Home » Suryadevara rammohan rao » మోడల్


    మనోహర్ గిరీష్ కెమేరా  బోట్ లోకి ఎక్కారు. మనోహర్ కెమేరాన్ని స్టాండ్మీద నుంచి తీసి భుజంమీద పెట్టుకున్నాడు హొల్డింగ్ పొజిషన్ లో, మనోహర్ ఎప్పుడు ఏ షాట్ ఎలా తీస్తాడో ఎవరికీ చెప్పాడు. అసోసియేట్ అయిన తనకన్నా  చెప్పనందుకు గిరీష్ కి బాధ కలిగిస్తుంది.

    "మాంటేజ్ షాట్ రెడీ...." అన్నాడు గిరీష్. రూపా, గీతాబెహెల్ చేసి చూపించిన హావభావాలు మనోహర్ కి నచ్చలేదు. ముఖ్యంగా రూపాచక్రవర్తివి. రెండు మూడుసార్లు చేసి చూపించిన మనోహర్ కి నచ్చలేదు.

    తనున్న పడవను మోడల్స్ పడవ దగ్గరకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. బోట్ దగ్గరవగానే అప్పటివరకు హొల్దింగ్ పొజిషన్ లో వున్న కెమేరాని గిరీష్ కి అందించాడు మనోహర్.

    "చూడు రూపా....ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దుష్టమైన ఎక్స్ ప్రెషన్ పెట్టాలి. నీకు తెలుసు రొటీన్ ఎక్స్ ప్రెషన్స్ నాకు నచ్చవని? వెరైటీ కోసం నేనెంతగా రిస్క్ తీసుకుంటానో, మీరైనా అలాగే  తీసుకోవాలి. ఇది కంబైన్ డ్ ఎఫర్ట్. ఇది క్రియేటివ్ ఫీల్డ్ డోంట్ మేకిట్ రొటీన్. ఆకర్షణీయమైన బట్టలు కట్టుకొని, మీకున్న  వంపులతో వయ్యారంగా ఒళ్ళు విరుచుకుంటే సరిపోవటానికి యిది సినిమాకాదు. కోట్ల వ్యాపారం, దాని అమ్మాకాలు మనంచేసే  పబ్లిసిటీ మీద ఆధారపడి వుంటాయి. నీలో ఈ మధ్య వృత్తిపట్ల శ్రద్ధ, నీ అందంపట్ల జాగ్రత్త తగ్గిపోతున్నాయి. ప్రతిమోడల్ పర్ ఫెక్ట్ మోడల్ కాదు.  ప్రొఫెషనల్ అంతకంటేకాదు. వృత్తిని వదిలేసి వేరే  విషయాలమీద దృష్టి కేంద్రీకరిస్తే దెబ్బతింటావ్" సూటిగా వున్నాయి మనోహర్ మాటలు.

    ఉలిక్కిపడ్డారు రూపా, గిరీష్. రాత్రి తాము చేయబోతూ దొరికి పోయిన సంఘటన  తాలూకు తప్పును పరోక్షంగా ఎత్తి చూపుతున్నట్లుగా  ఉన్నాయి మనోహర్ మాటలు.

    పరధ్యానంలో ఉన్న రూపా అప్పటికే రిహార్సల్ కోసం గంట  వేస్ట్ చేసింది. తాను ఆశించే ఎఫెక్టు మోడల్స్ లో రానంతవరకూ  కెమేరా  ఓపెన్ చేయడు మనోహర్.

    "సోప్ మీద ఫిల్మ్ తీసేప్పుడు, ఆ సోప్ తన ఒంటికి మృదుత్వాన్ని తాజాతనాన్ని, సువాసనల్ని యిస్తుందన్న ఫీలింగ్ మ్,మోడల్ మొహంలో కలిపించాలి. అదే చీరలమీద తీస్తున్నప్పుడు ఆచీర తనకెంతో అదాన్నించిందన్న గర్వం, ఆనందం కనిపించాలి. ఒక్కో ప్రోడక్టుకి దాని నేచర్ ని బట్టి ఒక్కో ఫీలింగ్ పెట్టాల్సి వుంటుంది.

    మనోహర్ మాటలు వింటున్న గిరీష్ కి అదే రూపాకి మనోహర్  ఇచ్చే ఆఖరి ఛాన్స్ అని అర్ధమైపోయింది. గత రాత్రి అదే విషయాన్ని మనోహర్ చెప్పటం కూడా గుర్తుకొచ్చింది. రూపామీద జాలి కలిగింది గిరీష్ కి.

    "మోడల్ ఆరోగ్యంగా, బలిష్టంగా వుండాలి, గంటల తరబడి ఏకదాటిగా వర్క్ చేయాల్సి వుంటుంది గనుక. పైపెచ్చు ఒకే ఏంగిల్ లో గంటల తరబడి వుండాల్సి వస్తుంది. డైట్ కంట్రోల్ చేసుకోవాలి, శరీరం పెరక్కుండా సరిపడ నిద్రపోవాలి, నిద్ర లేమివల్ల కళ్ళక్రింద గుంటలు ఏర్పడకుండా ఉండేందుకు. యోగ, వ్యాయామం చేయాలి, అంగసౌష్టవాన్ని కాపాడుకునేందుకు. మేకప్ గురించి క్షుణ్ణంగా తెలియాలి, తను ఎలాంటి మేకప్  అయితే  కెమెరాలో అందంగా రాగాలనో తెల్సుకొనేందుకు, ఖరీదైన మేకప్ మెటీరియల్ వాడాలి. మేకప్ గురించి క్షుణ్ణంగా తెలియాలి, తమ ఎలాంటి మేకప్  అయితే కెమేరాలో అందంగా రాగలనో తెల్సుకొనేందుకు, ఖరీదైన మేకప్ మెటీరియల్ వాడాలి. మేకప్ లోని వివిధరకాలుగా వేసుకోవటం నేర్చుకోవాలి. టు ఛేంజ్ ది కవుంటర్స్ ఆఫ్  యువర్  ఫేస్ అనుక్షణం కాపాడుకుంటూ వుండాలి. డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ఈ సందర్భాల్లో ఈ బ్యాగ్రవుండ్స్ లో వాడాలో తెలియాలి. హెయిర్, హేండ్స్, కాళ్ళు వాటి వేళ్ళు, పెదవులు, పళ్ళు ఎప్పుడూ అందంగా ఉండేలా చూసుకోవాలి ఫేషన్ మేగజైన్స్ అన్నీ చదువుతుండాలి. ఖాళీ దొరికినప్పుడల్లా వివిధ రకాల భావాల్ని ఎక్స్ ప్రెస్ చేస్తూ అద్దంలో చెక్ చేసుకుంటుండాలి.

    వృత్తిపట్ల ఏమాత్రం సిన్సియారిటీ లేని నీలాంటి వాళ్ళు వృత్తికే మేజ్. యువర్ ఇమేజ్ ఈజ్ యువర్ బ్రడ్ అండ్ బట్టర్. మైండిట్. నిర్లక్ష్యంగా వర్క్ నీ ఇమేజ్  దెబ్బతితీసుకోకు....." అప్పుడప్పుడు మోడల్స్ ని ఇలా హెచ్చరిస్తూంటాడు మనోహర్ అతనిమూడ్ పాడుచేస్తే.

    ప్రొఫెషనల్  అవుట్ లుక్ ఉండే మోడల్స్  తీసుకోవాల్సిన జాగ్రత్తలపట్ల కూడా మనోహర్ లో అన్ని ఆలోచనలుండటం అక్కడున్న అందరికి ఆశ్చర్యం కలిగించింది.

    ఈరోజు మనోహర్ మూడ్ ఎందుకు పాడయిందో, అంతగా ఎందుకు బరస్ట్ అయ్యాడో రూపాకి, గిరీష్ కి తప్ప మరెవరికీ తెలియదు.

    "మనం తీస్తున్నది కూల్ డ్రింక్స్ మీద. దాని పేరు హాయ్.....హాయ్......దాని పేరులోని అనుభూతి స్పష్టమౌతోంది. నువ్వా  కూల్ డ్రింక్ త్రాగి ఆముదం త్రాగిన మొహం పెడితే ఒక్క బాటిల్  కూడా  అమ్ముడు పోదు......ఆ డ్రింక్ లో ఉన్న  రుచి నిన్ను మైమరపించింది. అది ఒక్క  గ్రుక్క త్రాగగానే నీ నాలికపైన మిగిలిన ఆ డ్రింక్ తాలూకు తడి నిన్ను నాలుక చప్పరించేలా ఉత్తేజపరచింది. దానిలో ఆ మైమరపులో  నీకన్నులు అరమోడ్పులయ్యాయి. ఇది నీ ముఖంలో నువ్వు  పలికించాల్సిన భావాలు. మూడ్ లోకిరా. నా టైం వేస్ట్ చేయకు. డూ వాట్ ఐసే......"సీరియస్ గా అన్నాడు  మనోహర్ రూపావైపు తీక్షణంగా చూస్తూ.

    మనోహర్ సూచనలకు రూపాకు కోపం రాలేదు. తన  వృత్తిని తానెంతగా నిర్లక్ష్యం చేస్తోంది మనోహర్ ద్వారా తెలుసుకోవాల్సి వచ్చినందుకు సిగ్గుతో చితికిపోయింది. ఆ జాగ్రత్తలు మోడల్స్ ఎవరికి వారు తీసుకోవాల్సినవి.

    "సారీ సార్......ఓకే సార్......రెడీ" అంది పట్టుదలగా రూపా.

    మనోహర్ పడవ మరలా ఒరిజినల్  పొజిషన్ లోకి వచ్చింది. రిహార్సిల్ షాట్ మరలా చేసి చూపించింది రూపా. సంతృప్తిపడ్డాడు మనోహర్.

    "సైలెన్స్ ప్లీజ్....షాట్ రెడీ......క్లాప్" అరిచాడు గిరీష్. చందూ పడవలోంచి లేచి క్లాప్ బోర్డు రూపా మోహం ముందు  పెట్టాడు. భుజం మీద కెమేరాతో పడవ అంచుపైకి ఎక్కాడు మనోహర్.

    క్రియేటివిటి, జీల్ వృత్తిపట్ల సిన్సియారిటీ ఉన్న ఫోటోగ్రాఫర్స్ కొండల అంచున చివర్లలో నిలబడి కూడా కెమేరా ఆపరేట్ చేస్తారు. అదెంతో ప్రమాదకరమని తెలిసి కూడా ఆ సందర్భాల్లో కొందరు ఫోటో గ్రాఫర్స్ తమ ప్రాణాల్ని కూడా పోగొట్టుకున్నారు.

    ప్రముఖ ఇండియాన్ ఫోటోగ్రాఫర్ కిషోర్ ఫరేఖ్ అలాగే ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఇటీవల.

    ఎవరూ గతంలో చూపించని అందాల్ని సరికొత్త కోణం నుంచి చూపించాలనే తృష్ణ మనోహర్ లో ఎక్కువ. కెమేరా బోట్  నెమ్మదిగా కదులుతూ మోడల్స్ వున్న పడవవైపు వెళ్ళసాగింది.

    రూపా మోము క్రమంగా దగ్గరవుతోంది. కెమేరాలోని రీల్ ఆమె అందాల్ని, హావభావాల్ని తనలోకి ఎక్కించుకుంటోంది సైలెంట్ గా. మనోహర్ భుజం మీదున్న కెమేరా అతనికి బరువుగా అనిపిస్తోంది. అయినా అలాగే హొల్డ్ చేస్తున్నాడు.

    సన్నని పడవ అంచుమీద నిలబడి నెమ్మదిగా ముందుకు నడుస్తూ కెమేరా ఆపరేట్ చేస్తూన్న మనోహర్ నీళ్ళలో పడకుండా, అతని సడుమును వాటేసుకుని, గట్టిగా పట్టుకొని తలఎత్తి మనోహర్ వైపే చూస్తున్నాడు సునిశితంగా గిరీష్. కెమేరాతో సృష్టికి ప్రతిసృష్టి చేయగల అపర బ్రహ్మ అయిన మనోహర్  వైపు లోకేషన్ లో అంతా మంత్రముగ్ధులై చూస్తున్నారు.

    రూపా అభినయిస్తూనే పడవ చివరకు వెళ్ళి, దాని అంచుపై నిలుచుని బాటిల్  పైకెత్తి పంచింది. అందులో అడుగున మిగిలి వున్న డ్రింక్ ఒక్కో చుక్క వచ్చి తెరిచివున్న ఆమె పెదవుల అంచులపై చాపివున్న ఆమె నాలుక పై పడుకున్నాయి. సీన్ మనోజ్ఞంగా సెల్యులాయిడ్ పైకి ఎక్కుతోంది. కెమేరాలో ఫిల్మ్ తిరుగుతున్న శబ్దం తప్ప మరేవీ వినిపించటంలేదు___దగ్గర్లో ఉన్నవారికి. సీరియస్ గా ఒక డోస్  ఇవ్వటంతో రూపా అద్భుతంగా అభినయిస్తోంది. అది చాలా ఆనందాన్ని కలగచేసింది మనోహర్ కు.

    రూపా అభినయం మరో రెండు సెకండ్లలో అయిపోతుందనగా, పడవ ప్రక్కగా నీళ్ళలోంచి ఓ తల పైకిలేచింది కొద్దిగా. పడవకు ఇవతల  భాగాన వున్న  యూనిట్ సభ్యులకు ఆ ఆగంతకుడ్ని గమనించే అవకాశం లేదు. రూపా నడుమునుంచి కాస్ట్యూమ్స్ లో భాగంగా క్రిందకు జారివున్న పూసలదండ ఆ ఆగంతకుడి చేతిలోకి వెళ్ళింది.

    మరుక్షణం కెవ్వున రూపా కేక నిశ్శబ్దంగా వున్న ఆ ప్రాంతంలో చావుకేకలా మారుమ్రోగిపోయింది. రూపా దబ్బున నీళ్ళలో పడిపోయింది. మనోహర్  ఉలికిపాటుగా కెమేరా ఆపాడు. రూపా కెమేరా ఫ్రేమ్ నుంచి అవుటాఫ్ కాగానే.

    చూస్తుండగానే క్షణాల్లో జరిగిన ఆ ఘోరవిపత్తు అందర్నీ విభ్రమకి గురిచేసింది.

    అందరూ హడావుడిగా ఒడ్డు దగ్గరకు పరిగెత్తుకొచ్చారు. అది  చాలా లోతైన సరస్సు. దూకి ఆమెను రక్షించాలనుకొనేసరికి ఇరవై సెకెండ్లు గడిచిపోయింది.

    "క్విక్......సేవ్ హర్......" మనోహర్ కేకలు ఆ ప్రాంతమంతా మార్మోగిపోయాయి.

    అప్పటివరకూ ప్రశాంతంగా వున్న ఆ ప్రాంతం అంతా  అరుపులతో, కేకలతో గందరగోళంగా వుంది. పడవను నడుపుతున్న ఒక  మోటార్ బోట్ డ్రైవర్ ఎగిరి నీళ్ళలోకి దూకాడు. ఆ వెంటనే మరో డ్రైవర్ దూకాడు. ఆ వెంటనే చందూ దూకేసాడు. ఎక్కడా ఆమె  జాడకనిపించలేదు. ప్రమాదవశాత్తు పడినట్లయితే పడిన వెంటనే  ఓసారన్నా పైకి రావాలి, కాని ఆమె జాడలేదు. ముగ్గురూ ఆశ్చర్యపోయారు. అయినా పట్టుదలతో షార్క్  చేపల్లా నలువైపులా బారలువేస్తూ వెతకటం ప్రారంభించారు అమిత వేగంతో.

    మరో 30 సెకెండ్లు గడిచింది. ఊహించని ఆ అదిరిపాటు సంఘటన కూడా మనోహర్ ఆలోచనకు అడ్డుకట్ట వేయలేదు.  మునిగింది మునిగినట్లే వుండటం ఏమిటి? మొసలో, షార్క్ చేపో లాక్కుపోయాయనుకోపటానికి ఆ సరస్సులో అలాంటి రాక్షస జలచరాలుండే అవకాశం లేదు. మరి......మనోహర్ ఆలోచనలు స్తంభించిపోయాయి ప్రదీప్ గుర్తుకురాగానే.

    55వ సెకెండ్ లో చందూకి రూపా కాలు దొరికింది. అంతే బలంగా ఒడిసి పట్టుకున్నాడు ఆమె కాలును. బయటకు లాగేందుకు తన బలమంతా ఉపయోగించినా ప్రయోజనం లేకపోయింది. గాలి పీల్చకుండా మనిషి బ్రతికుండే కాలం గడిచిపోయింది దాదాపు.

    చందూ ఆఖరుగా తన ఒంట్లోని శక్తినంతటిని తన భుజాల్లోకి తెచ్చుకొని, మనోహర్ పై  తనకున్న కృతజ్ఞత ఇచ్చిన మానసిక బలాన్ని తోడు తీసుకొని మొసలి పట్టుతో అతి బలంగా లాగాడు. అంతే ఆమె ఎవరి చేతుల్లోంచో, జంతువు నోట్లోంచో ఊడిపోయి వచ్చినట్లు చందూ చేతుల్లోకి వచ్చింది. వెంటనే ఆమెను రెండు చేతుల్తో పొదివిపట్టుకొని 'ఉఫ్' మంటూ నీటి పైభాగానికి వచ్చాడు. అందరూ ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు కాని బ్రతికుందా, చనిపోయిందా అన్నట్లుంది ఆమె వాలకం.

    చందూ ఆమెను బరబరా పడవ దగ్గరకు లాక్కొచ్చాడు. ఆందోళనగా  ఎదురుచూస్తూన్న సుగతా మోడల్స్ ఆమెను పడవలోకి లాగారు. చందూ చెంగున పడవలోకి దూకి రూపాను బోర్లా పడుకుండబెట్టి ఆమె  వీపును బలంగా నొక్కసాగాడతడు. త్రాగిన నీరు ఆమె నోటినుంచి కొద్దికొద్దిగా బయటకు రాసాగింది.చందూ చిరునవ్వుతో మనోహర్ వైపు చూసాడు. గుండెలనిండా గాలి పీల్చుకున్నాడు మనోహర్ రూపా బ్రతికి వున్నందుకు.

    చందూ రూపాను వెల్లకిలా త్రిప్పి, మీదకు వంగి ఆమె నోరును బలవంతాన తెరిచి, తన నోటితో మూసి బలంగా గాలిని లోపలకు పంప్ చేయటం ప్రారంభించాడు. హొదానిబట్టే తన శరీరపు అంచుల్ని తాకనిచ్చే రూపాచక్రవర్తి తను ఈసడించుకొనే ఒక ఆఫీస్ బాయ్  కేవలం తన అద్బుత సౌందర్యాన్ని బట్టిగాక, మానవతా దృకృథంతో ప్రాణదానం చేస్తున్నాడని తెలిస్తే ఫాల్స్  ప్రిస్టేజ్ కి,  మానవత్వానికి మధ్య ఎంత అగాధం వుందో, మానవత్వం ముందు అందాలు, అద్భుత సౌందర్యాలు ఎంత దిగదుడుపో అర్ధమయ్యేవేమో.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra