Home » Kurumaddali vijayalakshmi » అందమైన అపశృతి


    "దాని మాటలకు అడ్డురావడం దేనికిరా చెప్పనియ్యి." అంది సీతమ్మ

    "శృతి చెప్పేది అబద్దమమ్మా! అడ్డు రాకుండా ఎలా వుండను?"

    "అబద్ద మంటుంటివి. అలాంటప్పుడు నీకెందుకురా బాధ?"

    "అలా అడుగమ్మ!" అంది శృతి.

    "ఇలాకాదు నిన్ను....నిన్ను....." అంటూ సిద్దార్థ ఒక్క అంగలో శృతి దగ్గరకొచ్చి చెవి గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పు నిజం" అన్నాడు.

    "నిజం చెబుతుంటే అడ్డు తగులుతుంటివి. అబ్బ! అంత గట్టిగా  చెవి మెలిబెట్టకూర అన్నాయ్! చెవి లేకపోతే నన్నెవడూ పెళ్ళి చేసుకోడు.

    "నే చేస్తాగా నీ పెళ్ళి నిజంచెప్పు."

    "నిన్న ఓ కలోచ్సింది. ఆ కలలో నీవూ శ్రీదేవి....."

    ఛత్ మీట మార్చేస్తున్నావ్. నిజమంటూ ఏమీ లేదు కదా. ఏదో కల్పించి చెప్పొద్దూ. అదీ విషయం." అంటూ శృతి చెవి వదిలేశాడు సిద్దార్థ.

    "అయినా ఆడపిల్లలా అంత ఉక్రోషం పనికిరాదు. నేను పనిచేస్తానో, మానేస్తానో నీ కెందుకు? అన్నింటికి వెక్కిరించటమే. అసలు నువ్విక్కడనుంచి వెళ్ళు. అమ్మా నేను కలసి పని చేసుకుంటాం."

    "ఆ సామానేదో తొందరగా  ఇస్తే ఆటకమీద పెట్టి వెళతాను.

    "అమ్మ అందిస్తుంది. నేను పెడతాను, తమరలా షికారు కొట్టి రండి" అంది శృతి ఏ వంకన సిద్దార్థను బైటికి పంపి తాను ఆటక ఎక్కాలని సామాను సర్దుతున్నప్పటినుంచీ ఆలోచిస్తున్నది, సమయం కుదిరింది ఇప్పటికి.

    "నిజంగా వెళ్ళరా?" సిద్దార్థకి బయటికి వెళ్ళాలనే వుంది. అటకమీద సామాను ఎక్కించటానికే ఆగాడు.

    "నిజంగా వెళ్ళు నువ్వు తిరిగొచ్చేటప్పటికి ఎంతపని చేస్తానో చూడు."

    "మీ వరస చూస్తుంటే కబుర్లు ఎక్కువ పని తక్కువ. మధ్యలో వదిలేసిపోయేటట్లున్నారు" అంతవరకూ వాళ్ళ మాటలు వింటున్న సీతమ్మ పెదవి విప్పింది.

    "శరీరానికి సుఖం అలవాటు చేస్తే కష్టం వచ్చినప్పుడు తట్టుకోలేదమ్మా! ఇహనుంచి పనిదొంగను కాకూడదని నిశ్చయానికొచ్చాను" గంభీరంగా అంది శృతి.

    "కష్టం వస్తుందని ఎందుకనుకోవాలే శృతీ?"

    "నువ్వేకదమ్మా! కీడెంచి మేలెంచమని చెపుతూంటావ్!"

    "చెప్పగా చెప్పగా ఇప్పటికి నా మాటలు తల కెక్కాయన్నమాట."

    "ఉన్నమాటకూడా."

    "మరి నే వెళ్ళనా?" అన్నాడు సిద్దార్థ.

    "నీదే ఆలస్యం" అంది శృతి.

    "వెళ్ళనా అమ్మా?"

    "వెళ్ళు ఇది సర్దుతానంటున్నదికదా! మరీ ఆలస్యం చెయ్యక తొందరగా వచ్చేసేయి."

    అలాగేనంటూ తల్లితో చెప్పి "థాంక్సే శ్రుతీ!" అని సిద్దార్థ వెళ్లిపోయాడు.

    పెద్ద గండం గడిచినట్లు "అమ్మయ్య!" అనుకుంది శృతి.

    పొందికగా చకచకా శృతి పని చేస్తుంటే సీతమ్మకి ముచ్చటసింది.

    "పనిలో వేలు పెట్టాదుగాని పెట్టిందంటే నా తల్లి పనికి వంకే లేదు అయినా అది నాకు పనిచేసి పెట్టాలా? నా కెందరున్నారని. ఇదీ, వాడూనూ, ఇద్దరూ రెండు కళ్ళు వాళ్ళకి నా చేతులతో చేసిపెడితే తృప్తి" అనుకుంది.


    సామాను సర్దటం అయిపోయింది.

    "వంటగదిలో సామాను తెస్తాను. ఇక నువ్వు అటకెక్కుదువుగాని" అంటూ సీతమ్మ వంటగదిలోకి వెళ్ళింది.

    శృతి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అట కెక్కింది. వీలయినంత నెమ్మదిగా, క్లుప్తంగా మురారిదేముడితో మాట్లాడాలనుకుంది. కాని అటకెక్కిన శృతి నిర్ఘాంతపోయి కళ్ళప్పగించి అలా వుండిపోయింది.

    "ఇదిగో చీపురు. ఓసారి ఆటక శుభ్రంగా చిమ్ము శృతీ! అన్న తల్లి పిలుపుతో చలనం వచ్చిన దానిలా కదిలింది శృతి. కళ్ళు నులుముకుని చూసింది.

    తన కళ్ళు తనను మోసం చెయ్యలేదని గ్రహించుకుంది.

    తను చూస్తున్నది నిజమేనని తెలుసుకుంది.

    నిజమే! మురారిదేముడు ఆటకమీద లేడు.

    ఆటకమీద మూలంగా కొద్దిపాటి సామానువుంది.

    అంతే.

    "ఏం చేస్తున్నావ్, ఇదిగో చీపురు." మరోసారి అంది

    సీతమ్మ

    శృతి చీపురు అందుకుంది.

    మురారిదేముడు ఎక్కడికెళ్ళాడు? అసలెలా వెళ్ళాడు? తమ మాటలు విన్నాడా? తనుంటే తనకీ చిక్కు. ఇటు మాకూ....పోనీ నాకూ చిక్కు అని వెళ్ళాడా? అతనిలో అంత మంచితనం వుందా? ఊహూ అతనో దొంగ ఖూనీకోరు మానవత్వం అతనిలో వుండటం అనేది సూర్యుడు పడమట ఉదయిస్తాడన్నంత తెలివి తక్కువ. పోనీలే వెళ్ళాడు. సీదావదిలింది.......

    "చిమ్ముతున్నావా?" కిందనుంచి సీతమ్మ కేకేసింది.

    "సామాను దులిపి సర్దుతున్నాను. చుమ్ము తానమ్మా!" అని చీపురికి పని  పనికల్పించింది శృతి.

    మడత పెట్టిన కాగితం, దానిమీద కంచుగ్లాసు కాగితం ఎగిరిపోకుండా పెట్టివుండడం శృతికికనబడింది.

    కాగితం మడత విప్పి చూసింది.

    అది ఒక ఉత్తరం కింద మురారిదేముడని సంతకం వుంది.

    చదవకుండానే కొంత అర్ధమైంది. కాగితం మడతపెట్టి జాకెట్టులో దోపుకుంది. వెంటనే అటక చిమ్మేపని చక చక మొదలుపెట్టింది.

    "లెటర్ రాసిపెట్టి మురారిదేముడు వెళ్ళిపోయాడని తెలుస్తూనేవుంది రక్షించాడు. లెటర్ లో ఏం రాశాడో? తొందరగా ఇక్కడపని కానిచ్చుకుని తీరుబడిగా లెటర్ చదవాలి."

    మురారిదేముడు ఏంరాసిపెట్టి వెళ్ళాడో చదివేదాకా శృతి మనసు ఆగేటట్లులేదు.

    అటక దులపటం అయింది.

    అటక మీద సామానుసర్దటము అయింది.

    శృతి ఆటక మీదనుంచి కిందకి దిగివచ్చింది.

    "ఇంకేం సర్దనక్కరలేదుగా అమ్మా!"

    "నీకు పనిచేతగాదన్న దెవరే శృతీ! చకచక ఎంత చక్కగా చేశావ్! నా చేతులోది ఇలా అందుకోటం అలా సర్దేయటం నా ముఖం ఇంకేం పనుంది!" మురిసిపోతూ అంది సీతమ్మ.

    "సరేలేమ్మా! నువు పర్దిస్తేనేకదా పొందికగా నే పెట్టింది! వళ్ళంతా చీదరగా వుంది స్నానం చేసివస్తాను."

    "చేసిరా!" అంది సీతమ్మ.

    శృతి బాత్ రూమ్ లో దూరింది.

    వళ్ళంతా చీదరంగా వుంది. స్నానం చేయాలని తొందరకన్నా లెటర్ చదవాలనే ఆత్రుతే ఎక్కువగా వుంది.

    బాత్ రూమ్ మించిన సురక్షిత స్థలం మరెక్కడా వుండదు.

    ఇలాంటి వాటికి కొన్నింటికి మాత్రమే.

    శృతి విడిచిన గుడ్డలు టబ్ లో పడేసి టవల్ చుట్టుకుని స్నానాల పీటమీద కూర్చుని పదిలంగా కాగితం మడతలు విప్పింది.

    "ప్రియమైన శృతీ!

    చదవగానే శృతి కంగుతింది. "ప్రియమైనట ప్రియమైన, రాయటానికి బుద్దిలేకపోతేసరి. బొడ్డుకోసి పేరు పెట్టినట్లు పేరు పెట్టి పిలుస్తున్నాడు. సరే ఈ ప్రియం ఏమిటి? అ ప్రియంగా వుంది, ఇంకానయం. డార్ లింగ్ అన్నాడు కాదు. రౌడీ వెధవల కేముంది? ఏమన్నా అంటారు. రౌడీ అయిన  ఫరవాలేదు. దొంగ, ఖూనికోరు, మోసగాడు....." ఇంకేం తిట్టుకోవాలో తెలియక మళ్ళీ లెటర్ చదవటం మొదలు పెట్టింది.

    ప్రియమైన శృతీ!

    ఇంకేమని నంబోధించాలో తెలియక, నన్ను కాపాడినందువల్ల నాకు ప్రియమైన దానివేనని ఇలా రాశాను. ప్రాణదేవతా! (ప్రాణబిక్ష పెట్టావు కదా?) అందామంటే నాకే నవ్వోస్తున్నది. చిన్నప్పుడు చదివిన కాశీ మజిలీ కథలు గుర్తొస్తున్నాయి మరి.....!

    శృతీ! ఇంక నిన్ను ఇబ్బంది పెట్టదల్చుకోలేదు. నీబాధ మీ ఇల్లు విడిది ఇవ్వటానికి మీ అమ్మగారి నిర్ణయం అన్నీ విన్నాను. ఎట్టి పరిస్థితులలోను మీ అన్నయ్యని అటకెక్కనీయవనీ ఆటక మీద సామాను సర్దే పనికి నీనే  పూనుకుంటావని నా గట్టినమ్మకం నాచేత  ఈ లెటర్ రాయనిచ్చింది.

    బెదిరించి బల ప్రయోగం చేసి ఇంకా ఈ యింట్లో దాక్కోటమన్నది నా ప్రాణం మీదకు తెచ్చుకోటమే అవుతుంది.. నా వైద్యానికి జ్వరం, కాలిబాధ తగ్గేటట్లు లేవు. గాయం సెప్ టిక్ అయితే ఆ దేముడుకూడా ఏం చేయలేడు- కాలు కొట్టేయటం తప్ప మరో రెండురోజులు చూసి నేనే వెళ్ళిపోదా మానుకున్నాను. ఆ వెళ్ళట మనేది ఈ రాత్రే తప్పనిసరయింది.

    మీ అన్నయ్య ఏ ఒంటిగంటకో నిద్రపోయాడు. అప్పుడు కిందకు దిగాను. అతకతో బుణం తీరిపోయింది. నిన్ను నెమ్మదిగా తట్టిలేపి చెప్పి వెళదామంటే నీ పక్కనే పడుకున్న మీ అమ్మగారు నిద్రపోలేదు. కదులుతూనే ఉన్నది.

    చెప్పి పోవటం దేనికి పోయేవాడివి పోక అంటానేమో! బెదిరించి నీ  ఆతిథ్యం పొందిన అతిథిని నేను. ఎలాంటి అతిథి అయినా పడి తిన్నందుకు కృతజ్ఞతగా చెప్పి పోవటం ధర్మం. ఏమంటావు శృతీ!

    నువ్వు నన్నెంతగా తట్టుకున్నావో, ఎన్నెన్ని  శాపాలు పెట్టావో గ్రహించుకోగలను. నా పరిస్థితి అలాంటిది. పులిని కొట్టి పులి గుహలో దాక్కోవలసిన వాడిని. లేడిని బెదిరించి కుందేలు పిల్లలాదాకున్నాను. దొంగా మనిషేనని గ్రహిస్తే ధన్యుణ్ణి శృతి!

    ఇంకేం రాయాలో తెలియటంలేదు. నీవు నాకు చేసిన సాయంగా ప్రతి సాయం ఏం చేయను? ఏం చేస్తే బుణం తీరుతుంది? నాకే ఆలోచనా రావటం లేదు. నన్ను ఆపదలో అదుకున్నందుకు నీ కెప్పుడైనా  అనుకోని ప్రమాదంలో చిక్కుకుని ఆపద వస్తేరక్షిస్తాను. ఇది నీకు ఆపద జరగాలని కోరటం కాదు. అవసరం అయితే ముఖం చాటేయక చేసిన మేలు మరుపక సాయం చేస్తానని చెప్పటం మాత్రమే. మాట ఇస్తున్నాను. ఇంకేం రాయటానికి లేదు.

    నీలాంటి అందమైన మంచిపిల్లకి జీవితాంతం సుఖ సంతోషాలు కలగాలని కోరుతూ-

                                                                                                           మురారిదేముడు."

    ఒక పావుఠావు కాగితంమీద చీమ తలకాయం తేసి అక్షరాలు చీమలబారులా మురారిదేముడు రాసిన బెటర్ని శృతి చదవటం పూర్తి చేసి ఓ నిట్టూర్పు విడిచింది. కాగితాన్ని ముక్కలు ముక్కలుగా చేసి తూములో తోసి నీళ్ళు  కొడదామని ఆగిపోయింది. లెటర్ ని అట్టిపెడితేనే బాగుంటుందనిపించింది, యదాప్రకారం మడతలు పెట్టి లెటర్ తడవకుండా కిటికీ అంచున పెట్టి స్నానాని  కుపక్రమించింది.

    "ఆపదలో సాయం చేస్తాడుట. ఇంకేం హంతకులకి ఆపదలు. హత్యలు తప్పమరేం తెలుస్తాయి? మహానుభావుడు రక్షించి ఇంతటితో వదిలాడు. ఆ...... వదిలేవాడో ఇంకా జలగలా పత్తు౭కు పీడించేవాడో. కాలు  సెప్ టిక్ అయితే కొట్టేస్తారని ఓ పక్క అదురుపుట్టింది. మరో పక్క భోజన వసతీ లేక నీరసించిపోతున్నాడు. పట్టుబడతానని ఏ మూలో భయంకూడా వుండి వుంటుంది. తోక ముడిచాడు పీడాపోయింది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra