మధూహ దిగ్భ్రాంతురాలై అతడినే చూస్తోంది. అతడి మాటల్లో ఆవేశాన్ని కాదు. కళ్ళలో సిన్సియారిటీని....

    నిజంగా ప్రేమంటే ఇంత తీవ్రంగా వుంటుందని ఆమె మొదటిసారి చూడటం. అతడిని అభినందించాలని ఆమెకి అనిపించింది. అతడితో ప్రేమించబడిన అమ్మాయికన్నా అదృష్టవంతురాలెవరైనా వుంటుందా? అసలే స్త్రీ అయినా ఇంత ప్రేమని నిరాకరించగలదా! ఈర్ష్య కూడా వేలమందిలో ఒకర్నే ఎన్నుకోవటం.....నువ్వు నాకు ప్రపంచంలో అన్నిటికన్నా ఇష్టమైనదానివి..... అని స్పష్టంగా చెప్పగలగటం.....

    "ఏమిటాలోచిస్తున్నారు?"

    ఆమె తెప్పరిల్లి "ఏమీలేదండీ. వెళ్లోస్తాను. మీరు కోరినట్టే ఈ విషయాలేవీ పేపర్లో రావు" అంటూ కదలబోయింది.

    "ఆగండి" అన్నాడు. ఆమె ఆగింది.

    "లక్ష్మీ అడ్రసు ఇస్తానన్న షరతుమీదే  మీకీ విషయాలన్నీ చెప్పాను."

    మధూహ గతుక్కుమంది.

    సంభాషణలో పడి అసలు విషయం మర్చిపోయింది.

    ఇపుడు, తమ పత్రికలో వ్రాస్తున్న లక్ష్మి అడ్రసు తమకి తెలీదంటే.....ఇంతసేపూ మోసం చేసినందుకు ఇక్కడే చంపి పాతేస్తాడు.

    "ఆమె  అడ్రసు పత్రికాఫీసులో వుంది" అంది తప్పించుకుంటున్నట్టు.

    పదండి. నేను మీతో వస్తాను: చెప్పులవైపు నడుస్తూ అన్నాడు. ఆమె పరిస్థితి పెనంమీద నుంచి పొయ్యిలో పడినట్టు అయింది. "ఆమె  ఫోన్  నెంబర్ ఇస్తాను కావాలంటే" అంది.

    అతడు ఆగాడు. అతడి మొహంలో వెయ్యి క్యాండిల్స్ బల్భు వెలిగినట్టయింది.

    "40009"

    చెప్పేసింది - అతడు అతికష్టంమీద అప్పటికప్పుడు ఫోన్  దగ్గరకి పరుగెత్తుకు వెళ్ళకుండా వుండటం కోసం మర్యాదకి కంట్రోల్ చేసుకుంటున్నాడని తెలుస్తోంది.

    "వెళ్లొస్తాను" గుమ్మం దగ్గరకి వెనుదిరిగి, "ఒకవేళ మీకు కావాల్సింది. మా పత్రికలో వ్రాసే రచయిత్రి లక్ష్మి కాకపోతే మాత్రం నన్ను క్షమించాలి. ఆమె మీరిక వేధించకూడదు" అంది.

    ప్రహసిత్ మొహం ఎర్రబడింది. "ఏమనుకుంటున్నారు నా గురించి" అన్నాడు. ఆమె నవ్వి "సారీ" అని అక్కణ్ణుంచి కదిలింది. వెళ్తూ. అనుకుంది.

    "....ఇతడు ఫోన్ చేసేలోపులోనే లక్ష్మికి ఫోన్ చేయాలి. లేకపోతే విషయం అర్థంకాక బెదిరిపోతుంది. ఆంధ్రదేశంలో ప్రతీ మూడో అమ్మాయి పేరూ 'లక్ష్మి' అవటం అదృష్టానికే వచ్చింది. అతడు  ప్రేమించిందీ.....మా పత్రికలో వ్రాసేదీ.... నా స్నేహితురాలూ ఫోన్ నెంబర్ ఇవ్వొచ్చునన్న ఆలోచన రావటం కూడా మంచిదయింది. ఈపాటికే ప్రహసిత్ నేనిచ్చిన నెంబర్ కి చేసుంటే లక్ష్మి ఎలా మాట్లాడుతుంది? కోపంగా తిట్టి పెట్టేస్తుందా? ఇలా రకరకాల ఆలోచనలతో ఆమె టెలిఫోన్ బూత్ వైపు నడిచింది.

    ఆంధ్రదేశంలో కొన్ని లక్షలమంది లక్ష్మీలుండవచ్చు. కానీ తన స్నేహితురాలే ఆ రచయిత్రి అనీ, పొరపాటున ఇచ్చినా..... అసలు నెంబరే ఇచ్చి..... ప్రహసిత్ కి సంబంధించేంతవరకూ ఎవరూ  చేయనంత సాయం  తాను చేసిందని ఆమె తెలీదు. అలా ఇవ్వటం  ద్వారా  నలుగురి జీవితాలు అనూహ్యమైన మలుపు తిరుగుతాయని ఆమె ఆ క్షణం వూహించలేదు.

    ఆమె టెలిఫోన్ బూత్ నుంచి చేస్తే అటు విష్ణు ఫోన్ ఎత్తాడు.

    "నేనూ మధూహని మాట్లాడుతున్నాను" అంది.

    "హాయ్. హౌ ఆర్యూ" అన్నాడు.

    "ఫైన్. లక్ష్మి వుందా?"

    "లేదు. ఏమిటి విశేషాలు. అసలు కనపడడంలేదేమిటి?"

    ఇతడికి ఇది అలవాటు. ఆడవాళ్ళు కనపడితే వదలడు. లా అని అసభ్యంగా ప్రవర్తించడు. ఏదోలా సంభాషణ పొడిగిస్తాడు. పొగుడుతాడు.  జోకులు వేస్తాడు. భోజనానికి రమ్మంటాడు. భార్యముందే చనువుగా వుండటానికి ప్రయత్నిస్తాడు. అదంతా చాలా సాధారణమైనట్టు తన స్వభావమైనట్టు ముసుగువేస్తాడు. వాళ్ళింటికి తను తరచు వెళ్ళకపోవడానికి అదో కారణం. లక్ష్మికి అర్థంకాదా విషయం. భర్తంటే వల్లమాలిన ప్రేమవున్నట్లు మాట్లాడుతుంది. పల్లెత్తు మాట అననీయదు. ఏమో, తనే కరెక్టేమో. వాళ్ళది నిజంగా మంచి దాంపత్యమేనేమో. తనే అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తుందేమో. అతడు భార్యని అపురూపంగా ఎక్కువ ఆలోచిస్తుందేమో. అతడు భార్యని అపురూపంగా చూసుకుంటూ వుండి వుండొచ్చు.

    "నీలో నాకు నచ్చే గుణం అదే" అట్నుంచి విష్ణు అన్నాడు.

    "ఏది?"

    "మాట్లాడుతూ ఆలోచనల్లోకి వెళ్ళిపోతావు. ఎంతో డెప్త్ వున్నవాళ్ళే అలా ప్రవర్తిస్తారట."

    ఇతడిలో ఇదొకటి. తనకి చాలా తెలివితేటలున్నాయని అనుక్షణం అన్యాపదేశంగా అవతలివాళ్ళు గుర్తించేలా ప్రవర్తిస్తూ వుంటాడు. మాటల్లో కూడా కనపడుతూ వుంటుంది.

    "అదిగో మళ్ళీ ఆలోచన్లు.....ఎవరి గురించి ఆలోచిస్తున్నావ్? బోయ్ ఫ్రెండ్  గురించా?" నవ్వేడు.

    "లక్ష్మీ వుందా?" కాస్త సీరియస్ గా అడిగింది.

    అతడు గుర్తించినట్టున్నాడు. "లేదని చెప్పాగా" అన్నాడు.

    "ఎక్కడికెళ్ళింది?"

    "విశాల్ క్లినిక్ కి"

    మధూహ భృకుటి ముడిపడింది. వి.....శా.....ల్..... క్లినిక్.

    "తనకీ మధ్య ఈ పిల్లల పిచ్చి ఎక్కువైంది. బాబాలకీ గుళ్ళకీ తిరుగుతోంది. ఇదిగో ఇప్పుడు ఈ క్లినిక్ కి. నేను చెపుతూనే వున్నాను. ఇప్పుడు వయసేం మించిపోయింది చెప్పు? ఏదైనా చేస్తే నేను చేయాలితప్ప ఈ క్లినిక్ లేం చేస్తాయంటే వినదు" జోకాడు.

    "ఎంతసేపయింది వెళ్ళి?"

    "పది నిమిశాలైంది" అంటూ అతడేదో ఇంకా మాట్లాడబోతూంటే ఫోన్  పెట్టేసింది.

    ప్రహసిత్ కూడా ఆమెకోసం ఫోన్ లో ప్రయత్నిస్తూ వుండి వుంటాడు. లక్ష్మిని వెళ్ళి కలుసుకుని చెప్పాలి. ప్రహసిత్ ఫోన్ విష్ణు రిసీవ్ చేసుకుంటే అనవసరమైన అనుమానాలు రావచ్చు. అనవసరంగా తను ఆ నెంబరిచ్చింది.

    ఆమె విశాల్ క్లినిక్ కి వెళ్ళడానికి నిశ్చయించుకుంది. పబ్లిక్ బూత్ కి డబ్బు ఇచ్చేసి అక్కడికి బయల్దేరింది.

    అదే మొదటిసారి అక్కడికి వెళ్ళడం. ఇంతకుముందు ఆ క్లినిక్ వేరేచోట వుండేది. దాన్ని 'హిప్నోమైండ్ మాగ్నో క్లినిక్' గా మార్చి ఈ సంతానోత్పత్తి కేంద్రాన్ని వేరే చోటికి షిప్టు చేశాడు.

    అక్కడికి వెళ్లింది మధూహ.

    బయట క్లినిక్ ముందు చాలా స్కూటర్లున్నాయి. ఆమె లోపలికెళ్ళింది.

    ఆమెకి చాలా ఆశ్చర్యం కలిగింది.

    అక్కడ అన్ని జంటల్ని చూడడం. ఒంటరి స్త్రీలు కూడా చాలామంది వున్నారు. గదిలో నాలుగువైపులా బల్లలున్నాయి. ముందు వరండాలో కూడా బల్లలున్నాయి. అంతా జనమే. కిటకిటలాడుతున్నారు. పిల్లలులేని జీవితం జీవితమే కాదన్న నిర్లిప్తత, అందోళన, టెన్షన్ అందరి మొహాల్లోనూ కనపడుతున్నాయి. మగవాళ్ళు గంభీరంగా తన లోపం ఏదీ లేదన్నట్టు స్టయిల్ గా వుండడానికి ప్రయత్నిస్తున్నారు. దేశంలో జనాభా సమస్య ఇంత తీవ్రంగా ఎందుకుందో అర్థం అయిందామెకు. 'మాతృత్వంలోనే వున్నది ఆడజన్మ సార్థకం' అన్నపాటని చీల్చి చెండాడిన ఒక రచయిత ఆర్గ్యుమెంటు గుర్తొచ్చింది. పిల్లలు పుట్టకపోతే, ఎటువంటి పరిస్థితుల్లోనూ అది సాధ్యంకాకపోతే - స్త్రీ ఎం చెయ్యాలో చెప్పాలో తప్ప  నీ జీవితానికిక సార్థకత లేదు అని నిర్ణయం  చేసెయ్యటమేమిటి? పిల్లలంటే బావిలో నీళ్ళా? చేదవేసి తోడుకోవడానికి? స్త్రీని డిప్రెషన్ కి లోనుచేసే ఇలాటి పాటల్ని నిజంగానే 'బాన్' చెయ్యాలి.

    ఆమె ఆలోచన్లలో వుండగానే  కన్సల్టేషన్ రూమ్ లోంచి లక్ష్మి బయటికి వచ్చింది. మధూహని చూసి ఆమె మొహం విప్పారింది. "ఏమిటిలా వచ్చావ్?" రాజు కోసమా?" అనిఅడిగింది సంతోషంగా.

    "కాదులే. రాజు ఇక్కడుండడుగా. నీ కోసమే" అంది మధూహ.

    "నా కోసమా. భలే..... అబద్ధాలు చెప్పకు. ఆడపిల్లలు పుడతారు" నవ్వింది లక్ష్మి.

    "పెళ్ళికాకముందయితే కష్టమే" మధూహ కూడా నవ్వుతూ అంది. "ఏమంటున్నారో క్లినిక్ లో....." అని అడిగింది.

    "90 శాతం ఛాన్సులున్నాయట"

    "కంగ్రాచ్యులేషన్స్" అంది మధూహ. "పరీక్షలన్నీ చేశారా"

    "లేదే"

    మధూహ అదిరిపడింది. "పరీక్షలేమీ చేయకుండా 90 శాతం ఛాన్సుంది అని ఎలా  చెప్పారు?" ఇద్దరూ ఇంటివైపు వెళ్తూండగా లక్ష్మి చెప్పింది. "మనసులో కలతలు, టెన్షన్లు మొదలైనవి వుంటే పెర్టిలైజేషన్ మీద కూడా దాని ప్రభావం వుంటుందట."

    "మనసుకీ కడుపుకీ ఏమిటి సంబంధం?" విస్తుపోతూ అడిగింది.

    "ఏమో. నాకైతే నిజమేననిపిస్తోంది."

    "నీకేమిటి వర్రీ?"

    "పిల్లలు కలగకపోవడం. డాక్టరుగారు కూడా అదే చెప్పారు"

    "ఏమని? పిల్లలు పుట్టటం లేదన్న వర్రీ వుండడంవలన నీకు పిల్లలు పుట్టటం లేదనా?"

    అందులో వెటకారం లక్ష్మి గుర్తించలేదు. "పోనీలేవే. దేవుడి దయవల్ల ఇక్కడయినా ఫలితం కనపడితే చాలు" అంది భక్తిగా.

    "ఫీజు ఎంత తీసుకున్నారు?"

    "వంద రూపాయలు"

    బయట కూర్చున్న జంటలు కనిపించారు. "మనసులో ఏ  ఆలోచనా లేకుండా పడుకోండి. పిల్లలు పుడతారు..... అని చెప్పడానికి వంద రూపాయలు తీసుకున్నారా?" అంది కసిగా.

    "పోనీలేవే. ఇంత ఖర్చుపెడుతున్నాం. 'ఏ పుట్టలో ఏ పాముందో. ఆర్నెల్లు తిరిగేసరికల్లా మూడోనెల అని స్వీట్లు పంచిపెడతారు మీరు' అని గ్యారంటీ ఇచ్చారు డాక్టరు గారు. టెస్టులకి వచ్చేనెల రమ్మన్నారు."

    "ఇలాటివి విష్ణుకి ఇష్టం వుండవుగా"

    "అదే నేనూ చెప్పాను. ముందు నన్నొక్కదాన్నే రమ్మన్నారు"

    ఇక లాభంలేదన్నట్టు మధూహ చెప్పడం ప్రారంభించింది. "చూడు లక్ష్మి, ఒక దంపతులకి పిల్లలు పుట్టాకపోవడానికి సగం మగవాడు, సగం స్త్రీ  కారణమవుతారు. భర్తని పరీక్షించకుండా నిన్నోక్కదాన్నే పరీక్ష చేసి ఏం చెపుతారు?"

    "నీకు పెళ్ళికాలేదుగా. నీకేం తెలుసు?"

    మధూహ మొహం ఎర్రబడింది. "ఇది తెలియటానికి ఆరోక్లాసు చదువు చాలు" అంది. "ఇంకో విషయం  తెలుసా? నేను ఒక ప్రముఖ  సైన్స్ మ్యాగజైన్ లో చదివాను. నిస్సంతు దంపతులకు ఎన్ని ట్రీ ట్ మెంట్స్ ఇచ్చినా కేవలం45 శాతం మాత్రమె గర్భం వచ్చే అవకాశం వుంది. నువ్వనట్టు 90 శాతం కాదు"

    "పోనీలే. ఆ నలభైఐదులో మేమూ ఉన్నామనుకో...."

    "కానీ ఆ డాక్టర్ అలా అబద్ధం చెప్పకూడదుకదా."

    "నన్ను సంతోషపెట్టడానికి చెప్పి వుండొచ్చుగా.

    "ఆ డాక్టరేమీ జనోద్ధరణకి కంకణం కట్టుకున్న ప్రవక్త కాదు. మాటల్తోను, సలహాల్తోను, సమాదానాల్తోనూ సంతోషపెట్టడానికి. డాక్టరన్నాక ఫాక్ట్స్ చెప్పాలి. కడుపు గురించి అడిగితే మనసు గురించి చెప్పకూడదు."

    లక్ష్మి నవ్వింది. "నీకు తెలియని డాక్టరు మీద నీకెందుకు అంత కోపం.....

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra