శనివారం శనిదేవుడికి ఇలా చేసి చూడండి..  ఎంత గొప్ప ఫలితమంటే..!

 

 


శని దేవుడి పేరు చెబితే చాలామంది భయపడతారు.  కానీ శనిదేవుడు చాలా మేలు చేస్తాడు. ఆయనను అర్థం చేసుకుంటే ఆయన ఎంత గొప్ప వాడో తెలుస్తుంది.  శని దేవుడిని నమ్మిన వారికి,  ఆయనను పూజించే వారికి గొడ్డలితో పోయే సమస్యను గోటితో పోయేలా.. కష్టమైన సమస్యలు కూడా చాలా సులువుగా అధిగమించేలా ఆశీర్వదిస్తాడు.  శనిదేవుడికి ముఖ్యంగా శనివారం ముఖ్యం అని నమ్ముతారు.  శనివారం రోజు శమీ వృక్షం అంటే జమ్మి వృక్షం ఆకులను శని దేవుడికి సమర్పిస్తే చాలా మంచిదని చెబుతారు.  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

శనివారం నాడు శనిదేవుడికి శమీ ఆకులు

సమర్పించడం వల్ల , శని యొక్క సాడేసాతి,  ఏలినాటి శని, శని దోషం  వంటి  ప్రభావాలు తగ్గుతాయట.  అలాగే జీవితంలో శాంతి నెలకొంటుందట. శమీ మొక్క ప్రతికూల శక్తిని దూరం చేయడంలో సహాయపడుతుంది,  సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ఇది  వ్యక్తి జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడానికి చాలా ప్రయోజనకరమైన మొక్క. మీరు ప్రతి శనివారం శనిదేవుని పాదాల వద్ద శమీ ఆకులను  సమర్పించినట్లయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి.

శివారాధనలో కూడా..

శివుడు,  వినాయకుడు  కూడా శమీ మొక్కను చాలా ప్రియమైనదిగా భావిస్తారు. పురాణాలలో రావణుడు శమీ ఆకులతో శివుడిని పూజించాడని వ్రాయబడింది. దీని వలన శివారాధనలో దీనికి ప్రాముఖ్యత ఉంది. గణేష్ చతుర్థి నాడు గణేశుడికి సమర్పించే 21 రకాల ఆకులలో శమీ ఆకు కూడా ఉంటుంది.

శని దోషాన్ని తొలగిస్తుంది..

 ఇంట్లో శమీ మొక్కను నాటితే అది ప్రతికూల శక్తిని తొలగించి ఇంట్లో ఆనందం, శాంతి,  శ్రేయస్సు వాతావరణాన్ని సృష్టిస్తుంది. దీనితో పాటు ఇది శని దోషాల నుండి కూడా రక్షిస్తుంది.  ఇంట్లో సానుకూల వాతావరణాన్ని నిర్వహిస్తుంది. శనివారం శమీ మొక్కను నాటడం ఉత్తమం.  దానిని ఇంటికి నైరుతి దిశలో నాటడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ప్రతి శనివారం ఈ మొక్కకు నీళ్ళు పోసి, దాని దగ్గర ఆవాల నూనె దీపం వెలిగించాలి. ఇది మొక్క దైవిక శక్తిని మరింత పెంచుతుందట.


                                     *రూపశ్రీ.


 


More Vyasalu