Home » Chandu harshavardhan » The Partner

 

    చెప్పడం ఆపి ఆమె ఫీలింగ్స్ చూసింది.
    "ఎందుకు ఇవ్వదు దొంగముండ. అసలు అదే నా భర్తను రాచి రంపాన పెడుతుంటుంది. దాని గొడవ భరించలేకే అయన ఎటో వెళ్ళి పోయి వుంటాడు. అయినా తన మనసు బాగోలేక పొతే అయన నా దగ్గరకు తప్పని సరిగా వస్తారు. ఈసారి మరెందుకో రాలేదో? నాకు అర్ధం కావడం లేదు?" ఆమె గొంతులో ఆవేదన. ముఖంలో విచారం కూడా కనిపిస్తుంది.
    "సీతాపతి ఒక వారం రోజులుగా కనిపించడం లేదని తెలిసింది. ఇన్ని రోజులు ఎప్పుడయినా యిలా కనిపించకుండా , యింటికి రాకుండా చేశారా?"
    "ఆ వారం రోజులయిండా? ఓరినాయనో ! మరి ఆ మాట ఇందాకటి నుంచీ చెప్పరేం! ఒక్కరోజు రెండు రోజులకు మించి ఎక్కడి వెళ్ళినా రాకుండా వుండరు. ఏకంగా వారం అంటున్నారే యేక్కడకు వెళ్ళారో" అంటూ పెద్దగా రోదించడం ప్రారంభించింది రాధాదేవి.
    దాదాపు పది నిమిషాల నుంచీ ఆమె ఏడుస్తూనే వున్నది.
    "ఊరుకోండి రాధాదేవి! మనసు దిటవు పరుచుకోక తప్పదు." ధీరజ అనునయంగా అన్నది.
    "ఎలా తట్టుకో మంటారండీ? దేవుడు లాంటి ఆయనను తిట్టి వెళ్ళగోడితే పాపం అయన ఎక్కడకు వెళ్ళారో/ ఎలా వున్నారో తలుచుకుంటేనే నా గుండె చేరువై పోతుంది. నా భర్త కనిపించడం లేదని తెలిసి ఎలా భరించగలను? రేపటి నుండి నా బ్రతుకు ఏమవుతుంది? నన్ను ఏకాకిని చేసి వెళ్ళిపోయిన ఆయనకు ఇంతకాలం చాటున వుండి సేవలు చేసినట్టే శాశ్వతంగా ఇకనుండీ చీకటిలోనే ఉండిపోమని ఆ దేవుడు నా నుదుట వ్రాస్తే వినికుడా ప్రాణాలతో ఇంకా వున్నానంటే నాది రాతి గుండె ----"
    ఎమోషన్ ఎక్కువై బాధపడుతున్న రాదాదేవిని చూస్తున్న ఇన్ స్పెక్టర్ ధీరజ ఆలోచనలు ఎక్కడో వున్నాయి.
    కట్టుకున్న భార్య కూడా ఇంతగా బాధ పడదు-----
    ఎప్పటికో కానీ ఆమె మాములు మనిషి కాలేకపోయింది.
    "లలిత దగ్గిరకు వెళ్ళినా వెళ్లకపోయిన సీతాపతి మీ దగ్గరకు తప్పక వస్తాడని తెలిసింది. మీరేమో అసలు రాలేదంటున్నారు. పైపెచ్చు ఇలా శోకాలు పెడుతున్నారు. అల్ రైట్ నా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారంటే మీ భర్త అదృశ్యం వెనుక ఉన్నవాళ్ళను పట్టుకోవడానికి సహాయపడిన వాళ్ళు అవుతారు. దయచేసి స్థిమితంగా వుండండి.'
    కళ్ళు తుడుచుకుంటూ ఆమె వైపు చూసింది.
    "మీ వివాహం సంగతి లలితకు తెలుసా?"
    "తెలుసు....! ఆ విషయం  తెలిసినప్పటి నుంచీ ఆ మహా ఇల్లాలు ఆయనను మరింతగా సాధించడం మొదలుపెట్టింది. ఆమె వల్లనే చివరకు అయన తాగుబోతు అయ్యారు. ఇంటికి వచ్చిన భర్తను చీకాకు కలిగించే మాటలతో, అనుమానాలతో , అవహేళనతో సాధించడం ఆమెకు ఎప్పుడూ అలవాటే.....అందుకే మనశ్శాంతి కరువై నా దగ్గర అవి లభిస్తాయనే ఆశతో నన్ను పెళ్ళి చేసుకున్నారు" అని ఒక క్షణం చెప్పడం అపిందామే.
    "మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండవ పెళ్ళి చట్ట విరుద్దం అని తెలియదా?"
    "తెలుసు ....." అందుకే లోకం దృష్టిలో నేను భార్యగా చెప్పుకో లేకపోతుంది. మానసికంగా, శారీరకంగా మేము దంపతుల మయ్యాం. చట్టం దృష్టిలో , లోకం దృష్టిలో కాకపోయినా ఫరవాలేదు . నిజం ఏమిటో మా మనసులకు తెలుసు. అందుకే కలసి జీవిస్తున్నాం.'
    ఉన్న విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు నిర్భయంగా చెప్పిందామె.
    'అల్ రైట్ ! అసలు మీ పెళ్ళి ఎలా జరిగింది?"
    "ఒక ఫంక్షన్ లో అయన నన్ను చూశారు. కిశోర్ అంకుల్ మాకు దూరపు బంధువు, నన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నట్లు కిశోర్ అంకుల్తో చెప్పారు. అప్పటికే నేను యాక్సిడెంట్ లో చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుని విధవరాలిని అయ్యాను. ఎలాగూ రెండవ పెళ్ళి కాబట్టి అయన విషయం తెలిసే సమ్మతించాను."
    ఆమెలో తిరిగి దుఃఖం పొంగుకొచ్చింది.
    "ఆయనకు శతృవులు ఎవరయినా ఉన్నారా?"
    "ఉన్నారు...."
    "ధీరజలో ఆశ్చర్యం తొంగి చూసింది.
    "ఎవరు వాళ్ళు?"
    'అయన మొదటి భార్య.... ఆమెకు ఉన్న మగ స్నేహితులు.... అయన ఉన్నతి గిట్టని ఆయనతో పాటు పని చేసే కొలీగ్స్....."\
    "ఇంత మండా?"
    'అవును వీళ్ళంతా ఆయనంటే ద్వేషం ఉన్నవాళ్ళే .... మరి శతృవులు ఎందుకు కాకూడదూ?"
    "మరి లలిత మీరే భర్తను ఏదో చేసి వుంటారని మిమ్మల్ని అనుమానిస్తుంది."
    "అది అలాగే చెబుతుంది లెండి.... ఎందుకంటె ఎక్కడ తన రంకుతనం బయట పడి పోతుందోనని దాని భయం."
    'అదేమిటి వివరంగా చెప్పండి."
    "లలితకు చాలామందితో అక్రమ సంబంధాలు వున్నాయి. వాళ్ళతో కలిసి తాగుతుంది కూడా. సినిమాలకు, షికార్లకు వెడుతుంది. అందుకే నా భర్తకు ఆమె అంటే అసహ్యం. అసలు ఆమెతో తెగతెంపులు చేసుకోవడానికీ నన్ను పెళ్ళి చేసుకున్నది కూడా....."
    "మీకు ఎవరి మీదయినా అనుమానంగా వుందా?"
    "చెప్పానుగా.....! తను మరింత విచ్చలవిడిగా తిరగడానికి వీలు వుంటుందని తన స్నేహితుల చేత అదే ఆయనను ఏదో చేయించి వుంటుంది.' అక్కసుగా అన్నది రాధాదేవి.
    "వెరీ వెల్.....! ఆమేమో మీ మీద చెబుతుంది. మీరేమో ఆమె చేయించి వుంటుంది అంటున్నారు. ఇద్దరూ ఒకరి మీద ఒకరు నిందారోపణలు చేసుకుంటున్నారన్నమాట.' చిరునవ్వుతో అన్నది ధీరజ.
    "ఎవరి మాటలు నిజమో తెలుసుకోవడం మీకు పెద్ద కష్టం కాదు ఇన్ స్పెక్టర్. ఆమెకు రౌడీలతో కూడా సంబంధాలు వున్నాయి. నాపై రెండు సార్లు ఆమె రౌడీయిజం చేయించాలని చూసింది కూడా. వైజాగ్ లో ఉన్న ఇల్లు నా పేరున పెట్టాడని తెలిసి ఎలాగయినా ఆ ఇంటిని తనే స్వంతం చేసుకోవాలని నాపై పీకల వరకూ ఆమెకు కోపంగా వున్నది."
    "అదేంటి....? స్వంత ఇంటిని మీకు రాశాడా?"
    'అవును ఇన్ స్పెక్టర్ .... అయన గారు హైదరాబాద్ లో ఉన్న ఇంటిని  ఆమెకూ....వైజాగ్ లోని ఇంటిని నాకూ రాస్తే రెండూ తనే దక్కించుకోవాలని ఆమె కుట్ర. అలాంటి నీచురలిని అనుమానించకుండా ఎలా వుండమంటారు.... మీరే చెప్పండి?"
    తన దర్యాప్తులో ఇంకొన్ని ఆసక్తికరమయిన విషయాలు తెలియడంతో అవసరమయిన చిరునామాలను నోట్ చేసుకున్నది ఇన్ స్పెక్టర్ ధీరజ.
    రాధాదేవి మాటలలోని నిజం నిగ్గు తెల్చాలంటే వైజాగ్ వెళ్ళాలి.
    ధీరజ ఆ నిర్ణయం తోటే బయలుదేరింది.
    ఆమె వెళ్ళిన వెంటనే రాధాదేవి తన ఇంటికి తాళం వేసి టౌన్ లోకి బయల్దేరింది.

    
                                                        *    *    *


    అది ఒక ఇంగ్లీషు మీడియం కాన్వెంటు.
    సాయంత్రం ఐదు గంటలు.....
    కాన్వెంట్ వదలడంతో స్టూడెంట్స్ అందరూ ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోవడంలో మునిగిపోయారు.
    విక్కి, రోజాలు కూడా ఆటోలో గాజువాకలోని తమ ఇంటి దగ్గర దిగారు.
    పిల్లలు ఇద్దరూ ఫిప్త్ ఫామ్ చదువుతున్నారు.
    ఇంట్లోకి అడుగు పెట్టబోతూ ద్వారం వద్దనున్న బూట్లను చూసి షాక్ తిన్నారు. ఒక క్షణం పాటు పిల్లలు ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
    నెమ్మదిగా లోనికి వెళ్ళి పుస్తకాలు టేబుల్ పై పడవేసి సోఫాలో ఒదిగి కూర్చున్నారు.
    పసి వాళ్ళిద్దరిలోనూ దుఃఖం గూడు కట్టుకున్నది.
    వాళ్ళ చూపులు గోడపైకి మరలాయి.
    పెళ్ళిరోజు సీతాపతి, లలితలు కలిసి దిగిన కలర్ ఫోటో అక్కడ వున్నది.
    తండ్రి గుర్తుకు రావడంతో ఆ పసివాళ్ళ కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి.
    పక్క గది తలుపులు మూసి లోపల సంభాషణ లీలగా వినిపిస్తుంది.
    లోపల జరుగుతున్నది అర్ధం చేసుకోగలిగినంత వయసు కాకపోయినా జరగరానిది జరుగుతుంది అని మాత్రం తెలుసు.
    "అబ్బ! నువ్వు రోజురోజుకీ మరీ చిలిపి వాడివై పోతున్నావు."
    అది తల్లి గొంతు.
    "నీకంటేనా?"
    ఎవరో పరాయి పురుషుడి గొంతు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra