"చాలా చెడ్డమనిషి. కానీ ఏం చేస్తాను.ఎన్నో ఏళ్లుగా ఇక్కడ స్థిరపడిపోయాను. ఆయనగారు చేసే పనులకి కోపం వచ్చినా నోరు మూసుకుని సహిస్తూ ఉంటాం. గొప్పోళ్ళ గురించి మాట్లాడిత్ నల్లిని నలిపేసినట్లు నలిపేస్తారమ్మా. అందులో జి.కె. గురించి చెప్పనంవసరం లేదు. నాగమణి జి.కె. గురించి పూర్తిగా తెలుసుకోడానికి నిశ్చయించుకుంది.అది పనివాళ్ళ దగ్గరే వీలవుతుందని తనకి తెలుసు.
మంచం దిగబోయింది.
ఒళ్ళంతా కాలిన చోట్ల ఆయింట్ మెంట్ వేసింది .అయినా అంతగా ఊరట కలిగించడం లేదు. గెడ్డంక్రింద, తొడలు, పొట్ట చురుచుర లాడుతున్నాయి .ఆమె భారంగా నిట్టూర్చింది.
ఇలాంటి భర్త వున్నా, చచ్చినా ఒకటే!
అతను చచ్చిన రోజునుంచే తను బ్రతకటం ప్రారంభిస్తుదేమో!
నాగమణి మంచం దిగి బాత్రూంలోకి నడిచింది. మల్లన్న కాఫీ కప్పు తీసుకుని వెళ్ళిపోయాడు.
* **
"మిష్టర్ నరేంద్రా!"
కణతలు నొక్కుకుంటూ పిలిచాడు జి.కె.
"సర్"
"కూర్చో"
అదిరిపడ్డాడు. నరేంద్ర .ఆయన ఎదురుగా తను కూర్చోడం ఏమిటి?
" పర్లేదు కూర్చో" అన్నాడు.
నరేంద్ర చేతిలోని ఫైలు మూసి ఆయన ఎదురుగా వినయంగా కూర్చున్నాడు.
"చెప్పండి సర్" అన్నాడు.
జి.కె. సిగరెట్ వెలిగించి లేచి నించున్నాడు.
గదిలో పచార్లు మొదలు పెట్టాడు.
" నీకో ఇంట్రస్టింగ్ అప్పగించాలనుకొంటున్నాను" అన్నాడు ఉపోద్ఘాతంగా.
"చెప్పండి సర్" ఉత్సాహంతో అడిగాడు నరేంద్ర.
" నాకు కావలసిన సమాచారం నీవు సేకరించగలగితే నీకు పదివేలు బహుమతిగా ఇస్తాను."
నరేంద్రకి గర్వంగా వుంది.తనమీద ఎంత నమ్మకం లేకపోతో తనకి ముఖ్యమైన పని అప్పగించబోతున్నాడు!?
" నువ్వు రెగ్యూలర్ గా నీ పనులు నీవు చేసుకుపోతూనే నాకు కావలిసిన ఇన్ఫర్ మేషన్ సంపాదించాలి?"
"తప్పకుండా సర్."
" చేయగలననే నమ్మకం వుందా?"
" మీరు చెబితే సముద్రంలో దూకేస్తాను సర్"
"గుడ్. నాకా సంగతి తెలుసు. అందుకే ఈపని నీకప్పగించాలనుకొన్నాను."
ఒక్క పెళ్ళి విషయంలో తప్ప మిగిలిన అన్నింటిలో ఆయన తనకి నచ్చుతాడు.
అదో పద్దతి. కానీ తననో అంతరంగిక వ్యక్తిగా జి.కె. పిరిగణించటం అతనికి చాలా సంతోషాన్ని కలిగించింది.
" నా భార్య నాగమణి గురించి నువ్వు భోగట్టా సంపాదించాలి!"
జి.కె. మాటలకి అదిరిపడ్డాడు నరేంద్ర.
"సార్" అన్నాడు అయోమయంగా.
"భయపడాల్సిన అవసరం లేదు నరేంద్ర ! ఇది స్వయంగా నేను నీకు అప్పగిస్తున్న పని."
"అంటే నేనేం చేయాలి?"
" నా భార్యకి పెళ్ళికాకముందు ఎవడైనా ప్రియుడున్నాడా! వుంటే ఆ ప్రేమ ఎన్నళ్ళు కొనసాగింది? ఎంతవరకు వెళ్లింది? అతనెవరు?"


