అతన్ని చూడగానే అర్చన, ఆమెని చూడగానే నాగరాజు కూడా ముందు నిశ్చేష్టులయ్యారు.
    తేరుకున్న అర్చన మండిపడింది. అతన్ని చూడగానే ఒక్కసారిగా గతం కళ్ళముందు కదిలి ఎంతో ఆవేశపడిపోయింది. ఇంతకాలం అణచి ఉంచిన పగ, ప్రతీకారం ఉవ్వెత్తున ఎగిశాయి. లాగిపెట్టి ఆ చెంపా, ఈ చెంపా వాయించాలనిపించింది. కానీ, తన హోదా, అధికారం, తన పరువు ప్రతిష్ఠ ఆమెనా పని చేయనివ్వలేదు. అందుకే తనతో మాట్లాడటానికి వచ్చిన అతడిని మాట్లాడకుండానే అక్కడినుంచి పంపించేయాల్సిందిగా పి.ఏ.కి చెప్పింది.
    ఎవరో లేడీ ఆఫీసర్ ఉందని తెలుసుగాని, ఆ లేడీ అర్చన అనీ, తల్చుకుంటే తనపోగారు, రాజకీయ వేషాలు అన్నీ అడ్డంగా తోసేయగల అధికార హోదాలో ఉందని తెలియని నాగరాజు అర్చనని అలా చూడగానే నిశ్చేష్టుడయాడు. నోటినుంచి మాట రాలేదు. తానొక పార్టీ లీడరు అయినా ఆ క్షణంలో తనకి తాను ఆమెముందు నిలబడలేనివాడని అర్ధమైంది. అందుకే మౌనంగా వెళ్ళిపోయి మరో విధంగా ఆమెనుంచి తన కేసు విషయమై శరణు కోరాలని నిశ్చయించుకున్నాడు.
    అయితే అర్చన మాత్రం ఎవరితో ఏమీ చర్చించకుండా తహసీల్దారుతో చర్చిస్తూ ఒక అధికారిగా తను తీసుకోవాల్సిన చర్యలు తీసుకోసాగింది.
    తహసీల్దారు సహకారంతో తప్పుడు పనులు చేస్తున్న ఆ కుటుంబం మొత్తం ఆమె మీదకి తగాదాకి వచ్చింది. అది మాది, మా పూర్వీకులది అంటూ ఏవేవో కాగితాలు చూపించారు.
    ఆఖరికి అధికారి ఒక మహిళ కాబట్టి మరో మహిళే ఆవిడతో డీల్ చేస్తే బాగుంటుందని అంటూ తన భార్యని ఎగదోశాడు నాగరాజు.
    ఆమెకిలాంటి లావాదేవీలు చాలా సామాన్యం అన్నట్టు వచ్చి అర్చనకి ఒక లెదర్ బ్యాగ్ ఇచ్చింది.
    "ఏంటిది?" తీవ్రంగా అడిగింది అర్చన.
    "ఏదోలెండి మెడమ్ గారూ! మాకు తోచింది. మీ సహకారం కావాలి మాకు" అంటూ వెకిలిగా నవ్వుతున్న విజయడుర్గని అసహ్యంగా చూస్తూ అరిచింది అర్చన.
    "ఆడదానివై ఉండి ఇలాంటి పనులు చేయడానికి నీకు సిగ్గులేదూ! ప్రభుత్వ భూములంటే నీ ముత్తాతల సొంతం అనుకుంటున్నావా? అయినా ఒక గూండాకి, రౌడీకి పెళ్ళానివైన నీకు ఇంతకన్నా నీతి ఎక్కడుంటుంది? వెళ్ళు ముందు ఇక్కడినుంచి."
    "ఏమ్మో ఏదో ఆడదానివని ఊరుకుంటుంటే పెద్ద నీతిమంతురాలిగా మాట్లాడుతున్నావే! నీలాంటి వాళ్ళని చాలామందిని చూశాంలే. పట్ట్య ఈ కానుక తీసుకుని ఈ కేసు వదిలెయ్. ఎన్నేళ్ళు ఈ ఉద్యోగంలో కొట్టుకున్నా ఇంత డబ్బు రాదు ఇంద" అంటూ బ్యాగు అర్చనవైపు నిర్లక్ష్యంగా తోసింది.
    అర్చన ఆవేశంతో వణికిపోతూ "గెట్ అవుట్. ఒక్క క్షణం ఇక్కడ కనిపించావంటే నిన్నూ, నీ మొగుదినీ అరెస్టు చేయిస్తాను" అంటూ అరిచింది.
    ఆమె అరుపుకి బైటనుంచి శ్రీపతి, ఫ్యూను, మరో స్టెనో పరిగెత్తుకుని వచ్చారు.
    ఆవేశంతో నిలువెల్లా వణికిపోతున్న అర్చనని చూసి వాళ్ళకి మతిపోయింది.
    శ్రీపతి ముందుగా తేరుకుని విజయదుర్గని ఒక విధంగా బైటకి నెట్టినంత పని చేశాడు.
    అర్చనకి చల్లని కూల్ డ్రింక్ తెప్పించి ఇచ్చి ఆమెని మామూలు స్థితికి తీసుకురావడానికి చాలాసేపు పట్టింది వాళ్ళకి.
    ఆ తరువాత అర్చన ఈ విషయం కలెక్టర్ దాకా రాసింది. పూర్తి రిపోర్టు ఇస్తూ నా జ్యూరిస్ డిక్షన్ లో ఇలాంటి దారుణాలు జరగడం నేను భరించలేను. ఈ భూ ఆక్రమణ కేసులో పార్టీకి సహకరించి ఇల్లీగల్ యాక్టివిటీస్ ని ప్రోత్సహిస్తున్న తహసీల్దారు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ ల మీద చర్యలు తీసుకోవాలని సూచించింది.
    ఆమెకి కొన్ని సంవత్సరాలుగా నాగరాజు మీద రగులుతున్న పగ తీర్చుకునే అవకాశం వచ్చింది. అది వదలాలని లేదు. అఫీషియల్ గా అతని మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం వదులుకుందంటే జీవితాంతం ఒక ఓటమిని మౌనంగా భరించాలి అనిపించింది.
    చాలా బెదిరింపులు, ప్రయత్నాలు, గొడవలు తరువాత నాగరాజు మీద విజయం సాధించింది.
    అపజయం పాలైన విజయదుర్గ అర్చన ఇంటికి యుద్ధానికి వచ్చిందో రోజు.
    ఆమెని సూటిగా అడిగింది అర్చన. "నీకు నీ మొగుడు పెద్ద గూండా అనీ, నీలాంటి ఆడవాళ్ళ జీవితాలెన్నో నాశనం చేశాడని తెలుసా? అలాంటివాడితో కాపురం చేయడానికి సిగ్గు లేదూ? ఈ నగల కోసం. ఈ పట్టుచీరలు, పసుపుకుంకాల కోసం ఈ సమాజంలో గూండాలకి ఉన్నత స్థానం కల్పించడంలో నువ్వు కూడా కారణం అవుతున్నావని నీకు తెలుసా? అలాంటి మగాడికి పెళ్ళాంగా బతికేకన్నా నీకున్న ఆస్తితో ఒంటరిగా బతకలేవా?"
    విజయదుర్గా నవ్వింది. ఆమె నవ్వులో ఒక విధంయాన కసి కనిపించింది. అప్పటిదాకా అర్చన మీద అగ్నివర్షం కురిపించిన ఆమె మాటల్లో మృదుత్వం చోటుచేసుకుంది.
    "మేడమ్! ఈ సమాజంలో ఏ మగాడు నీతిమంతుడో మీరు చెప్పగలరా? భార్య కాక, మరో ఆడదానితో సంపర్కం లేని మగాడిని మీరు చూపించండి. నేను నా మొగుడ్ని వదిలేస్తాను.
    పిచ్చి మేడమ్! అందరు మగాళ్ళూ వెధవలే అయినప్పుడు ఆడవాళ్ళంతా పెళ్ళి వద్దు అనిగానీ, పెళ్ళయ్యాక వాడు వెధవని తెలిశాక విడాకులు తీసుకుంటాను అనిగాని అంటే ఇంకా ఈ సమాజంలో పెళ్ళిళ్ళు, కాపురాలు, పిల్లలు ఏమీ ఉండవు. మా ఆయన బైట పులి కావచ్చు. కానీ ఇంట్లో నా ముందు పిల్లి. వాడు బైట ఎంతమందితో తిరిగి వచ్చినా నేను కాపురం చేస్తున్నానని అనుకుంటున్నారా? చేస్తున్నా తప్పదు. చేయకపోతే వాడు మరో అమ్మాయిని చూసుకుంటాడు. నేను కాకపోతే నా స్థానం మరో ఆడది తీసుకుంటుంది. ఎందుకిస్తాను చెప్పండి.
    మీకో సంగతి చెప్పాలి. వాడికెలాగైతే నేను కాక వేరే సంబంధాలు ఉన్నాయో, నాకూ అలాగే ఉన్నాయి. వాడు చేసే చెడ్డపనులకి మద్దతు ఇస్తూ, నా సరదాలు నేనూ తీర్చుకుంటాను. మగాడికో నీతి, ఆడదానికో నీతి ఉండకూడదు కదా! ఎప్పుడైతే వాడి బుద్ధి తెలుసుకున్నానో అప్పుడే నేనీ నిర్ణయం తీసుకున్నా. లోకం దృష్టిలో వాడు నా మొగుడు. నా పిల్లలకి తండ్రి. తప్పదండి! ఇలాగే బతకాలి. బతక్కపోతే చావాలి. ఎందుకంటే నాలాంటి ఆడదాన్ని మొగుడు లేకుండా ఈ లోకం బతకనివ్వదు. మొగుడు చాటున ఏం చేసినా పట్టించుకోరు.
    లోకం వెర్రిబాగులదండి బాబూ! అందుకే నాకుండే సంబంధాలు, అనుబంధాలు నాకుంటాయి. కాబట్టి ఇదిగో ఈ మాంగల్యం కోసం వాడికి కట్టుబడి ఉన్నాను. మీరో రహస్యం తెలుసుకోవాలి" అర్చన దగ్గరగా వంగి రహస్యంగా అంది "ఈ సమాజంలో నూటికి అరవై శాతం ఆడవాళ్లు మొగుడి మీద ప్రేమతో కలిసి ఉండరు. అవసరం కోసం, వాడివలన కలిగే గౌరవం కోసమే కలిసి ఉంటారు. ఇది నిజం! నమ్మండి. నా మాట విని మీరు కూడా ఎవరో ఒకళ్ళని పెళ్ళాడండి. లేకపోతే ఎంత నీతిగా ఉన్నా అపనిందలు తప్పవు. అన్నట్టు మీకూ, మీ కలెక్టర్ కీ ఏదో ఉందట కదా! నలుగురూ అంటున్నారు లెండి. వస్తా!"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra