Home » Kandlakunta sarath chandra » అందరూ మేధావులే

   

పార్ట్ - 9

- కండ్లకుంట శరత్ చంద్ర

       వీడియోకాన్ టి.విలు .... ప్యాక్ చెయ్యండి ." సీరియస్ గా చెప్పాడు ఎవరెస్టు రెడ్డి.
    మేనేజర్ , సేల్స్ మెన్ మొహాలు చూసుకుని ..... "సెక్యూరిటీ ...." గట్టిగా అరిచారు.
    సెక్యూరిటీ గార్డు వేగంగా లోపలి పరుగెత్తుకొచ్చాడు.
    "వీణ్ణి .... బయటకి గెంటు."
    సెక్యూరిటీ అతని మెడ మీద చెయ్యివేసి .... బయటకి గెంటుతూ .... అతని మోహం చూసి .... వెయ్యి వోల్టుల కరెంటు వొ౦ట్లో పాసయినట్ట్లుగా .... షాక్
అయ్యాడు .
    "మీరు.... మీరు ... ఇక్కడ ... ఇలా ..." సెక్యూరిటీ గార్డు మాటలు తడబడ్డాయి .
        *    *    *    *
    కృష్ణ కిరణ్ .... సాయం కోసం చుట్టూ చూసాడు. ఎవరూ లేరు.
    అతనికి .... ఇరవై అడుగుల దూరంలో ... దెయ్యం ఉంది.  తలను నలభై అయిదు డిగ్రీలు వంచి,అతని వంక చూసింది.
    అతడు నీళ్ళు నమిలాడు.
    "నన్ను తప్పించుకుని .... ఎక్కడికీ పోలేవురా!" ఆ దెయ్యం గొంతు వికృతంగా వినిపించింది.
    ఆ దెయ్యపు  కళ్ళ తెల్లగుడ్లలో ...... రక్తపు చుక్కలు ....!!
    వొంపులు తిరిగివున్న తన గోళ్ళతో ... గాలిని సర్రున కోస్తోంది.
    "మర్యాదగా .... ఆగిపో. నిన్ను చిత్రవధ చెయ్యకుండా .... చంపేస్తాను. గొంతు కొరికి .... రక్తం తాగేస్తాను. నా దారిన నేను పోతాను. కాదూ ... కూడదు
అని.... నన్ను పరుగెత్తిస్తే ...... ఆ తర్వాత ... నీ కడుపు చీల్చి .... ప్రేగులు బయటకి లాగుతాను. గుండెను చీల్చి...... మెదడును పగులగొట్టి ..... హింసించి చంపుతాను."
గొంతులో భీకరమైన శబ్దం!!
    అతడు తనను తాను తిట్టుకున్నాడు. అనవసరంగా ..... భయంతో .... ఉరుకుతూ .... గెంతుతూ ..... హైదరాబాదు బార్డర్ లోనికి వచ్చాడు. గతరాత్రి
నుండీ.... మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ...... పరుగెత్తుతూనే ఉన్నారు. ఇక సత్తువ లేదు.! కానీ.... ఆగిపోలేడు. ప్రాణం కంటే తియ్యనైనది. ఈ ప్రపంచంలో ఏదీలేదు.
    దెయ్యం .... అతని వైపు అడుగులు వేస్తోంది.
        *    *    *    *
    ట్యాంక్ బండ్ దగ్గర జనం మూగారు. పోలీసుకానిస్టేబుల్ కూడా వారిలో ఉన్నాడు.
    తన ప్రేయసిని లాగి మరీ...... ఆమెతో సహా..... నార్లా రాజశేఖర్ నీళ్ళలో దూకగానే ..... ప్రేమికుడు పానిక్ అయ్యాడు.
    అయితే..... అంతలోనే ఆశ్చర్యపోయాడు.
    నార్ల రాజశేఖర్ .... ఆమెను పట్టుకునే ఈతకొడుతూ ..... ఒడ్డుకు వెళ్ళిపోతున్నాడు.
    ఆప్రేమికుడు , కానిస్టేబుల్ తో సహా...... ఆ సంఘటన పట్ల ఆసక్తి (?!) కలిగిన మరికొందరు              
    అతడు ఈదేవైపు పరుగెత్తారు.
    నార్లా రాజశేఖర్ వేగంగా ఈదుతూ ... ఆమెను ఒడ్డుకు చేర్చాడు.
    "ఛ ... ఛఛ ... పిచ్చినా కొడుకుని !" అన్నాడు తనలో తానె.
    ఆమె వణుకుతూ అతని మాటలు వింటోంది.
    "నాకు ఈత వచ్చననమాట . ఆ విషయం ..... నీళ్ళలో దూకాక గానీ ... అర్ధం కాలేదు నాకు."
    ఆమె అతని వంక .... చూస్తూనే గిజగిజ వణుకుతోంది.
    "ప్చ్! మెడలో పదికిలోల బండరాయి కట్టుకుని దూకితే బావుండేది. ఈ పాటికి హాపీగా .... సంయమని వెళ్ళే దారిలో ఉండేవాణ్ణి."
    సంయమని అనేది..... యమధర్మరాజు పట్టణం పేరని ఆమెకు తెలీదు.
    "ఇంకోసారి ఇలాంటిని బుద్ధి తక్కువ పని చెయ్యను. ఆత్మహత్య చేస్కోడానికి వేరేదారి వెతుకుతాను." అనేసి , ఆమెను పట్టించుకోకుండా గబగబా
వెళ్ళిపోయాడు.
    అతడు వెళ్ళిపోయిన అయిదునిమిషాలు తర్వాత ... అందరూ ఆమె దగ్గరికి వచ్చారు.
        *    *    *    *
    రామకృష్ణ ఫోన్  మోగింది.
    "హలో!" అన్నాడు రామకృష్ణ ఆదుర్దాగా .
    "నేనే.... తెలుగుబాషా ప్రేమికుణ్ణి.
    "చే... చెప్పండి."
    రామకృష్ణకు వచ్చే ఫోన్ కాల్స్ , పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. ఈసారి కిడ్నాపర్
    "ఏమిటి నేను చెప్పేది! నువ్వే చెప్పాలి. ఏమైంది? మీవాడిని ... తెలుగు మాధ్యమం ఉన్న పాఠశాలలో చేర్చే పని?"
    "టి.సి తీసుకుంటున్నాను. మీరు చెప్పినట్లే చేస్తాను.....  వాడినేం చెయ్యకండి."
    "ఏమీ చెయ్యను."
    "నాకో సందేహం."
    "..........."
    "నా కొడుకునే మీరు ఎందుకు కిడ్నాఫ్ చేసారు? ఏం..... కొన్నిలక్షల మంది పిల్లలు ఇంగ్లీషు మీడియం స్కూల్స్ లో చదువుతున్నారుగా?
    నిజానికి ఇది రామకృష్ణ డౌట్ కాదు. పోలీసుల డౌట్.
    "ప్రత్యేకమైన కారణం ఏం లేదు. మీ కుర్రాడు .....'ఇంటర్నేషనల్ లాగ్వేజ్  ... ఇంగ్లీషు ' అనే అంశం పై సంస్థవారు నిర్వహించిన వ్యాసరచనపోటీలో ప్రధమ
బహుమతి గెల్చుకున్నాడు కదా! దినపత్రికలో చదివాను. ఆంగ్లబాష ఎంత గొప్పదో...... వ్యాసం రాసాడట కదా! అందుకే అపహారించాను."
    "ఇది అన్యాయం ! మీరు ...." రామకృష్ణ ఏదో చెప్పబోతు౦డగానే ..... అవతల ఫోన్ కట్ అయ్యింది _ అరగంట తర్వాత ... ఆ ఫోన్ కాల్ .... ఓ పబ్లిక్ బూత్
నుండి వచ్చిందని అర్ధమయ్యింది."  
        *    *    *    *
    మాఫియాడాన్ .... అతని ప్రక్కన ఇద్దరు అనుచరులు! వారి వెనుక ..... అందమైన  అమ్మాయి.
    ఆమె..... మాఫియడాన్ చెల్లెలు.
    వారికి ఎదురుగా...... ఆరుడుగుగల  ఎత్తున్న కుర్రాడు నిలబడివున్నాడు. ఆ కుర్రాడి ఎడమచేతికి గళ్ళరుమాలు ఉంది.
    "క్యారే ....! నా చెల్లెల్ని .... నీ ఫ్రెండుకు ఇచ్చి పెళ్ళి చేయాలని ప్లాన్ చేసావా? నిన్నూ నీ ప్రెండు గాణ్ణి పైకి  పంపుతూ ....." అన్నాడు మాఫియా డాన్.
    ఆ కుర్రాడు గాట్టిగా నవ్వి, "నన్ను పైకి పంపటం..... అంత ఈజీ కాదుబే! మనం మీసం మేలేస్తే ..... అంధ్రప్రదేశం ఎగిరి చప్పట్లు కొడుతుంది. మనం
తొడగొడితే .... గోదావరి పొంగిపోరలుతుంది. మనం జబ్బ చరిస్తే ..... కృష్ణానది వెనక్కి పారిపోతుంది. రేయ్ .... చూడటానికి ఎర్రగా టొమేటా పండులాగున్నాడు. .... వీడు
నన్నేం పీకగలడు అని అనుకుంటున్నావా! పైన చూస్తె ..... మనం క్లాస్ లోపలంతా .... వీరమాస్. " అన్నాడు.
    "మాఫియా డాన్ నవ్వి, "రేయ్..... నువ్వు నా ఏరియాలో ఉన్నావ్. ఈ ఏరియా దాటి ప్రాణాలతో బయటకి పోలేవురా!" అన్నాడు.
    "రేయ్ ..... రావడం నా ఇష్టం ! పోవడమూ .... నా ఇష్టమే! నీ చిటికినవెలి మీదున్న ... గోరు..... గోరుగోరుగోరు ...... కూడా నన్ను అపలేదురా! మన
పవరేంటో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుసు.ఎగిరి గుద్దానంటే .. పోస్ట్ మార్టమ్ కి  కూడా పనికిరాకుండా పోతావ్ బే!" అన్నాడు కుర్రాడు.
    "నువ్వు మాటలు నేర్చావురా !" కోపంగా అన్నాడు డాన్.
    "మాటలే కాదురా ...... చేతలూ వొచ్చు.పిడికిలితో గుద్దితే ..... గుద్డితే...... రక్తం కక్కుతావ్. కాలితో తన్నానంటే .... నీ పళ్ళు కట్టడానికి డెంటల్ డాక్టర్ కు
సంవత్స్రరం పడుతుందిబే. మర్యాదగా ..... నీ చెల్లెల్ని నాతో పంపు."
    "పంపకపోతే ..... ఏం చేస్తావ్ రా ? పంపను ...."
    "పంపకపోతే...... నిన్నూ నాకు అడ్డం వచ్చిన వాళ్ళను కత్తికికండగా నరికి ..... నీ కుక్కలతోనే తినిపించపోతే .... నేను ఒక అమ్మకీ, అబ్బకీ పుట్టనట్టేరా!
దమ్ముంటే  నన్ను ఆపు." అన్నాడు కుర్రాడు.
    "క....ట్ ! షాట్ ఒకే!!" అరిచాడు పి.వి.రాజకృష్ణ నాథ్ వర్మా.
    (పైన రాసిన డైలాగులు చదువుతూ .......'ఇవేవో సినిమాటైపు డైలాగుల్లా ఉన్నాయే !" అని అనుకున్న  పాఠాకులకు, ఇదేదో సినిమా సీన్
అయ్యుంటుందని కనీసం మధ్యలోనైనా ఊహించిన పాఠకులకూ ... ప్రత్యేక అభినంధనలు  __ రచయిత )
    కుర్ర హీరో , విలన్ పాత్రాధారి, అతని అనుచరులు, అతని చెల్లెలి పాత్రధారి రిలాక్స్ అయ్యారు.
    "సార్. ఎవరో చలనచిత్ర శర్మ అట. మీతో మాట్లాడాలని వచ్చాడట. " చెప్పాడు అసిస్టెంట్ డైరెక్టర్ .
    "అబ్బబ్బా..... ఎవరాయనా? వేషాల కోసమా?" చిరాకుగా అన్నాడు దర్శకుడు .
    "కాదు సార్. మీతో .... మీ  బేవర్స్ నాయాలా ... సినిమా గురించి మాట్లాడాలని అంటున్నాడు."
    "సరే..... పంపించు ."
    నిమిషం తర్వాత ... చలన చిత్ర శర్మ వచ్చాడు.
    "కూర్చోండి ." దర్శకుడు , తన ప్రక్కనున్న ఖాళీ కుర్చీని చూపాడు.
    చలనచిత్ర శర్మ కూర్చున్నాడు
    "చెప్పండి  ఏం మాట్లాడాలి ?"
    "మీ ... బేవర్స్ నాయాలా .... చూసాను పరమ దరిద్రంగా ఉంది."
    పి.వి. రాజకృష్ణ నాథ్ శర్మ ఉలిక్కిపడ్డాడు..
    సినిమా బాగోలేకపోయినా ..... మొహమాటానికైనా బావుందంటారు. కొందరు......" సినిమా బాలేదు!! అని సూటిగా అనకుండా .... 'ఫలానా సీన్స్ లేకపోతే
బావుండేది. అనో, మీరు బాగానే తీసారు. హిరోయిన్ .... ఈ సినిమాకు మైనస్ పాయింట్ !" అనో ..... అంటూంటారు. అయితే .... ఏ బ్లాక్ బస్టర్ నూ .... జనం దర్శకుడి
మొహం ముందు తిట్టరు.
    "సినిమా .... యాభైరోజుల నుండే ఆడుతోంది! బ్లాక్ బస్టర్ తెలుసుగా!"
    "సినిమా బ్లాక్ బస్టర్ అయినంతమాత్రన .... అది బావుందని అనలేముగా!"
    "అంటే?" చిరాకుగా అడిగాడు దర్శకుడు.
    "మీ సినిమాలో ..... ఎనభై శతం సీన్స్ కాపీకొట్టారు . పాటల ట్యూన్స్ కాపీకొట్టారు . పోనీ.... ఆ కాఫీకొట్టడమైనా సరిగ్గా ఉందా.... అంటే అదీలేదు ! ఫైట్స్ లో
సహజత్వం లేదు. డైలాగుల్లో క్లారిటీ లేదు. కొరియోగ్రఫీ నాణ్యత లేదు."
    "ఒహొ.... తమరు సినీవిమర్శకులా! సినిమా బాగాలేకపొతే ఎలా హిట్టయ్యింది? జనం ఎందుకు చూస్తున్నారు?"
    "గుట్కా వ్యాపారం, భారతదేశంలో కోట్లాదిటోర్నవర్ చేస్తోంది. అంతమాత్రన అది మంచిది..... అంటారా ? సారీసారీ .... హిట్ వ్యాపారం అంటారా?"
    "నా సినిమాను, గుట్కాతో పోల్చడం, బాలేదు. సినిమా నచ్చలేదు.... అది మీ వ్యక్తిగత అభిప్రాయం! అంతేకదా!! వదిలెయ్యండి." అన్నాడు దర్శకుడు
సింపుల్ గా .
    "కాఫీ కొట్టకుండా ..... సినిమాలు తియ్యండి." అన్నాడు చలనచిత్ర శర్మ లేస్తూ.
    ఎవడో ఆగంతుకుడు .... ఇలా అన్నపూర్ణ స్టూడియోలోకి వచ్చి...... తనకు క్లాసు పీకుతుండడం దర్శకుడికి ఇరిటేటింగ్ గా ఉంది.
    "హమ్! టి. విల పుణ్యమూ అని..... ఈ మధ్య ప్రతీవాడు .... సినిమా ఎలా తీయాలోసలహా ఇచ్చేవాడే !" సీరియస్ గా అన్నాడు దర్శకుడు .

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra