదు అని బుకాయించవద్దు. నిన్ననే మీ అయన దాయమని నీకు పది లక్షలు కాష్ ఇచ్చిన విషయం నాకు తెలుసు. వెంటనే కారులో బయలుదేరి రైల్వే స్టేషన్ దగ్గిర వున్న పెట్రోల్ బాంక్ దగ్గర వెయిట్ చేయి నేను వచ్చి కలుస్తాను"
    "అమ్మో! అది అయన ఆఫీసు సొమ్ము....కాష్ ఏమయిందని అడిగితే ఏం  చెప్పను."
    "నన్ను అడిగితే నేను మాత్రం ఏం చెప్పగలను? ఆఫీసు సొమ్ము కాబట్టే కొంచెం అడిగాను, అదీ మీ స్వంత డబ్బు అయితే మొత్తం పట్టుకు రమ్మనేవాడిని. అయినా రంకు నేర్చినదానికి బొంకక తప్పదు. ఏం చెప్పుకుంటావో నాకు అనవసరం......అర్ధమయిందా?" అని టక్కున ఫోన్ పెట్టేశాడు బ్లాక్ మెయిలర్.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra