Home » Dr. dasaradhi rangacharya » Sukla Yajurveda Samhitha


    10వ మంత్రము నందలి హవిని గురించి చెప్పుచున్నాడు:-

    అందుకున్న హవీ! నిన్ను పృథ్వి నాభియందు - అదితివడిలో - ఉంచు చున్నాను. అగ్నీ! నీవు హవన యోగ్య యవలను రక్షింపుము.

    ఆలోచనామృతము:

    గింజలు, సంపద మిగిలించుకొనుటకు - దానము ఎగగొట్టుటకు -దాయకూడదు. వాటిని పెంపొందించునట్లు సదుపయోగమగునట్లు ఉపయోగించవలెను.

    భూగర్భమున దాచిన- విత్తనము చల్లిన- గింజ మొలకెత్తి పెరుగుటకు వేడి- అగ్ని - అవసరము అందువలన అగ్ని ప్రార్థన.

    వ్యవసాయమునకు సూర్యుడు సహకరించవలెను. ఇండ్లను పెరికి వేయు తుఫానులు రాకుండవలెను.

    అట్లయి అందరు సహకరించి పంట చేతికి వచ్చిన రైతు ఆకాశము అందుకున్నంత మురిసిపోవును. "ఉర్వన్త రిక్ష మన్వేమి'

    మొదట గింజలు. అవి హవి అయినవి. అవి విత్తబడినవి.

    12. కుశ పవిత్రమా! నీవు పవిత్రము చేయుదానవు. విష్ణు స్వరూపవు.

    జనులారా! నేను సహిత ఆజ్ఞ ప్రకారము వర్తించు వాడను. అచ్ఛిద్ర పవిత్రమునను- సూర్యరశ్మి యందును పావనము చేయుదును.

    జలమా! నీవు సంద్రము వైపు సాగువాడవు - సోమరసపానము చేయువాడవు. మేము చేయుచున్న 'దర్శపూర్ణ మాస, యజ్ఞమును సఫలము చేయుము. అట్లే బహు దక్షిణలిచ్చు యజ్ఞ స్వామిని - దేవకామి యజమానిని -సఫలీకృతులను చేయుము.

    "సయోహైవం విద్వానగ్ని హొత్రంచ జహొతి దర్శపూర్ణాభ్యాంచ యజతే మాసి మాసి హైవాశ్వమేధేనేష్టంభవతి" అని శతపథము.

    అగ్నిహొత్రమును విద్వాంసులు పూజించుట - నెల నెల యజించుట అశ్వమేధమందలి ఇష్టి అగును. అదియే దర్శపూర్ణమాస యజ్ఞము.

    అమావాస్య నుండి అమావాస్య వరకు గల కాలమును మాసముగా పరిగణించుట జరిగినది.

    13. జలమా! వృత్రవధ సమయమున ఇంద్రుడు నిన్ను వరించువాడు. ఇప్పుడు నీవు  శత్రువధకొరకు ఇంద్రుని వరింపుము. నీవు ప్రోక్షితుడవైనావు.

    హవీ! నిన్ను అగ్నికి  ప్రీతికరము చేసినాను. ప్రోక్షించినాను. అగ్నిసోములకు ప్రీతికరమగు నిన్ను కుశలచే మార్జితము చేసినాను. దేవతలను గూర్చి చేయుయజ్ఞము కొరకు నీవు పరిశుద్ధుడవగుము.

    తండులములారా! నిన్ను దాసాదులు పట్టనప్పుడు అపరిశుద్ధమైనంత భాగము పరిశుద్ధ మగుటకు దర్భలతో జలము చల్లి పరిశుద్ధము చేయుదును.

    దర్భలతో నీళ్లు చల్లుట ప్రోక్షించుట అగును.

    ఏ ఆయుధమునను చావని వృత్రుని ఇంద్రుడు నీటి నురగతో వధించినాడని వృత్తాంతము.

    14. చర్మమా! నిన్ను విడిచిన రాక్షసులను పారద్రోలి నట్లగును. దాతలు కానివారిని దూరప్రాంతములకు తరిమినట్లగును.

    కృష్ణాజినమా ! నీవు అదితి త్వచ- భూమికి అంటి ఉన్నావు. కావున నెల నిన్ను తనదానినిగా భావించవలెను.

    (నేలమీద కృష్ణాజినము పరచవలెను. దాని మీద రోలు, రోకలిని పెట్టవలెను.)

    రోలూ! నీవు రాతితో చేయబడినావు. నీకు కర్రతో చేసిన రోకలితో సాంగత్యము. నీ అడుగు వెడల్పుది. పృథ్వి చర్మము వంటి కృష్ణాజినము నిన్ను తనవానిగా భావించవలెను.

    ఈ తోలు తిత్తి -దేహమే -రక్కసి కోరికలను లోభిత్వమునకు కారణము.

    జింక చర్మము కృష్ణాజినమగును.

    15. బియ్యపు హవీ! నీవు ఆ హవనీయ అగ్ని శరీరమవు. మంత్రపు విసర్జమవు. (మంత్రపు చివరన తండులములను అగ్నికి అర్పించబడును. అందువలన తండులము మంత్రపు విసర్జన యగును.)

    (రోకలి చేతపట్టుకొని)

    రోకలీ! నీవు కర్రతో పొడుగుగా చేయబడినావు. నీ అడుగు భాగము రాతి కన్న కఠినమైనది. నీవు దేవతల కొరకు గాను ఈ తండుల హవిని పిండి చేయుము. చక్కగా పిండి చేయుము.

    హనిచేయువారలారా! రండి. రండి హవి చేయువారలారా! "హవిష్కృదేహి హవిష్కృదేహి "

    16. కుక్కుటమా! నీవు మధురజిహ్వవు. నేడు నీవు మాకు వర్షము, అన్నపు కథ వినిపించుము నీ వలన ప్రవృద్దులమైన మేము రాక్షసులను గుంపులు గుంపులుగా ఓడింతుము గాక.

    చేటా! నీవు వర్షమున వర్ధిల్లినదానవు. (చేటలు చేయు వెదురు వర్షమున పెరుగును.) వర్షమున పెరిగిన తండులములు నిన్ను తనవానిగా భావించవలెను. బియ్యమును చెరగినపుడు రాక్షుసులు చెడినట్లనిపించును. అదాతలు కూడా దూరమైనారు. బియ్యము చెరగుట వలన రాక్షసులు చచ్చినట్లయినది.

    పొట్టుతోటి బియ్యమా! చేటగాలి మిమ్ము వేరు చేయవలెను. శుద్ధములైన తండులములను స్వర్ణహస్తుడగు సవిత- సందు లేని - చేతులచే గ్రహించును గాక.

    17. మోదుగు కొమ్మా! నిప్పులను ఇటునటు కదిలించుట యందు నీవు సర్వ సమర్థవు.

    (నిప్పులను వేరు చేయవలెను.)

    గార్హపత్యాగ్నీ! పచ్చి పదార్థములను పచనము చేయు అగ్నిని వేరు చేయుము. మృత దేహమును, మాంసాదులను కాల్చు క్రవ్యాద అగ్నిని వేరు చేయుము. కాని దేవతలను మననము చేయుటకు ఉపయుక్తమగు హవనీయ అగ్నిని తెమ్ము.

    కపాలమా! నీవు ఎంతో గట్టిదానవు. భూమిని గట్టిపరచుము. బ్రాహ్మణులు సంపాదించిన క్షత్రియులు సంపాదించిన - యజమాని సజాతీయులు సంపాదించిన కపాలమా! నా శత్రువధ కొరకు నిన్ను అగ్నిమీద కప్పుదును.

    కపాలమనగా అగ్ని మీద వేయు పేళ్ళు మున్నగు వాని కప్పు- మనిషి పుర్రె కాదు.

    18. అగ్నీ! పురోడాశరూప అన్నమును సంస్కరించు కపాలమును నీపైన ధరించుము.

    కపాలమా! నీవు పురోడాశమును  ధరించు దానవు. నీవు అంతరిక్షమును గట్టిపరచుము.  బ్రహ్మణుడు వరించిన, క్షత్రియుడు వరించిన, యజమానికి సజాతీయుడు వరించిన కపాలమును శత్రువధ కొరకు అగ్నిమీద ఉంచుచున్నాను.

    మరొక కపాలమా! నీవు పురోడాశమును ధరించుదానవు. ద్యులోకమును దృఢము చేయుము బ్రాహ్మణుడు వరించిన- క్షత్రియుడు వరించిన- యజమాని సజాతీయుడు వరించిన ద్వితీయ, తృతీయ కపాలములను శత్రువధ కొరకు అగ్ని మీద ఉంచుచున్నాను.

    నాలుగవ కపాలమవగు నిన్ను దిశలు గెలుచుటకు గాను అగ్నిమీద ఉంచుచున్నాను.

    కపాలములారా! మిమ్ము ఒకదాని పిదప ఒకటి అగ్నిమీద ఉంచినాను. అట్లు ఒకదాని పిదప మరొకటిగా ఉంచబడిన మీరు ఉపచితులై భృగు, అంగిరసుల తపోరూప అగ్నితాపమునకు ప్రతప్తులు కండు.

    శత్రువు - తనలోని వాడయినను - బయటి వాడయినను బాధించువాడగును. శత్రువు బాధించును. కామక్రోధాది అరిషడ్వర్గములు పరమ శత్రువులు. అవి నిరంతరము బాధించును. వాటిని పారద్రోలవలసి ఉన్నది.

    శత్రువు భూలోకమందు - అంతరిక్షమున - ద్యులోకమున - దిశల యందు ఉండును. ప్రకృతి తన బీభత్సమున శత్రువగును. దానిని నివారించవలసి ఉన్నది.

    మానవ దేహమందునను భూలోక, అంతరిక్ష ద్యులోకములున్నవి. వానియందు కంటికి కనిపించని శత్రువులు ఉన్నారు.

    అందుకొరకు భృగు, అంగిరసులు చేసిన తపమును ఆశ్రయించవలసి ఉన్నది. ఆ తపస్సు మానవుని కామ క్రోధాది శత్రువులను దహించి మానవుని శాంతిచిత్తుని, మహానుభావుని చేయును.

    19. చర్మమా! నీవు కృష్ణాజినమవు. నిన్ను కదిలించి ఊడ్చుట వలన రాక్షసులను ఊడ్చినట్లయినది. అదాతలను ఊడ్చినట్లయినది.

    కృష్ణాజినమా! నీవు పృథ్వికి త్వచవంటి కృష్ణాజినము నిన్ను తనదానిగా భావించవలెను. ఇది శయ్య అగును. శయ్యా! నీవు ద్యులోకమును నిలిపి ఉంచుదానవు.

    శిలా! నీవు ధీమంతవు. నీవు  పర్వతపుత్రవి. పర్వతము నిన్ను తనదానిగా భావించవలెను.

    20. (శిలమీద తండులములను ఉంచవలెను)

    తండులములారా! మీరు పోషక ధాన్యములు. మీరు దేవతలను పోషించండి. మీకు ప్రాణము కలిగించుటకు పిండిని చేయుదును. ఉదాన, వ్యానవాయువు ప్రసాదించుటకు పిండి చేయుదును. మిమ్ము ఆయువు కొరకు పిండి చేయుదును. స్వర్ణ హస్త సవిత మీకు ప్రకాశమును కలిగించును గాత. సందులేని తన చేతితో అందుకొనును గాత.

    (ఘృతమును పోయుచు) ఘృతమా! నీవు గొప్ప ఆవుల పాలనుంచి అవతరించినదానవు.

    (బియ్యమును పిండి చేయుట హింసించుటకు కాదు. ప్రాణము పోయుటకు అనుచున్నాడు! అన్నం ప్రాణః" అని తైత్తరీయము)

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra