Home » Vasireddy seeta devi novels » చిలకలు


    "అసలు! ఈ చిరాకులన్నీ నీ వల్లనే....అత్తయ్య చేత నేను తిట్లుతింటున్నాను."
    "నేనేం చేశానేమిటి? అయినా అమ్మా నన్ను తిరుతుంది కాని. నిన్నెప్పుడు తిట్టిందేం?"
    "ఆ తిట్లన్నీ నీ మీదే పెట్టి నాకే వడ్డించడం. వేరే  తిట్టాలా? నాకేసి అత్తయ్య ఇలాంటి సమయాల్లో ఎలా చూస్తుందో తెలుసా?"
    "ఎలా చూస్తుందేమిటి?"
    "నేను కాబట్టి పడి ఉంటున్నాను మరొకడైతే నీకూ. నీ కూతురికి ఓ దణ్ణం అని పారిపోయేవాడు."
    "నిన్ను కొడుకులా చూస్తుంది మా అమ్మ. ఆమె మీద ...."
    "ఆమెను నేను తప్పు పట్టడంలేదు. తప్పంతా నీదే."
    "నేనేం చేశానూ?"
    "ఏం.ఏ పూర్తి చేసిందాకా పెళ్ళి చేసుకోనంటావ్. మళ్ళీ నా మానాన నన్ను ఉండనివ్వవు...."
    "సరేలే మళ్ళీ మొదటికొచ్చావ్. మాటకుముందు పెళ్ళి అంటావు ఊ! అమ్మను పిలువు" అంది సునంద.
    "అయితే నేను చచెప్పినట్టు చేస్తావా?"
    "ఊ!" అని సునంద తలఊపింది.
    "అయితే అని రెండు పెదవులు కలిపి ఇక్కడ అనించు." ఆమె రెండు భుజాలూ పట్టుకొని తన వైపుకు లాక్కున్నాడు.
    "పో! బావా!" అంటూ విజయ్ చేతుల్నినెట్టేసిసునంద ముందుకెళ్ళి తలుపు చిన్నగా తడుతూ "అన్నయ్యా!అన్నయ్యా!" అని పిల్చింది.
    తలుపులు చెయ్యి పడగానే కొద్దిగా తెరుచుకొన్నాయి.
    లోపల గడియ వేసి లేకపోవడం చూసి విజయ్ ఆశ్చర్యంగా ముందుకు వచ్చాడు.
    "ఆగు సునందా! ఇంత రాత్రిప్పుడు తలుపులు తీసి ఉండటం ఏమిటి? ఎవడో జొరబడి ఉంటాడు." అని రాధను వెనక్కు నెట్టి తను గబగబా లోపల కెళ్ళి నరేంద్ర రూం కేసి పరుగు తీశాడు.
    గదిలో లైట్ వెలుగుతోంది.
    డిటెక్టివ్ నరేంద్ర చెస్ బోర్డు మీదకు వంగిశిలా ప్రతిమలా కూర్చుని ఉన్నాడు.
    "నరేంద్రా?" విజయ్ పిలుపుకు ఏ లోకం నుంచో బయటపడ్డ వాడిలా హల ఎత్తి చూశాడు నరేంద్ర.
    "బయట తలుపులు తీసి ఉన్నాయ్ " గాభారాగా అన్నాడు విజయ్.
    "ఆ? నేను తీసేనులే కారు హారన్ వినిపించింది. సినిమానుంచి తిరిగి వచ్చే వేళ కూడా అయిందని, ముందే తలుపు తీసి ఉంచానుఏమిటంత హడావిడి పడిపోయావ్?"
    "అమ్మయ్య! ఇంట్లో ఎవడో జొరబడ్డాననుకొన్నాను. ఎందరో కటిక దుర్మార్గులూ హంతకులూ, రౌడీలూ నీకు శతృవులు. ఏం జరిగిందోనని భయపడిపోయాను" ఇంకా గుండెదడ  పూర్తిగా తగ్గలేదు విజయ్ కు.
    సునంద పొట్ట చెక్కలయ్యేలా నవ్వసాగింది.
    "ఎందుకు నవ్వుతావ్?" చిరు కోపంగా చూశాడు విజయ్.
    "అన్నయ్యా....మరే....బావే....ఏ అంత డిటెక్టివ్ అవుతాడట ఈ చిన్న విషయానికి ఎంత కంగారు పడిపోయాడనుకొన్నావ్?" పొట్ట చెత్తోపట్టుకుని ఒక నవ్వసాగింది సునంద.
    నరేంద్ర కూడా పకపక నవ్వాడు.
    "ఏమిటే అర్తరాత్రప్పుడు ఈ అల్లరీ?" శాంతమ్మ విసుక్కుంది.
    తల్లిని చూసి సునంద బావను గురించి ఏదో చెప్పబోయి ఆమె ముఖం చూసి ఆగిపోయింది.
    "అదేమిటే? ఈ రాత్రప్పుడు ఈ సింగారింపూ నువ్వునూ? మళ్లీ రెండో ఆటకు వెళ్ళారా?" శాంతమ్మ చిరాకుపడిపోయింది.
    "నేను రానంటే బావ బలవంతం చేసి సినీమకు తీసుకువెళ్ళాడే అమ్మా!" సునంద ఏడుపు ముఖం పెట్టి అన్నది.
    "కదత్తాయ్యా! సునందే, నాకు కేసు ఉంది రానంటే కూడా ప్రాణం తీసి సినిమాకు తీసుకెళ్ళింది." అన్నాడు విజయ్.
    సునందకు కోపంతో చెక్కిళ్ళు కందిపోయాయి.
    "అమ్మా, బావ మాటలు నమ్మబాక" అని విజయ్  కేసి  తిరిగి మళ్లీ సినిమాకు పిలువు నీ పనిచెస్తాను" అన్నది సునంద.
    "నీ సంగతి ఎవరికీ తెలవందిగాని పదవేముందూ?" తల్లి సునంద రెక్క  పట్టుకుని లాక్కెళ్ళింది.
    విజయ్ కేసి చూసి మూతి విరుస్తూ తల్లి వెనకే వెళ్ళిపోయింది సునంద.
    "ఇంత రాత్రప్పుడు ఒక్కడివే చెస్ ఆడుతున్నావేమిటి?విజయ్ విస్మయంగా అడిగాడు.
    "మొన్న జరిగిన అంతర్జాతీయ చదరంగం పోటీలో రష్యన్ ఆటగాళ్ళ ఎత్తు ఇది. ఇలారా! దీన్ని ఎలా సాల్వ్ చేస్తావో చెప్పు!" నరేంద్ర చెస్ బోర్డును విఅజయ్ ముందుకు జరిపాడు.
    విజయ్ చెస్ బోర్డును పరిశీలనగా చూస్తూ "అబ్బో! ఇది చాలా తికమకగానే ఉందే? ఏ పావును కదిలించినా రాజుగారుబంధించబడతారు ఇది నావల్లకాదు" అన్నాడు.
    అంతలో గదిలో టెలిఫోన్ మోగింది.
    "ఏం? హత్య  అనే ఎందుకు అనుకోవాలి?" విజయ్ ను నిశితంగా చూస్తూ అన్నాడు నరేంద్ర.
    "రాత్రి రెండు గంటలప్పుడు డిటెక్టివ్ నరేంద్రతో ఇంకేం పని ఉంటుంది? అరె! ఫోన్ పెట్టేసినట్టున్నారు" అన్నాడు విజయ్.
    "పర్వాలేదు. అవసరం అయితే మళ్ళీ చెప్తారులే. అది సరే విజయ్! లా తొందరపడి  నిర్ణయాలకు రావడం అపరాధ పరిశోధకులు చెయ్యాల్సిన పనికాదు! అందువల్ల అపరాదులు తప్పించుకోవడం నిరాపరాధులు చిక్కుల్లో పడటం జరగొచ్చు" నరేంద్ర మాటలు విజయ్ బుర్రలో ములుకుల్లా నాటాయి. ముఖం చిన్నబుచ్చుకున్నాడు.
    "అవును! విజయ్! నువ్వు నిశితంగా ఆలోచించగలవు ఎంత జటిలమైన విషయాన్నయినా, క్షణంలో గ్రహించగల శక్తి నీకుంది. కాని నిర్ణయాలు మాత్రం తొందరపడి చెయ్యకూడదు. ఒక అమాయకుడ్ని అవరాధిగా మనం అనుమానిస్తే , అతడు ఎంత బాధపడ్తాడో ఒక సారి ఆలోచించు"
    "అంటే సూర్యనారాయణ రామకృష్ణను చంపలేదు అతడు నిరపరధి, అన్యాయంగా అతన్ని నువ్వు అనుమానించావ్ అని చెప్పడానికేగా ఈ ఉపోద్ఘాతం?" చిరు కోపంగా అన్నాడు ఇజి.
    "అలా అని నేను అనలేదు. సూర్యనారాయణ అపరాధి అని వెంటనే నిర్ణయానికి రావద్దన్నాను."
    "వాడేమో హత్య చేసి ఎలిబీ కోసం నీ దగ్గరకొచ్చి కూర్చున్నాడు పెళ్ళాన్ని వెంటబెట్టుకొని నువ్వేమో వాళ్ళను ఇక్కడే ఉంచి హొటల్ ను వెళ్ళావ్ బుర్రలేని అద్వయితం ఏమన్నాడో విన్నావుగా?"
    "ఏమన్నాడూ?"
    "ఇంకేమనాలి? హంతకుడ్ని హొటలు వాళ్ళు పోల్చుకోగలరనీ  ఆ హంతకుడు తమ చెయ్యి చాపితే అందే అంత  దూరంలోనే ఉన్నాడనీ అన్నాడు. అంటే ఏమిటి అర్థం? అతడు నిన్ను ఈ కుట్రలో భాగస్వామిగా భావిస్తున్నాడనేగా? తీవ్రంగా ఉంది విజయ్ కంఠం.
    నరేంద్ర చిరునవ్వు నవ్వాడు.
    మళ్ళీ టెలిఫోన్ మోగింది. "చావుకబురే!" అంటూ విజయ్ వెళ్ళిఫోన్ ఎత్తాడు.
    "నువ్వు అనేదాంట్లో థియరీ కంటే జోత్యిష్యం ఎక్కువగా ఉంది." నవ్వుతూ అన్నాడు నరేంద్ర.
    "హల్లో! అవతలి గొంతు వినగానే విజయ్ ఆముదం తాగిన ముఖం పెట్టాడు.
    "ఎవరూ?"
    "ఇంకెవరూ? అద్వయితం!" అని విజయ్  నరేంద్రకు ఫోన్ అందించాడు.
    "హల్లో! ఇన్ స్పెక్టర్! సాయంకాలం రాలేదేం?"
    "నీ దగ్గరకు వచ్చే సమయం లేక నేనే వెళ్ళాను, వాళ్ళంతా నాకు తెలిసిన వాళ్ళేగా ?" అన్నాడు ఇన్ స్పెక్టర్.
    "ఊ!!"
    "హంతకుడు మొన్న రాత్రి నీ దగ్గరే తలదాచుకొన్నాడటగా రాస్కెల్ హత్య చేసి, నాకు ఫోన్ చేసి, నీ దగ్గరకు వచ్చాడా?"
    "ఎవరా హంతకుడు? నా దగ్గర తలదాచుకొన్నాడని ఎవరు చెప్పారు?" తాపీగా అన్నాడు నరేంద్ర.
    "ఎవరు చేస్తేనేంలే? నిజమేనా?"
    "అదేదో నువ్వే ఇన్నిస్టేగేట్ చేసి తెలుసుకో" ఇప్పటికే చాలా ఇన్ ఫర్ మేషన్ సంపాదించినట్టున్నావుగా?"
    "అది నేనే తెలుసుకుంటాలే. మరి నీ కేసు ఎంత వరకు వచ్చింది?"
    "నా కేసేమిటి?" చిరాగ్గా అడిగాడు నరేంద్ర.
    "అదే రాధారాణి హత్య కేసు."
    "ఆ కేసు నువ్వు వదిలేసుకొన్నాదా?"
    "అదెలా ? నువ్వు ఆ కేసులో శ్రద్ధ తీసుకుంటే నేను రామకృష్ణ కేసు చూద్దామని...."
    గుడ్ వైట్!" నరేంద్ర రిసీవర్ పెట్టేశాడు.
    "ఏమంటున్నాడు పూల్?" అడిగాడు విజయ్.
    "అడుసులో కాలేయ్యడం,ఆ తర్వాత నాలుక కర్చుకోవడం అతడికి అలవాటేగా?" అన్నాడు నరేంద్ర.
    ఏదో అనబోయి నరేంద్ర ముఖం చూసి విజయ్ తనగదిలోకి వెళ్ళిపోయాడు.
                                      8
    తెల్లవారి బారెడు పొద్దెక్కింది.
    కిటికీలో నుంచి మలి వెచ్చని సూర్య కిరణాలు ఆదమరచి నిద్రపోతున్న విజయ్ ముఖం మీదపడ్తున్నాయి.
    సునంద గదిలోకి వచ్చి, పసి పిల్లవాడిలా నిద్రపోతున్న విజయ్ ముఖంలోకి చూస్తూ కొద్ది క్షణాలు నిల్చుంది.
    "బావాలే! చాలా పొద్దెక్కింది. ఓ డిటెక్టివ్ బావా! లే! అన్నయ్య ఎప్పుడో లేచి బయటికి వెళ్ళడానికి సిద్దంగా ఉన్నాడు" అంటూ విజయ్ తలకింద దిండులాగేసింది.
    మంచం పైగా వంగి ఉన్న సునంద చెయ్యిపట్టుకొని లాగాడు విజయ్. సునంత తల విజయ్ గుండెల మీద వాలింది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra