గురువారం ఈ దానాలు చేస్తే సమస్యలన్నీ తొలగుతాయి!


శాస్త్రాల ప్రకారం ధనదానం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది, ప్రతికూలతలను తొలగిస్తుంది.  జీవితంలో ఆనందం, శ్రేయస్సును చేకూరుస్తుంది. గురువారం ప్రత్యేకంగా దేవగురువైన గురు గ్రహానికి ముఖ్యమైన రోజుగా  పరిగణిస్తారు. ఈ రోజున భక్తితో ధనదానం చేయడం జాతకంలో గురు గ్రహ స్థానాన్ని బలపరుస్తుందని, ఇది అదృష్టాన్ని  తెచ్చిపెడుతుందని నమ్ముతారు. దీనితో పాటు, విద్య, వివాహం , సంతానం ఆనందానికి సంబంధించిన అనేక అడ్డంకులు కూడా తగ్గుతాయని చెబుతారు. గురువారం నాడు దానం చేయడానికి దానం చేయడానికి ధనం మాత్రమే కాకుండా ఇంకా ఏ వస్తువులు ప్రత్యేకంగా శుభప్రదమైనవో, ఏవి మంచి ఫలితాలను ఇస్తాయి.. తెలుసుకుంటే..

పసుపు రంగు..

గురువారం నాడు పసుపు రంగు వస్తువులను దానం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.  పసుపు రంగు పండ్లు, పసుపు రంగు త్పి పదార్థాలు లేదా ఇతర పసుపు రంగు వస్తువులను దానం చేయవచ్చు. ఇది గురు గ్రహపు ఆశీస్సులను తెస్తుంది. ఇది వివాహానికి అడ్డంకులను తొలగించి, మంచి అవకాశాలను సృష్టిస్తుందని నమ్ముతారు.

శనగపప్పు, బెల్లం..

గురువారాల్లో శనగపప్పు, బెల్లం దానం చేయడం కూడా చాలా మంచిది. జ్యోతిష్యం ప్రకారం ఇది అదృష్టాన్ని బలపరిచి, ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా  కుటుంబంలో శాంతి, సంతోషకరమైన వాతావరణాన్ని పెంపొందిస్తుంది.

పసుపు..

జ్యోతిష్యం ప్రకారం పసుపుకు గురు గ్రహంతో సంబంధం ఉందని నమ్ముతారు. గురువారాల్లో పసుపు దానం చేయడం వల్ల జీవితంలోని అనేక సమస్యలు తగ్గుతాయి. ఈ దానం మానసిక ఒత్తిడిని తగ్గించి, సంతోషాన్ని, శ్రేయస్సును పెంచుతుంది.

పసుపు రంగు దుస్తులు..

గురువారం నాడు పసుపు రంగు బట్టలు దానం చేయడం కూడా చాలా శుభప్రదం. దీనివల్ల గురు దోష ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. దీనితో పాటు అప్పు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందే అవకాశాలు ఉన్నాయి.  జీవితంలో గౌరవం , ఎదుగుదలకు అవకాశాలు  పెరుగుతాయి.


                            *రూపశ్రీ


More Aacharalu