ఇంట్లో అస్సలు ఉండకూడని ఆ 3 చెట్లు ఇవే.. పెంచితే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే!

హిందూ సంప్రదాయంలో మరియు వాస్తు శాస్త్రంలో ఇంట్లో పెంచే మొక్కలకు చాలా ప్రాధాన్యత ఉంది. అయితే కొన్ని రకాల చెట్లను ఇంట్లో పెంచడం వల్ల ప్రతికూల శక్తి (Negative Energy) పెరిగి, ఆర్థిక నష్టాలు, కుటుంబంలో కలహాలు వస్తాయని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డాక్టర్ అనంత లక్ష్మి గారు ఈ VIDEO లో వివరించారు.
ముఖ్యంగా ముళ్లు ఉన్న మొక్కలు, ఆకులు తెంపితే పాలు కారే చెట్లు, మరియు ఎదుగుదలను ఆపేసే బోన్సాయ్ (Bonsai) మొక్కలను ఇంట్లో అస్సలు పెట్టకూడదని ఆమె స్పష్టం చేశారు. వీటి స్థానంలో తులసి, మల్లె వంటి సానుకూల శక్తినిచ్చే మొక్కలను పెంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, సుఖసంతోషాలు లభిస్తాయని 'భక్తివన్' (BhaktiOne) ధర్మ సందేహాల కార్యక్రమంలో తెలిపారు.


