Home » D kameshwari » Bhava Bandhalu


                         బతుకున బతుకై ....
    ఈరోజు మురళి కి జీవితం మీద విరక్తి కలిగేంత కోపం వచ్చింది.
    ఎవరి మీద?
    ఏరి కోరి కట్టుకున్న పెళ్ళాం మీద!
    బాగా అయింది శాస్తి. ఛీ, ఏం బతుకు! అలిసి సోలిసి ఇంటికి వచ్చిన భర్తకు ఓ కప్పు కాఫీ అడిగే అర్హత లేదా?
    ఎప్పుడూ తనే కలుపుకుని తాగుతాడు.
    కాని ఇవాళ ఇంటి కొచ్చేసరికి డ్రాయింగ్ రూం లో లాప్ టాప్ చూస్తూ కూర్చున్న మాధురిని చూసి, వర్క్ ఫ్రం హోమ్, డ్యూటీ అయిపోయిందనుకుని. "తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ కలిపి ఇస్తావా?' అన్నాడు.
    అంతే! కళ్ళు పెద్దవి చేసి "ష్" అని గద్దిస్తున్నట్టు చూసి , నోటి మీద వేలు పెట్టి మరోసారి "ఉష్ అంది.
    తనకేం తెలుసు! రోజూ తన రూం లో టేబుల్ మీద లాప్ టాప్ పెట్టుకుని వర్క్ చేసి మధురి ఇవాళ డ్రాయింగ్ రూమ్ లో కూర్చుంటే, పని అయిపోయిందని అడిగాడు.
    అంత మాత్రానికే ఇలా.......
    సోఫా లోంచి లేచి చివ్వున బెడ్రూం లోకి వెళ్లి బట్టలయినా మార్చకుండా పక్క మీద వాలిపోయాడు. అప్రయత్నంగా అతని కంట నీరు చిమ్మింది. పావుగంట తర్వాత లేచి వంటింట్లోకి వెళ్లి కాఫీ పెర్క లెటర్ లో నీళ్లు, పొడి వేసి, బట్టలు మార్చుకుని, మాత్ర వేసుకుని కాఫీ తాగుతుండగా మధురి విసురుగా లోపలికి వచ్చి, "ఏం, రోజూ నువ్వే కలుపుకుని తాగుతావు కదా, ఇవాళ పెళ్ళాం కలిపి ఇవ్వాలా "కాఫీ" వేటకరిస్తూ ఎగిరింది.
    "ఎవడికి తెలుసు...డ్రాయింగ్ రూమ్ లో కూర్చుంటే పనై పోయిందనుకుని అడిగాను. పని ఉంటె అక్కడెందుకు కూర్చున్నావ్ మరి?" మురళి అంతకంటే గట్టిగా అరిచాడు.
    "పని అయిపోయి, బయటికి వచ్చేసరికి బాస్ ఏదో మర్చిపోయి మళ్లీ పిలిచాడు. అందుకు ఇక్కడే కూర్చున్నా. అయినా రోజూ నువ్వే కలుపు కుంటావు. ఇవాళ నన్నెందుకు అడిగావు?" రెట్టించింది మాధురి.
    "రోగం వచ్చింది. బుద్ది లేక అడిగా..... క్షమించు" కప్పు టేబుల్ మీద పెట్టి అటు తిరిగి పడుకున్నాడు. తెలియకుండానే మరోసారి అతని కళ్ళు నిండాయి.
    'ఛా...ఏం బతుకు? ఎందుకీ సంపాదన? ఎందుకీ లక్షలు? ఎవరి కోసం? కప్పు కాఫీ అయినా పోసే వాళ్ళు లేని ఈ కొంప లో ...' తన మీద తనకే విరక్తి కలిగింది మురళికి.
    
                                    *    *    *
    పెళ్ళయిన కొత్త మోజులో రెండు మూడు నెలల పాటు తనే కాఫీ చేసి మధురి కీ ప్రేమగా అందించేవాడు. కమ్మగా వంట చేసి పెట్టేవాడు.
    ఆమె చనువు, తెలివి, తనకన్నా మంచి జాబ్, ఎక్కువ జీతం, స్మార్ట్ నెస్- అన్నీ చూసి వెంట పడ్డాడు. మూడు నెలల తర్వాత ప్రపోజల్ తేగానే "పెళ్ళా! నేనేం అనుకోలేదు" అంది అదోలా చూసి.
    "పోనీ, ఇప్పుడనుకో... " గోముగా చూస్తూ మధురి చెయ్యి పట్టుకున్నాడు. ఇబ్బందిగా చూసింది. 'ఆ' అనుకోడానికి వారం రోజులు. మరో రెండు సార్లు గుర్తు చేశాక 'ఊ' అంది. దానికే మురిసిపోయి , పొంగిపోయి , తబ్బిబ్బయి పోయి, సంతోషంగా "థాంక్స్ " అన్నాడు చెయ్యి పట్టి ఊపుతూ.
    "ఇదిగో అబ్బాయ్....నాకేం వంటా, గింటా రాదు. ముందే చెబుతున్నా తర్వాత చెప్పలేదనకు. నీవు వండి పెడితే తిని పెడతా. లేదంటే ఆర్డర్ ఇచ్చి ఏది తెచ్చి పెట్టినా సరే తింటాను . నో కంప్లైంట్స్ " నవ్వుతూ అంది.
    "ఆ ఫర్లేదులే. వంట ఏం పెద్ద సమస్య కాదులే" తేలిగ్గా అనేశాడు.
    పెళ్ళికి ముందు మాత్రం అమ్మాయిలు గుండిగలు వార్చి,  వంటలో తర్ఫీదు పొందుతారా? వాళ్ళూ పెద్ద చదువులు చదివి, ఉద్యోగాలు చేస్తున్నారు టైముండదూ. పెళ్ళిళ్ళయి యింటి బాధ్యత నెత్తిన బడితే , అవే వస్తాయి. తన చెల్లెలూ అంతేగా. రెండేళ్ళ లో పక్కా ఇల్లాలై అన్నీ నేర్చుకుంది' అని తేలిగ్గా అనుకున్నాడు.
    కాని, మాట మీద నిలబడ్డట్టు మాధురి వంటింట్లోకి వెళ్ళలేదు. పెళ్లై కాపురం మొదలు పెట్టిన ఈ ఏనార్ధం లో ఏదో బాధ్యత నెత్తిన బడితే.......అమ్మాయిలు అదే నేర్చుకుంటారన్న అతని ఊహ అపోహగానే మిగిలిపోతుందని అనుకోలేదు మురళి.
    కొత్త మోజు మురిపం తీరిన రెండు నెలల తర్వాత యింక లాభం లేదని ఆవిడ గారు ఏ పనీ చేయదనీ అన్నట్టే తిని కూర్చుంటుందని అర్ధం అయ్యాక ఓరోజు.....
    "పద, ఇవాళ నీకు వంట నేర్పిస్తా , ఇద్దరం ఆడుతూ పాడుతూ కలిసి చేద్దాం. ప్రయత్నిస్తే గా వచ్చేదీ లేనిది తెలిసేది! వంటింట్లో కి వేడితెనేగా పొయ్యేదో, పెనమేదో తెలిసేది. పద....పద....ఈరోజు అన్నం, పప్పు ఎలా చెయ్యాలో నేర్పుతా .." సరదాగా అంటూ వంటింట్లోకి చెయ్యి పట్టి లాగాడు.
    "అబ్బా....వంటా" అంది మధురి మొహం చిట్లించి , అదోలా పెట్టి.
    ఇన్నాళ్ళూ ముసుగు తన్ని లేవని మాదిరి, మురళి కాఫీ తెచ్చి లేపగానే "ఓ అప్పుడే ఎనిమిదైందా! బాస్ ఎనిమిదిన్నరకే వచ్చి కూర్చుంటాడు. ఐ మస్ట్ గెట్ రెడీ" అంటూ తెచ్చిన కాఫీ గబగబ తాగేసి, హడావిడిగా బాత్రూమ్ లోకి దూరి, అరగంట తయారై తన గదిలో లాప్ టాప్ తెరుస్తూ "నువ్వు బ్రేక్ ఫాస్ట్ తినేసి. నాకన్నీ టేబుల్ మీద వదిలేయ్. గిన్నెలు కడిగేస్తాలే" ఉదారంగా అనేది.
    కరోనా పుణ్యమా అని ఏడాదిగా వర్క్ ఫ్రం హోమ్ కాన్సెప్ట్ వచ్చి ఇళ్ళ నించే పని చేసుకోవడానికి అలవాటు పడిపోయారు జనం. కొన్నాళ్ళు మొదట్లో బాగుందనిపించినా, బయట ముఖం చూడక, బోర్ కొట్టింది. వంటి మీదా, డ్రెస్సుల మీదా శ్రద్ధ తగ్గి తిన్నగా పక్కల మీంచి లేచి కాస్త మొహం కడిగేసి, ఓ ఇస్త్రీ చొక్కా తగిలించుకుని, తల దువ్వేసి ప్రెజంటబుల్ గా తయారై ఎవరి గదుల్లో వారు లాప్ టాప్ ల ముందు కూర్చునేవారు.
    బ్రేక్ పీరియడ్లో అన్నం ఒకసారి, పప్పు మరోసారి పడేసి వచ్చేవాడు మురళి. ఏ ఆదివారమో చేసి పెట్టుకున్న కూరను ఫ్రిజ్ లోంచి పైకి తీసేవాడు. ఈ రొటీన్ కి అలవాటు పడిపోయిన వారు ఇప్పుడు కొన్ని ఆఫీసులు తెరవడంతో , బస్టాప్ కి పిల్లలని లేపి తయారు చేసి పంపడం, వాళ్ళు తయారై అందరికీ పరుగులు హడావిడి మొదలయ్యింది.
    అయితే, కొన్ని ఆఫీసులకు వర్క్ ఫ్రం హోమ్ కాన్సెప్టే బాగుంది. అద్దెలు, ఎలక్ట్రిసిటీ కాఫీల ఖర్చు లేసుకుని ఇంకా పోడిగిస్తున్నాయి.
    కాని మురళి కి ఆఫీసు, మాడురికి ఇంటి నుంచి వర్క్ మొదలైంది. మురళి ఆఫీసుకి వెళ్ళాల్సి రావడంతో అవస్థలు మొదలయ్యాయి.

                                      *    *    *
    మురళి ఆఫీసు కెళ్ళే ముందు కాఫీ ఎలా చేసుకోవాలో, ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో, రైస్ కుక్కర్లో ఎలా వండుకోవాలో, పప్పు కుక్కర్లో ఎన్ని నీళ్ళు పోసి వండాలో....బేసిక్ పాయింట్స్ అన్ని చేసి చూపిస్తూ వండాడు. చిన్నపిల్లలకి, వంటరాని మొగుళ్ళ కి పుట్టింటి కెళ్ళే ఇల్లాలు చెప్పినట్టు, చెప్పుకున్నంత సేపూ "ఏం ఖర్మ,' వచ్చింది మొగుళ్ళకి....ఆడమగ స్థానాలు తారుమారు అవడం , అమ్మాయిలు రాజ్యం వచ్చేసిందా, తనలాంటి వాళ్ళతో....ఈ తరంలోనే ఆరంభమయిందా' మధురి కళ్ళ ముందటే అనుకునేవాడు.
    అమ్మ ఆనాడే చెప్పింది. హాలీడే ట్రిప్ అంటూ మాధురిని తీసుకొచ్చి చూపించాడు అమ్మకి. చెప్పకుండానే అమ్మ గ్రహించింది తన ఉద్దేశం.
    తన ఇంజనీరింగ్ అయిపోయాక, ఎమ్మెస్ చేద్దామని అనుకుంటూన్నప్పుడే తండ్రి హార్ట్ ఎటాక్ వచ్చి పొతే సెటిల్ కాని తననూ, చెల్లలి బాధ్యతనూ తన చేతుల్లోకి తీసుకుని సమర్ధవంతంగా నిర్వహించింది తల్లి. తన టీచర్ ఉద్యోగం ప్లస్ నాన్న పెన్షన్ తో.
    చదువు పూర్తీ అయిన స్వప్న కి మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది. తనని అమెరికా పై చదువులకి పంపింది. అమ్మ దగ్గరున్న మూడు రోజుల్లో మధురి తెలివి, చదువు, స్మార్ట్ నెస్ తో పాటు తను గ్రహించని విషయాలు ఎవరూ చెప్పక్కర లేకుండానే గ్రహించింది ఆవిడ.
    మధురి బెంగుళూరు లో ఉంటున్న వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళింది. అవకాశం చూసి "అమ్మా, వచ్చిందా మధురి నీకు' అన్నాడు ఆరాటంగా తల్లి మొహం చూస్తూ.
    "నచ్చక పోవడానికి ఏముంది? చదువు, మంచి ఉద్యోగం, జీతం...నీవు కోరుకున్నవి అన్నీ ఉన్నాయి , ఆ అమ్మాయిలో , కానీ" అని ఆగిపోయింది.
    "చెప్పమ్మా , కానీ ఏమిటి , వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా చెప్పాను. ఒక్కతే కూతురు తండ్రి , తల్లి మంచి ఉద్యోగస్థులు , అయినింటి అమ్మాయి...."
    "అవన్నీ కాదురా. ఆ అమ్మాయికి ప్రపంచ జ్ఞానం కాస్త తక్కువనిపించింది. ప్రాపంచిక విషయాలు పట్టవు. తనన్నది జరిగిపోవడం తప్ప. ఎలా వచ్చింది, ఎక్కడ నుంచి వచ్చింది, ఎవరేమనుకుంటారు , కూర్చున్న చోటుకి తెచ్చి పెడితే ఆడేవారు ఎంత కష్టపడితే తను తినగలుగుతుంది అన్న ప్రాపంచిక విషయాలు ఆమెకు అక్కరలేదు. డబ్బున్న వాళ్ళు, అడిగిందల్లా యిచ్చే తల్లిదండ్రుల ముద్దు మురిపాల్లో పెరిగిన పిల్ల మరి. రేపు ఎంత చదివినా, ఎంత సంపాదించినా యిల్లు అన్నది నడపడం, తెలిసి ఉండాలి గదా! ప్రేమలు తిని , డబ్బుతో అన్నీ కొనుక్కుని తినేస్తూ బతుకుతారా? కాబోయే అత్తగారు వంటింట్లో ఇక్కడ చేస్తోంది అని మాట వరసకైనా , 'నేను హెల్ప్ చేయనా అంటీ'....ఇది చేయనా' అని ఇంప్రెస్ చేయడానికైనా అడగాలని తెలియదు మాధురికి. ఇద్దరి మధ్య గొడవలు రాకుండా సర్దుకుంటూ బతకడం సాధ్యమా అన్నది నీవు ఆలోచించుకో , నీకిష్టం అయితే నాకేం అభ్యంతరం ..." అనేసింది అన్నపూర్ణ. "నేర్చుకుంటుంది లే , మేనేజ్ చేసుకుంటాం. తను నేర్చుకునే వరకు నేనున్నాగా చూసుకుంటా " అనేశాడు నమ్మకంగా.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra