Home » Suryadevara rammohan rao » మోడల్


    మరోసారి మరో ఫిల్మ్ ఇచ్చాడు. అది మగవారి అండర్  వేర్స్ తయారుచేసే కంపెనీది. ఆ స్క్రిప్టు అంతా బూతుమయం. దానికీ నా  మనస్సంగీకరించలేదు. ఆ కంపెనీ డ్రాయరు మగవాడు తొడుక్కుంటే అందమైన అమ్మాయిలు అతని వెంట పడతారట. ఆ స్ర్కిప్టు  ప్రాకారం అయితే నేను చేయనన్నాను. చేసి తీరాలన్నాడు. అలా తీస్తే స్త్రీలకు అపకారం చేసినట్టవుతుందనుకున్నాను.

    స్త్రీలా గాడిదగుడ్డా.....వాళ్ళు మనం ఆడించినట్లుగా  ఆడే  అందమైన రబ్బరు బొమ్మలన్నాడు. అప్పుడు తొలిసారి గ్రహించాను స్త్రీలంటే అతని కేమాత్రం గౌరవం లేదని. మొత్తానికి తీసాను. అది చూసి పళ్ళు సూరాడు. నేను లెక్క చేయలేదు. అది విడుదలయిన ఐదురోజుల తరువాత  బొంబాయి నుంచి మా గురువుగారు ఫోన్ చేసి మెత్తగా చివాట్లు పెట్టారు. అలా  తీసావేంటంటూ.

    నాకనుమానం వచ్చి అది వేస్తున్న ధియేటర్ కి వెళ్ళి  చూసాను. బాస్టర్డ్..... కొన్ని ఘోరమైన సెక్స్ షాట్స్ వేరే ఫోటోగ్రాఫర్స్ తో బాధ ఒక ప్రక్క ___ణను ఎంతగానో అభిమానించే మా గురువుగారి మందలింపు ఒక ప్రక్క  తీవ్ర ఆవేదనను గురిచేశాయి.

    కక్కలేక మ్రింగలేక వూరుకుండిపోయాను. అనుక్షణం అతనికి ఎదురుతిరుగుదామనే అనుకొనేవాణ్ని. అతనికి ఎదురు తిరిగి నిలిచే బలం లేక ఆగిపోయాను" చెబుతూ చెబుతూ ఓ నిమిషం ఆగాడు మనోహర్.

    ఎంతో ఆసక్తిగా వింటున్న మంగళ, కమలిని అతనెందుకు ఆగిపోయాడో అర్థంకాలేదు.

    గతం చెప్పుకుంటూ పోతున్నకొద్దీ మనోహర్ మొఖంలో కోపం, కసి చోటుచేసుకుంటున్నాయి. మరలా మొదలెట్టాడు.

    "స్క్రిప్ట్, లోకేషన్, డ్యూరేషన్, జంగిల్స్, మోడల్స్ ని బట్టి ఫోటోగ్రాఫర్ చార్జెస్ నిర్ణయిస్తారు.

    ఇవేమీ చూడకుండా ఎంతో కొంత ఇస్తుండేవాడు. అదేమని అడిగితే ఈ వర్క్ కూడా ఇవ్వను తెలుసా అన్నట్లు చూసేవాడు.

    ఏం మిగలటం లేదని ఒకప్రక్క, నా క్రియేటివిటి చూపించుకొనే ఛాన్సెస్ రావటంలేదని ఒక ప్రక్క క్షోభ పడుతుండేవాణ్ని.

    అతను ప్రతిసారి నామీద రుద్దే మోడల్స్ ఎందుకు పనికిరానివారు. ఫోటోగ్రాఫర్ ఐతో చూసేవాడుకాదు. వాళ్ళలో సెక్సప్పీల్స్ ఉంటే చాలను కొనేవాడు. వారికి మేకప్ తెలియదు. మూమెంట్స్ రావు. ప్రొఫెషనల్ సిన్సియారిటీ, వర్క్  సీరియస్ నెస్  అసలుండేది కాదు.

    ఒక్కోసారి ఒక్క ఎక్స్ ఫ్రెషన్ కోసం ఐదారుగంటలు కూచోవాల్సి వస్తుంది. మోడల్స్. లిరిల్ సోప్ యాడ్  ఫిల్మ్ లో మోడలింగ్ చేసిన కారెన్ లూనెల్ 90 సెకండ్ల యాడ్ ఫిల్మ్  కోసం గజగజ వణికించే చలిలో కొడై కెనాల్ జలపాతం కింరు తడుస్తూ గంటలతరబడి రహర్సల్స్ చేసింది. అప్పుడామె వంటిమీద గ్రీన్  బికిని డ్రస్ మాత్రమే వుంది. రక్తం గడ్డగట్టి పోయే చలిలో ఆమె వేళ్ళు కొంగర్లు తిరిగిపోతున్నా లెక్కచేయకుండా, ఫోటోగ్రాఫర్స్ కి సహకరించింది! ఆ నాన్ వెర్భల్ యాడ్ ఫిల్మ్ సూపర్ హిట్ అయింది. అప్పటికి, ఇప్పటికి అదే నెంబర్ వన్ యాడ్ ఫిల్మ్ అయింది. కారెన్ లూనెల్ కీ వున్న  సిన్సియారిటీలో కొంతైనా  ప్రదేప్  రికమెండ్ చేసే మోడల్స్ లో లేదు. గంట కూచునేసరికి విసుగుబుట్టి లేచిపోయే వారు. ఇమ్మోరాల్ గా బి హేవ్ చేసేవారు స్టూడియోలో, లోకేషన్ లో  దాంతో నా మూడ్ పాడయ్యేది.

    వారికి కావాల్సింది తేరగా వచ్చే ఫేమ్, డబ్బు విచ్చలవిడిగా త్రాగి ప్రదీప్  మనుష్యుళ సుఖాలు తీర్చడమే.

    టూత్ పేస్టుమీద ఫిల్మ్ తీయాలంటే పలువరుస బావుండాలి. షాంపో మీద తీయాలంటే జుట్టు బావుండాలి. ఇవి మినిమమ్ రిక్వైర్ మెంట్స్. ఇవేమీ వారిలో కనిపించేవి కావు. బోరుగా ఉందా కమలినిగారూ?" అడిగాడు చెబుతూ ఆగిపోయి.

    వినటంలో పూర్తిగా లీనమైన కమలిని ఆ ప్రశ్నకు ఉలిక్కిపడి "లేదు...... లేదు.......పైకి రావడానికి నువ్వెంతగా స్ట్రగుల్ పడ్డావో వివరంగా ఈరోజే తెల్సుకోగలుగుతున్నాను" అంది.

    "మీకయితే ఇంత వివరంగా చెప్పాల్సిన అవసరంలేదు. కాని మంగళకు మన ఫీల్టు గురించి అంతగా తెలియదు. అందుకే" ఆగిపోయాడు మనోహర్.

    "నో ప్రాబ్లమ్....ప్రొసీడ్" అంది కమిలిని.

    "ఓసారి......బాస్టర్డ్......" చెప్పడం ఆపాడు. మనోహర్ కు. ఓ నిముషం. అంతలోనే తననుతాను నిగ్రహించుకొని మరలా చెప్పటం మొదలెట్టాడు.

    "ఓ పదిహేనేండ్ల అమ్మాయిని తీసుకొచ్చాడు. పిల్లకు, ఆమె తల్లి దండ్రులకు ఏం మాయమాటలు చెప్పాడో తెలియదు. నాతోపాటు వర్క్ చేసే మరో ఫోటోగ్రాఫర్ ఆమెతో కేంపైన్ మొదలెట్టాడు. ఆమెను పూర్తి నగ్నంగా చెయ్యమని వత్తిడి తెచ్చారు. ప్రదీప్ దృష్టిలో  మోడల్స్ అంటే సెక్స్ బొమ్మలు. ఏ వ్యక్తిత్వమూలేని మాంసపు ముద్దలు.  నగ్నంగా జేయనని ఆ అమ్మాయి ఎదురు తిరిగింది. అసలు పదహారేళ్ళ లోపు వున్న  అమ్మాయిల్ని నగ్నంగా ఫోటోలు తీయటం చట్టవిరుద్దం ముప్పాతిక నగ్నంగా కూడా చూపించకూడదు. బికినీ అయితే ఫర్వాలేదు. టాప్  లెస్ గా  తీసినా ఫోటోగ్రాఫర్ జైల్ కెళ్ళాల్సిందే. చట్టం అంటే లెక్కేముంది. ఎదురు తిరిగిన ఆ అమ్మాయిని రాక్షసంగా రేప్ చేసారు ప్రదీప్, అతని  కుడిభుజం లాంటి కైలాష్. మా ఫిల్మ్ లో  చూపించడానికి వీలుపడని  నీ అందాలు మరెవరూ చూడకూడదంటూ ఆమె ముఖంమీద, ఒంటిమీద  యాసిడ్ పోసారు. ఆమె అపురూపమైన లేత సౌకుమార్యం మసిబొగ్గయింది. ఏడ్చింది. మొత్తుకుంది. కాని ప్రదీప్ ఎదురుతిరిగి ఆమెను కాపాడే ధైర్యం ఎవరికీ లేకపోయింది.

    ముక్కుపచ్చలారని ఆ పిల్ల తల్లిదండ్రులు చేతులారా తామే తమ పిల్లను నాశనం చేసుకున్నామని కుళ్ళిపోయారు. వారి దృష్టిలో అనుకోకుండా నేను పడ్డాను. నన్ను ప్రాధేయపడ్డారు - నష్టపరిహారం ఇప్పించమటూం. వారికి జరిగిన అన్యాయం గురించి అడ్వర్టయిజింగ్ ఆథారిటీ ఆఫ్ ఇండియాకి రాసాను. దానినుంచి సమాధానంరాలేదు. కాని ప్రదీప్ పగ నామీద రెట్టింపయింది. అయినా  లెక్కచేయకుండా ఆ పిల్లకు నా ఆఫీసులో టైపిస్టుగా ఉద్యోగం ఇచ్చాను.

    ఆ పగతో ఓరోజు......" మరలా చెప్పటం ఆపాడు మనోహర్.

    అతని మొహం ఎర్రగా కందిపోయింది. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. కోపంతో అతని వళ్ళంతా వణికిపోతోంది.

    "ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ప్" అంది మంగళ.

    ఇద్దరివై పోసారి చూసి తనను తాను నిగ్రహించుకొని మరలా చెప్పటం మొదలెట్టాడు.

    "నాకు నా చెల్లెలంటే ప్రాణం. చిన్నప్పుడే అమ్మా నాన్న పోతే దాన్ని  నా కంటికి  రెప్పలా  కాపాడుకుంటూ వస్తున్నాను" ఆగిపోయాడు మరలా. హఠాత్తుగా చెల్లెలి గురించెందుకు చెబుతున్నాడో అర్థంకాలేదు ఆ ఇద్దరికి.

    "నామీద పగతో ఓ రోజు వాల్తేరునుండి వచ్చి, స్టేషన్ లో నా కోసం ఎదురుచూస్తున్న నా చెల్లెల్ని, నేను తీసుకురమ్మన్నానంటూ నమ్మించి కైలాష్ గాడు కిడ్నాప్ చేసాడు. కైలాష్  కారులో మీ చెల్లెలు వెళుతుందంటూ మధు చెప్పేసరికి నాకు  నవనాడులు స్తంభించిపోయాయి. వాడు పరమదుర్మార్గుడు. రాక్షసుడు. కర్కోటకుడు. నా చెల్లెల్ని ఏదో చేయాలనే ఎత్తుతోనే తీసుకెళ్ళుంటాడని వూహించగానే, సరాసరి వాళ్ళ విలాసాలకు ఆట పట్టయిన గెస్ట్ హౌస్  వెళ్ళాను. నన్నేం  చేయలేని ఆ బాస్టర్డ్స్ నా చెల్లెల్ని ఒంటరిదాన్ని చేసి, ప్రదీప్ , కైలాష్ మరో  ఇద్దరు  తాగి ఇష్టంవచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. అప్పటికే అనుపమ వంటిమీద  చీర, జాకెట్ వలిచేశారు.

    ఆ దృశ్యం చూసిన నేను రాక్షసుడిలా మారిపోయాను. ఎప్పుడూ ఎవరిమీదా చేయి చేసుకోని నేను ఆ నలుగుర్నీ చావచితగొట్టాను.

    నా చెల్లెల్ని నాశనంచేసి నన్ను సాధించాలనుకున్నవార్ని కుక్కల్లా వెంటాడి వెంటాడి కొట్టాను.

    నువ్విలాంటి వాడివని నాకు తెలియదు. నీ వర్క్  ఎంతో నిజాయితీగా చేసిపెడుతున్న నాకే ద్రోహం తలపెడతావా అనడిగాను, అతనిలో కించిత్ అయినా  పశ్చాత్తాపం కనిపించలేదు. నిర్లక్ష్యంగా చూసాడు. యాడ్  వరల్డ్ లో నాకు స్థానం లేకుండా చేస్తానన్నాడు. నన్ను కాదని వృత్తిలో ఎలా  కొనసాగుతావని సవాల్ చేశాడు.

    ఎంతకాలంగానో నాలో రగులుతూ వస్తున్న కోపం, కసి, పగ, ప్రతీకారం కెమేరా వున్నంతకాలం నన్నెవరూ ఏం  చేయలేడన్నాను. పరాచకంగా నవ్వాడు. నీకొస్తుందనుకొంటున్న కోరమాండల్  ఇండస్ట్రీస్ కి చెందిన కొత్త కేంపైన్ నీకు రాకుండా చేస్తానన్నాను. అప్పటికే నేను  కోర మాండల్ ఎమ్.డి.కి నా ప్రాజెక్టు రిపోర్టుతో స్క్రిప్టు ఇచ్చాను. నా  ప్రపోజల్ అతనికి బాగా నచ్చింది. వాళ్ళు కొత్తగా  ఇంటర్నేషనల్ మార్కెట్  లో దింపబోతున్న నాలుగు రకాల సోప్స్  మీద కొన్ని పేపర్ డిజైన్స్. నాలుగు యాడ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో  తీయించాలనుకుంటున్నాడు. ఒక్కొక్కదానికి మూడు లక్షలు, పేపర్ డిజైన్స్ కి మరో మూడు  లక్షలు ఖర్చుపెట్టాలనుకొంటున్నారు.

    నా వర్క్  గతంలో చూసుండటంతో, ప్రదీప్ తో వారికి తరచూ చికాకులు వస్తూండటంతో నాకే  ఆ కేంపైన్ ఇస్తానని మాటిచ్చారు ఎమ్.డి.

    ఆ ధైర్యంతోనే ఆ చాలెంజ్ విసిరాను. చూస్తాను ఎలా తీస్తావో అన్నాడు. చాలెంజ్ అన్నాను___ఛాలెంజ్ అన్నాడు.

    నా ఫిల్మ్ పూర్తిగాకుండా అడుగడుగునా అడ్డు తగులుతున్నాడు. ఏడ్చావ్ అన్నాను. ఇదీ జరిగిన సంగతి" అన్నాడు  మనోహర్ తన చాలెంజ్ వివరాలు చెప్పటం ముగిస్తూ.

    అతనిలో కోపం ఇంకా తగ్గలేదు. ఎలాగైనా  పందెంనుంచి విరమింపచేయాలనుకుంటున్న ఆ ఇద్దరికీ ఏం చెప్పాలో తెలియలేదు.

    "కాని.....ప్రదీప్ చాలా డేంజరస్ మనోహర్" సందేహంగా అంది కమలిని. మనోహర్ మాట్లాడలేదు.

    "ఫోటో గ్రాఫర్ గా నువ్వు సమర్ధుడివే కావచ్చు. అయినా అతనికి ఎదురునిలిచి ఈ ఎసైన్ మెంట్ పూర్తిచేయగలవా?" ఆందోళనగా అడిగింది కమలిని.

    "బై హుక్ ఆర్  క్రూక్ ఐ వాంటూ డూ ఇట్ దట్సాల్" అన్నాడు. తనను పందెంనుంచి విరమింపజేసే ప్రయత్నాలు చేయవద్దని పరోక్షంగా హెచ్చరిస్తూ.

    అంతలో ఫోన్ వచ్చింది. గిరీష్ నుండి. లోకేషన్ లో అరేంజ్ మెంట్స్ రడీ అయ్యాయని. షూటింగ్ కి బయలుదేరమని. ఠక్కున లేచాడు  మనోహర్.

    "నేను షూటింగ్ కి వెళుతున్నా" అంటూ బ్రీఫ్ కేసు సర్దుకోవడంలో మునిగిపోయాడు. అప్పటివరకు అతనిలో కనిపించిన కోపం, కసి, పగ, ప్రతీకారం ఏమీ  ఇప్పుడతనిలో కనిపించడంలేదు. ప్రశాంతంగా వున్నాడు.

    షూటింగ్ మూడ్ లోకి వచ్చే ప్రయత్నంలో వున్నట్లుగా అనిపించింది కమలినికి.

    మనోహర్ కి ఈనాడు చేతినిండా పనుంది. పెద్ద పెద్ద యాడ్ ఏజెన్సీస్ మనోహర్ ని పిలిచి వర్క్  ఇస్తున్నాయి. మనోహర్ చేతిలో పడితే టాప్ మోడల్ కావచ్చని, ఇండియాలోని ప్రతి మోడల్ ఉత్సాహపడుతుంటుంది. పైపెచ్చు మనోహర్ తో వర్క్  చేయటం ప్రెస్టేజ్ గా భావిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే మనోహర్ జాతీయస్థాయి గుర్తింపు పొందినట్లే. 1985 నవంబర్  5న జరగబోయే 'వరల్డ్  ఫ్యాషన్ ఎయిడ్' లో ప్రపంచ ప్రసిద్దులైన ఫ్యాషన్ మోడల్స్ పాల్గొంటారు. ఆఫ్రికా కరువు బాధితులకోసం విరాళాలు పోగుచేసేందుకు ఏర్పాటుచేస్తున్న ఆ ఫ్యాషన్ షో లో పాల్గొనటం ప్రపంచంలోని ప్రతి మోడల్ కి గొప్ప గర్వకారణం. మనోహర్ ద్వారా ఆ చాన్స్ సంపాదించాలని ఇండియాలోని టాప్ మోడల్స్ కూడా ఉత్సాహపడుతున్నారు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra