Home » Yandamuri veerendranath » దుప్పట్లో మిన్నాగు


    ఆ రోజు ప్రోద్దున్నుంచీ - ఆ మాటకొస్తే అసలు ఉదయం ప్రారంభం కావటమే  అదోలా అయింది. ఏదో జరగబోతూ వుందని అనిపిస్తూంది. రచయిత మాటలలో చెప్పాలంటే మనసంతా టెన్షన్ గా వుంది. గాలికూడా అదో రకమైన  సస్పెన్స్ తో నిండివుంది. ఆ రోజు మంగళవారం. నాకు బాగా జ్ఞాపకం. ఆ  తరువాత సరీగ్గా వారంరోజులకు మంగళవారం నాకు ఆపరేషన్ జరిగింది. అతడు రావటమే చాలా నాటకీయంగా వచ్చాడు. నా దగ్గరికి వచ్చి, కసాయివాడు మేకని చూసినట్టు నన్ను పరీక్షగా చూసి. తన స్వభావసిద్ధమైన గంభీర స్వరంతో ఒకే ఒక మాట అన్నాడు.
    "వెల్ మై బోయ్! నేను సరిగ్గా నీలాటి వాడికోసమే చూస్తున్నాను."
    బహుశా డాక్టర్ విలియమ్స్ గురించి నీవు పేపర్లో చదివే వుంటావు. గొప్ప న్యూరో సర్జన్. మెదడులో చొచ్చుకుపోయిన ఎముకముక్కనయినా ఆపరేషన్ చేసి తీసేయ్యగలడని ప్రతీతి. మెదడులు ఆపరేషన్ చెయ్యటంలో అతడికి గల ప్రావీణ్యం చూసి అతడిని మనరాష్ట్ర ఆస్థాన అసెంబ్లీ వైద్యుణ్ణి చేశారనీ, అదయ్యాక అతడు కొద్దిగా మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నాడనీ ఒక వదంతి వుంది. కానీ నువ్వు  నమ్మకు.
    ఇంతకీ చెప్పొచ్చే దేమిటంటే, అతడు వచ్చి నా  పక్కమీద  కూర్చుని "చూడు- ఇంకా కొద్దిరోజులలో నువ్వు చచ్చిపోతున్నావు౦ అవునా?" అని  అడిగాడు. అంత సూటిగా  అడగటం అతనొక్కడికే సాధ్యం.
    అవునన్నాను.
    ప్రాణాలు తెగించయినా ఈ వ్యాధిని గెలవటానికి ఇదేమీ హాకీ, క్రికెట్ ఆటా కాదు. నేనేమీ పాకిస్థాన్ వాణ్ణీ కాదు.
    "ఇంకో వారం పదిరోజులలో నువ్వీ గదిలో ఇలాగే చచ్చిపోతావు. ఆ సాయంత్రం నిన్ను తీసుకెళ్ళి పాతిపెడతారు. అవునా?" అన్నాడు భవిష్యత్తుని అద్దంలో చూస్తున్నట్టు.
    "కాదు" అన్నాను. అతడు ఆశ్చర్యపోయి "మరి" అని అడిగాడు.
    "పాతిపెట్టరు. మాలో కాలుస్తారు."
    "అదే -  అదే!" అన్నాడు సరిదిద్దుకుంటూ "నువ్వేమనుకుంటున్నావు స్వర్గానికి వెళ్ళగలననుకుంటున్నావా?"
    "అనుకోవటంలేదు. తెలుగు మహాసభలకి 'లంచం ఇచ్చి వెళ్ళటం' అనే పాపం చేశానుగా" అన్నాను.
    "కాబట్టి నరకానికి వెళతావు."
    "అవును. అక్కడైతే రాజకీయ నాయకులూ, సినిమా యాక్టర్లూ, పత్రికల్లో వ్యాసాల ద్వారా ఒకర్నొకరు తిట్టుకునే కవులూ వుంటారు" అన్నాను చిరునవ్వుతో. అని "ఇంతకీ మీరు చెప్పదలచుకున్నది ఏమిటి డాక్టర్. మీరు శరీరమనే చల్లని పరీక్షించటానికి వచ్చి, స్టెతస్కోప్ అనే ముంతని దాస్తున్నారు" అని అడిగాను.
    "సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన తరువాత మీరు మీ భాషని సంస్కరించుకున్నట్టున్నారు" మెచ్చుకోలుగా అన్నాడు డాక్టర్. 'గొప్ప ఉపమాలం కారము."
    "వెల్" అన్నాడు ఆయన. "నేను నీ ముందు ఒక ప్రపోజల్ పెట్టటానికి వచ్చాను రంగారావ్! వింటావా?"
    ఇక్కడ మాత్రం ఈయన నా గురించి తక్కువ అంచనా వేశాడు. ప్రతి ఉగాదికీ రేడియోవారు నిర్వహించే గోష్టిలో "చెడు వెళ్ళిపో ఫో, ఫో, ఫో, మంచీ రా, రా, రా" అని అరిగిపోయిన రికార్డులా పఠనం చేసే కవుల సమ్మేళణానికి హజరయ్యీ, అయ్యీ, బోరుని ప్రతిఘటించే శక్తి నా రక్తంలో జీర్ణించుకుపోయిందని ఆయన గ్రహించలేకపోయాడు. "చెప్పండి. వినటం వాళ్ళ నష్టం లేదుగా" అన్నాను.
    "కానీ విని ఒప్పుకోవటం వల్ల లాభం వుంది. నీ మరణం తరువాత...."
    నా మరణం తరువాత -అనగానే నువ్వే జ్ఞాపకం వచ్చావు అరుంధతీ. కొంపతీసి నా మరణం తరువాత ఈయన తన చూపుడువేలుకి గుండుసూది గుచ్చుకుని, నెలవంకలాంటి నీ నుదుటమీద బొట్టు అద్దటం గురించి ఆలోచిస్తున్నడేమో! దీనిగురించి ససేమీరా ఒప్పుకోను గాక ఒప్పుకోను అని నిశ్చయించుకున్నాను. కానీ పాపం విలియమ్స్ తన వృత్తి గురించే ఎల్లవేళలా ఆలోచించే డాక్టర్!
    ఎంతో ఉద్వేగంతో ముందుకు వంగి అన్నాడు- "ఈ విషయం గురించి నేను చాలా కాలంగా ఆలోచిస్తూ వచ్చాను రంగారావ్! కొంత గ్రౌండు వర్కు చేశానుకూడా. నాఅసిస్టెంటు దీనికి సాయపడ్డారు. జంతువులమీద ఈ ప్రయోగాన్ని నిర్వర్తించి మేము సఫలీకృతమయ్యాము. ఇప్పుడిక మనిషిమీద చెయ్యటమొక్కటే తరువాయి. అవును ఎందుకు సాధ్యంకాదు? తప్పక సాధ్యమవుతుంది. నా చేతివేళ్ళ మీద నాకు మన్నకం వుంది రంగారావ్!"
    డాక్టర్ విలియమ్స్ తన చేతుల్ని ఒళ్ళో పెట్టుకున్నాడు. నేను మాత్రమే నిన్ను రక్షించగలను అన్న కాంతి అతడి కళ్ళలో వెలుగుతూంది. ఏమిటి ఈయన చెప్పదలచుకున్నది? నా రక్తాన్నంతా తోడేసి అందులోంచి లంచగొండులైన మంత్రుల్ని ఏరి నట్టు కేన్సరు కణాల్ని ఏరేసి, తిరిగి ఎక్కిస్తాడా?
    ఆయన తన ధోరణిలో చెప్పుకుపోసాగాడు- "చాలాకాలం క్రితం నేనొక రష్యన్ చిత్రాన్ని చూశాను. చాలా దారుణమైన చిత్రమనుకో అది! కానీ నాకు  స్ఫూర్తిని కలగచేసింది. అందులో ఒక కుక్కతల, మొండెం నుంచి వేరై వుంటుంది. కానీ దాని తలకి రక్త ప్రసరణం  మాత్రం  మిషన్లద్వారా మామూలుగానే అందజెయ్యబడుతుంది. ఇప్పుడిక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆ తల, ఆ ఒంటరి తల, ట్రేలో కాఫీ కప్పులాగా అమర్చబడి ఆ తల, బ్రతికేవుంది. రంగారావ్! దాని మెదడు పనిచేస్తూనే వుంది!! చాలా పరీక్షలకి అది నిలబడింది కూడా! ఒక మాంసపు ముక్కని దాని ముందునుంచి తీసుకువెళ్ళావనుకో- దాని కనుగుడ్లు అటు తిరిగేవి, ముక్కుమీద మసాలా జల్లావనుకో- దాని నాలుక బయటకొచ్చి ఆడేది.
    దీన్ని బట్టి తేలిందేమిటంటే తలకానీ, మెదడుకానీ, మిగతా శరీరంతో సంబంధం లేకుండానే  పనిచేస్తాయని. అఫ్ కోర్స్, వాటికి ఆక్సిజనే టెడ్ రక్తాన్ని ప్రసారం చేస్తూ వుండాలనుకో.
    ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే, ఆ చిత్రం చూసినప్పటి నుంచీ నాలో ఈ  ఆలోచన మెదులుతూనే వుంది. ఒక మనిషి కపాలం నుంచి అతడి మెదడుని భద్రంగా బయటికి తీసి, దాన్నో ప్రాణం వున్న పదార్థంలా కొన్ని వందల సంవత్సరాలపాటు ఎందుకు బతికి వుంచకూడదూ అని- మనం చేయవలసిందల్లా రక్తం శుభ్రపరచి ఆ మెదడుకి పంపుతూ వుండటమే. మనిషి చచ్చిపోనీ.....మనకేం  ఫర్లేదు. మనకు కావలిసింది మెదడు. ఉదాహరణకి నువ్వు చచ్చిపోయాక నీ మెదడు."
    "నాకు ఇష్టంలేదు" అన్నాను.
    "మధ్యలో నా బ్రెయిన్ వేవ్ ని ఆపుచెయ్యకు రంగారావ్! నేను చెప్పింది విను. నేను ఇప్పటివరకూ చేసిన ప్రయోగాల బట్టి తేలిందేమిటంటే, మెదడు ఒక  ప్రత్యేకమైన పదార్ధం! దానికి కావలసిన సెరబ్రో స్పైనల్ ప్లూయిడ్ ని దానంతట అదే తయారు చేసుకుంటుంది. 'ఆలోచన' 'జ్ఞాపకం' లాటివన్నీ దానిలోనే నిక్షిప్తం చేయబడి వుంటాయి. కాళ్ళు చేతులు, కడుపులాటివి లేకపోయినా తన  పని అది చేసుకుపోతుంది. రంగారావ్! ఒక్కక్షణం నీ మెదడు గురించి కాస్త మెదడు పెట్టి ఆలోచించు, సాహిత్యంతోటీ, రాజకీయాలతోటి, నీ చదువు ఇచ్చిన విజ్ఞానంతోటి ఎండివుంది అది. దాన్ని అలా  విజ్ఞాన వంతంగా తయారు చెయ్యటానికి నీకు ఎన్నో సంవత్సరాలు పట్టివుంటుంది. అవునా? అలాంటిది నీ శరీరంతో పాటూ చచ్చిపోబోతూంది అదీ! కేవలం బ్లడ్ కేన్సర్ అన్న వెధవ వ్యాధి వచ్చినందుకు నీ శరీరాన్ని వదిలి- అన్నట్టూ మీ పురాణ గ్రంథమైన భాగవతంలో ఆ దేవుడెవరూ- శ్రీరాముడు కదూ......"
    "కాదు, శ శ్రీకృష్ణుడు అన్నట్టు ఆత్మకి మరణం లేదు. మనిషి చొక్కని మర్చి వేరొక చొక్కా తొడుక్కున్నట్టు బ్లడ్ కేన్సర్ వచ్చిన నీ శరీరాన్ని వదిలి నీ ఆత్మ ఇంకో శరీరాన్ని వెతుక్కోబోతూంది. దీన్ని ఆపటానికి నా ప్రయత్నం.....
    "నో-థాంక్స్" అన్నాన్నేను. "ఇక ఈ ఆలోచన్నీ, ప్రయత్నాన్నీ ఇక్కడ ఆపితే మంచిది. కేవలం నా ఆత్మ మాత్రం చొక్కా లేకుండా వుండి, నేను మాట్లాడలేక చూడలేక, తినలేక, కదల్లేక, ముఖ్యమైనది 'మరొకటేదీ' చెయ్యలేక ఎందుకు వుండటం? అంతకన్నా నరకం మరొకటి వుండదనుకుంటా."
    "బ్రతికున్న మెదడుతో నువ్వేం చెయ్యగలవు అన్న విషయం గురించి తరువాత ఆలోచిద్దాం రంగారావ్! ముందు నేను చెప్పేది అర్థం చేసుకో...... నువ్వెలాగో మరణిస్తావు. నువ్వు మరణించిన తరువాత నీ మెదడు ఆపరేట్ చేసి నేను తీస్తాను. దీనివల్ల నీకేం నష్టం? ఒక మహత్తరమయిన ఆశయానికి నిన్ను నువ్వు అర్పించుకుంటున్నావ్ అంతేగా!"
    "మీ తెలుగు కొద్దిగా సరిదిద్దుకోవాలి. నేను మరణించను. 'మరణిస్తే' అసలు సమస్యే లేదు" అన్నాను- 'మరణిస్తే' అన్న మాటని ఒత్తి పలుకుతూ.
    "అఫ్ కోర్స్ - నువ్వు చెప్పింది నిజమే. సిగరెట్ వెలిగించుకున్నాడు. దాని పోగాకేసి ఒక క్షణం తన్మయత్వంతో చూసి, నావైపు తిరిగి, "నేను ప్రారంభించవచ్చునా?" అని అడిగాడు.,
    "దీన్ని ఇక్కడితో ఆపుచేస్తే మంచిదని నా ఉద్దేశ్యం"
    "నువ్వు  మరీ అప్ సెట్ అవుతున్నావు. కొంచెం కామ్ గా విను" అన్నాడు నేను మాట్లాడలేదు. అతడు  చెప్పటం ప్రారంభించాడు. "నేను నీ మంచం పక్కనే వుంటాను. మరణం సంభవించగానే వెంటనే నా పని ప్రారంభించి- మెదడు మాత్రం చెడిపోకుండా చూస్తాను. ఈ ఆలోచన బావుందా?"
    "ఎలా? తలలో వుంచేసి అలాగేనా?"
    "ఆఁ ప్రారంభంలో అలాగే చెయ్యాలి."
    "ఆ తర్వాత...."
    "దాన్ని జాగ్రత్తగా తీసి ఒక బేసిన్ లో పెట్టాలి."
    నా కెందుకో అనుమానం వచ్చి "మీరిదంతా సీరియస్గానే చెబుతున్నారా?" అని అడిగాను.
    "నేను సీరియస్ గానే చెబుతున్నాను రంగారావ్!"
    "వూఁ, చెప్పండి."
    "గుండె ఆగిపోగానే రక్తంలో ఆక్సిజను లేక - మెదడులో జీవకణం చచ్చిపోవటం ప్రారంభిస్తుంది. మొత్తం అయిదారు నిముషాల్లో 'ఈ చచ్చిపోవటం' అనేది పూర్తి అవుతుంది. కాబట్టి అంతా రెండు మూడు నిమిషాలలో నేను పూర్తి  చెయ్యాలి. చేతిలో మిషను ఉంటుంది కాబట్టి ఫర్లేదనుకో."

    "ఏం మిషను?"
    "కృత్రిమమైన గుండలాంటి మిషను. రక్తాన్ని సరి అయిన టెంపరేచరులో ఉంచీ, సరి అయిన ఒత్తిడిలో పంపి కావలిసినంత ఆక్సిజను దానికి అందించే మిషను."
    "ఇంకొంచెం వివరంగా చెప్పండి"
    "మెదడులో రక్తనాళాల గురించి నీకేమైనా తెలుసా?"
    "మెదడులో రక్తనాళాలు పగిలిపోయేలా ఆలోచించాడు- అని చదవటమే తప్ప అంతకన్నా ఎక్కువగా తెలీదు."
    "అయితే విను. మెదడుకి రక్తాన్ని తీసుకెళ్ళేవి కెరోటిక్ అర్టిరీస్, వెర్టిబ్రల్ అర్టిరీస్. ఇవి చెరో జతా వుంటాయి. మెదడు నుంచి వెనక్కి రక్తాన్ని పంపేవి  మరో జత వీన్స్. ఇవన్నీ మెదడులో శాఖోపశాఖలుగా విస్తరిస్తాయి అనుకో. వాటి గురించి మనకేమీ సంబంధంలేదు. మెడ దగ్గరున్నవి మాత్రం నాలుగు పైకి వెళ్ళేవి- రెండు క్రిందికి దిగేవి. మొత్తం ఆరు నాళాలు."
    "సరే, అర్థమైంది. నేను చావగానే మీరు చేసే మొట్ట మొదటి పని ఏమిటి?" 

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra