Home » D kameshwari » Bhava Bandhalu


    "ఏమిటి అరవింద్ గారు జన్మభూమి పధకాలు ఏవో అమలు చేస్తారని విన్నాను. ఊర్లో రైతులందరూ చెప్పుకుంటున్నారు."
    వీధి అరుగు మీద పాతకాలం పడక కుర్చీలో కూర్చుని వెంకట్ తో మాట్లాడుతుంటే ఆ వూరు ఎమ్మెల్యే సత్యనారాయణ గారు నవ్వుతూ పలకరించారు.
    "రండి, కూర్చోండి సార్ మీలాంటి పెద్దలు మా యిల్లు పావనం చేశారంటే.....' అరవింద్ నమస్కారం చేశాడు.
    "ఆ....ఊరంతా చెప్తున్నారు. మీరేదో రైతులకి గొప్ప సాయం చెయ్యడానికి నడుం కట్టారని మా పాలిట దేవత అని అమ్మగారికి దండాలు పెట్టేస్తున్నారు" కాస్త వ్యంగ్యం జోడించి హాస్యంగా అన్నాడు.
    "ఓ అప్పుడే మీదాకా వచ్చేసిందా కబురు. ఏం చేస్తాం సార్ తాతలనాటి నించి వూరి మీద వున్న అభిమానం, అనుబంధం, రైతుల కష్టాలు చూసి తోచిన సాయం చెయ్యాలని అమ్మ ఆలోచన. ప్రభుత్వాలు, చెయ్యాల్సిన పనులు చేస్తే ఆ ప్రశంసలు మీరే మూట కట్టుకోవచ్చు గదా" అరవింద్ కూడా చురక అంటించాడు నవ్వుతూనే.
    "మీకేం సార్ , మీ డబ్బు మీ యిష్టం వచ్చినట్టు చేసుకుంటారు. మేమేదన్నా చెయ్యాలంటే ఎన్ని రూల్స్, ఎన్ని లెక్కలు, యిటు ప్రజలు నిలబెట్టి మొహం మీదే దులిపెస్తున్నారు ఏం చేశావని, అటు ప్రభుత్వం లక్ష ప్రశ్నలు గ్రాంటు విడుదల చెయ్యడానికి ........ఎన్ని లెక్కలు అడుగుతారో..." ఎమ్మేల్వే నిష్టూరంగా అన్నాడు.
    "నిజమా మరిన్ని లెక్కలు శాంక్షన్లు , పర్మిషన్లు వున్నా యింత అవినీతి ఎందుకు జరుగుతుందో  " తెలీనట్టే అన్నాడు అరవింద్. మొహం మాడ్చుకున్నాడు ఎమ్మెల్యే గారు.
    "ఏదో మా కష్టాలు మావి, మా గడ్డి మేం తింటాం. పని చేయడానికి అదంతా వదిలేయండి సార్. ఇల్లెందుకు యివ్వడం సార్ ....మీరలా యివ్వదలచిన డబ్బు ఇచ్చేస్తే ఒక్క మాట అమ్మ గారి చేత చెప్పిస్తే చందాలెత్తి , ప్రభుత్వం నెత్తిన కూర్చుని, మిగతాది తెచ్చి గోదౌన్లు కట్టించేద్దాం సార్....అదంతా నే చూసుకుంటా మీకెందుకు శ్రమ,అమ్మగారలా అందరిని పిలిచి మాట్లాడితే చాలు" ఆశగా ఆరాటంగా అన్నాడు ఎమ్మెల్యే . వెంకట్ అరవింద్ మొహాలు చూసుకున్నారు.
    "సరేలెండి, అమ్మతో మాట్లాడి ఏసంగతి చెప్పులే"
    "ఒక్కసారు లోపలి కెళ్ళి అమ్మగారి దర్శనం చేసుకుంటా.....మేల్కొనే వున్నారా ....
    "ఆ, వెంకట్ తీసికెళ్ళు అమ్మ దగ్గిరికి" అన్నాడు అరవింద్.
    "రైతుల కోసం యింతకష్టపడి గోడౌన్ కట్టించాను. యీ వూరి బాగోగులు నావి కావా....అంటూ తనే అంతా చేసినట్టు చూపించు కుంటే ఎలక్షన్ వేళకి చెప్పుకోడానికి....మన దగ్గిర డబ్బులు వసూలు చేసి, వూర్లో వాళ్ళ దగ్గిర చందాలు పోగు చేసి, ఏదో ఎమ్మెల్యే ఫండ్ కింద కొంత లాగి ఏదో కట్టానని పించు కోడానికి యిదంతా" వెంకట్ అన్నాడు వేళాకోళం గా.
    "అంతేనా, ఏదో పోనీ మనం కష్ట పడకుండా పని అవుతే అనుకున్నా."
    "అరవింద్ , వద్దురా  బాబూ ....యిదంతా అయ్యేపని కాదు, అట్టహాసంగా ఆరంభించి, ఫోటోలు , వార్తలు, రాయించుకుని తరువాత పట్టించుకొర్రా, వాళ్ళ వెనకాల మనం తిరగలెం. పని ఆగిపోవచ్చు. లేక ఏదో ఆషామాషీగా చేసాం అనిపించుకోవచ్చు....మనకెందుకీ గోల అంతా."
    "ఈ యింటి మీద అయన కన్ను పడినట్టుంది. మంచి పాతకాలం గట్టి ఇల్లు టేకు దూలాలు తలుపులు , ఎవరికీ అమ్మడం ఎందుకు నేనే కొనేస్తా , ఆ డబ్బుతో గోడౌన్ కట్టించవచ్చు. మీరు మాట్లాడండి పంతులు గారు అని హెడ్మాస్టర్ గారితో అన్నాడట" వెంకట్ అన్నపూర్ణమ్మ తో అన్నాడు.
    "నాకు తెలుసు ....ఏది జరగనివ్వరు. అరవింద్ మనం ఎవరితో పెట్టుకోవద్దు. నీవుండగా యీ యిల్లు ణా తదనంతరం నీకు చెందేట్టు .....అది యీ వూరి రైతులందరికీ ఉపయోగపడెట్టు వాడుకోడానికి యిచ్చినట్టు పత్రాలు రాయించి రిజిష్టరు చేయించు" అన్నపూర్ణమ్మ దృడంగా అంది.
    "మళ్ళీ నా పేరెందుకు , రైతుల పేరే యిచ్చేద్దాం. వాళ్ళే చూసుకుంటారు'
    "వద్దు, వద్దు , అలా చేస్తే నేపోగానే వాళ్లకి డబ్బాశ చూపి తలో పదో పదిహేనో వేలు పడేసి యిల్లు లాగేయోచ్చు ఎవరన్నా. నీ పేర వుంటే ఏం చెయ్యలేరు. పదికాలాల పాటు రైతులకి ఉపయోగపడాలని నా ఆలోచన.
    తల్లి అన్ని విషయాలు ఎంత అనుభవంతో , ముందాలోచన తో చూస్తుందో చూసి ఆశ్చర్య పడ్డాడు అరవింద్, ఆవిడ మాటా నిజమే.
    "వెంకట్ .....యీ పనులన్నీ వాడు వెళ్ళేలోగా సంతకాలు పెట్టించి రిజిష్టర్ చేయించే బాధ్యత నీదే. రైతులందరి తో మాట్లాడి, అందరి పేర్లు రిజిష్టర్లో ఎక్కించి, ఎవరి పంటకి వాళ్లకి నంబర్లిచ్చి , గదులలో దాచుకుని, నమ్మకమైన పెద్ద మనుషులిద్దరు ముగ్గురు ,నీవు కమిటీ వేసుకోండి. వెనక పాలేరుండే గదిలో ఒక కుటుంబం రాత్రి పగలు కాపలా వుండేట్టు ఆ ఏర్పాట్లన్నీ చూడాలి. ముందు రిజిష్టర్ పని చూడు....
    తల్లి కార్యదక్షత కి విస్తుపోతూ "అమ్మా యీ వూరికి నీవు సర్పంచివయితే బాగుందేమో." నాకెందుకు రా అవన్నీ, ఏదో దేముడి దయ వల్ల భగవంతుడిచ్చిన దానితో యీ వూరి వాళ్లకి  కాస్త మేలు జరిగితే చాలు అంది తృప్తిగా.
    
                                   *    *    *
    "ఏమిటమ్మా , యీ సామాన్లన్నీ యిప్పుడు పంచి పెట్టడం ఏమిటమ్మా , నీ తరువాత మేం ఎలాగూ అమెరికా తీసికెళ్ళ లెం. యిక్కడే అందరికీ పంచుతాం నీవుండగానే యిచ్చేయమంటావేమిటి' కూతురు అరుణ తల్లిని మందలించింది.
    "నీకు తెలీదమ్మా అరుణా. గదులన్నీ ఖాళీ చెయ్యాలి గదా, అటకల నిండా బోలెడు యిత్తడి సామాను , యీ మంచాలు, బీరువాలు, బల్లలు, కుర్చీలు యివన్నీ నేనేం చేసుకుంటా....నా రోజులు దగ్గిర పడ్డాయని నాకు తెలుస్తుంది. నేనుండగానే నా చేతులతో ఎవరికేం యివ్వాలో యివ్వనీ, మీకేం తెలుస్తుంది యిదంతా. నేపోయాక మీకెక్కడ టైముంటుంది యివన్నీ సర్దడానికి. నాకు ప్రస్తుతం కావలసినవి వుంచి, మిగతావి యిచ్చేద్దాం. వెంకట్, నరేష్ ని కావల్సినవి తీసుకో మనండి. అటక మీద పెద్ద యిత్తడి సామాను గుడికి అప్పచెపితే వూరంతా కావల్సినపుడు తీసుకునే ఏర్పాటు చేద్దాం. బీరువాలు, బల్లలు, కుర్చీలు లాంటివి స్కూలు కి , పంచాయితీ ఆఫీసు కి యివ్వండి. రైతులకి , మన కూలీలకి మామూలు వంట సామాను, చిన్న చితకా సామాను, పరుపులు, అందరికి పంచి యిద్దాం. నాపట్టు జరీ చీరలు నీవు, వదిన, వెంకట్, నరేష్ వదినలు ఎవరికి కావల్సినవి వారు తీసుకుని మిగతావి పూజారి భార్య, స్కూలు మాస్టర్ల భార్యలు, పొలంలో ఆడవాళ్ళ కి బట్టలు పంచండి. ణా దేముడిని నా తదనంతరం గుడికి అప్పజెప్పండి. అప్పగింతలు పెడుతూ అన్నీ వివరించింది అన్నపూర్ణమ్మ కూతురిని కొడుకుని కూర్చోపెట్టుకుని.
    "ఏమిటమ్మా, యీ సామాను తీసినకొద్దీ వస్తున్నాయి పాతరులా' అలిసిపోతూ అన్నాడు అరవింద్. "మరి నూరేళ్ళ సంసారం సామాన్లు తరాలు వాడుకునే వారు ఇదివరకు. యిప్పటిలా పిల్లలంతా తలో చోటికి పోకుండా అంతా కలిసి వుండేవారు. మీ తాతల దగ్గర నించి పడి వున్నాయి. గుండిగలు, గంగాళా లు ఇత్తడి పాత్రలు వూరంతా పెళ్ళిళ్ళ కి ఇక్కడి నించే పట్టు కెళ్ళేవారు. ఒక్కో సంతానం పెరుగుతుంటే గదులు పెరిగాయి. సామాను పెరిగింది మరి. ఇంకా మరుదులు, ఆడపడుచులు కొన్ని పట్టుకెళ్లారు. యిప్పుడింక అమెరికా వచ్చాక ఎవరికి కావాలి యివి. అందుకే ఎవరికన్నా యిస్తే సంతోషంగా వాడుకుంటారు.
    "అన్నయ్యా, యీ మంచాలు, సోఫాలు , బీరువాలు టేకు కర్రవి. యింకా పాలిష్ మెరుస్తుంది. అమెరికా కాపోతే తీసుకునే వాళ్ళం. ఈ రవి వర్మ పెయింటింగు లు కొన్ని పాత వాటికి పాలిషింగ్ చేయించితే మనం తీసుకుందాం అలాంటి నాణ్యత....యిప్పుడు లేనేలేవు అంది అరుణ.
    పదిమంది పనివాళ్ళు అరవింద్, అరుణ, వెంకట్, పర్వవేక్షణ లో కుర్చీ వేసుకు కూర్చుని ఎవరికేది పంపాలో పంపేసరికి సాయంత్రం అయింది. ఊరంతా వచ్చి తమకి కావల్సినవి పట్టుకు పోతోంటే అన్నపూర్ణమ్మ కి తృప్తి అనిపించి సంతోషపడింది.

                                    *    *    *
    రోజంతా పనిచేసిన అందరూ అలిసిపోయి ఆ రాత్రి గాడ నిద్ర పోయారు. అన్నపూర్ణమ్మ మాత్రం దీర్ఘ నిద్రలోకి వెళ్ళింది తెల్లవారుజామున.
    "మనం మళ్ళీ రావడం యిబ్బందని , తన పనులన్నీ చక్క బెట్టుకుని తృప్తిగా నిశ్చింతగా దాటిపోయింది అమ్మ" అరుణ కన్నీళ్ళు పెట్టుకుంటూ అంది. అరవింద్ తలాడించాడు విషాదంగా.
    "మా పెద్దమ్మ, మా అన్నపూర్ణ తల్లి చల్లని తల్లి వెళ్ళిపోయింది. ఊరికి పెద్ద దిక్కు పోయింది. ముందే పోకడ తెల్సినట్టు, వున్నదంతా అందరికీ పంచిపెట్టి పోయింది మహాతల్లి" ఊరంతా కదిలి వచ్చి కన్నీరుతో సాగనంపారు ఆవిడని. పెద్దావిడ పెద్ద కర్మ రోజున ఊరంతా తరలివచ్చి భోజనం చేసి నివాళులర్పించారు. పంట కల్లం లో వుంది. తను పొతే గాని యిల్లు ఖాళీ అవదనుకుని వెళ్ళిపోయింది మహాతల్లి" రైతులందరూ కంటనీరు పెట్టారు.
    తాళాలు, కాగితాలు , రాతకోతలు, అప్పగింతలు, జాగ్రత్తలు చెప్పి, భాద్యత వెంకట్ కి అప్పచెప్పి బయలుదేరారు అరవింద్, అరుణ. అమెరికాలో ఎవరిల్లు వారు చేరేసరికి వెంకట్ నుంచి ఫోను." అరవింద్ నిన్న రాత్రి ఎంత పెద్ద వాన కురిసిందనుకున్నావు యిక్కడ."
    "అయ్యయ్యో మరి ధ్యాన్యాల బస్తాలు , పంట" ఆరాటంగా అన్నాడు. మొన్నే మీరటు వెళ్ళాక రైతులందరూ తమతమ పంట ఇంట్లోకి చేరేసి , గదులకి తాళం పెట్టారో లేదో అత్తయ్య పైనించి ఆనంద భాష్పాలు రాలుస్తున్నట్టు చినుకులతో మొదలై కుంభ వృష్టి కురిసింది. ఆవిడ దీవెనలు ఆనంద భాష్పాలు కురిసిందనుకున్న రైతుల మొహాల్లో సంతోషం చూడాలి. చల్లని తల్లి మా అన్నపూర్ణ . "అన్నపూర్ణా ధన్యాగారం' అని పెరు పెట్టుకున్నారు. అందరూ కలిసి ఉద్వేగంతో మాట తడబడ్తూ అన్నాడు వెంకట్.

                                   *    *    *

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra