నెట్టికంటి ఆంజనేయస్వామి.. ఈ క్షేత్ర రహస్యం, ఇక్కడి స్వామి ఎలా వెలిశారు తెలుసుకోండి..!

కలియుగంలో భక్తుల కొంగు బంగారమై, నమ్మిన వారిని కంటికి రెప్పలా కాపాడే శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్రాలలో అనంతపురం జిల్లాలోని కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి కూడా నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం ఇక్కడకు వస్తుంటారు. ఎంతో చారిత్రక నేపథ్యం, అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి కలిగిన ఈ పుణ్యక్షేత్రం వెనుక ఉన్న రహస్యం, స్వామివారు ఇక్కడ ఎలా వెలిశారనే విశేషాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినవి.అవేంటో తెలుసుకుంటే..
స్వామివారు ఎలా వెలిశారు?
నెట్టికంటి ఆంజనేయస్వామి అవతరణ వెనుక శ్రీ వ్యాసరాజ తీర్థులవారు (విజయనగర సామ్రాజ్య రాజగురువులు) ముఖ్య పాత్ర పోషించారు.
వ్యాసరాజుల స్వప్నం..
ఒకసారి శ్రీ వ్యాసరాజ తీర్థులవారు ప్రయాణిస్తూ ఈ ప్రాంతానికి వచ్చి విశ్రమించారు. ఆ రాత్రి స్వామివారు ఆయన స్వప్నంలో కనిపించి, నేను ఈ ప్రదేశంలో భూమిలో నిక్షిప్తమై ఉన్నాను. నన్ను బయటకు తీసి ప్రతిష్ఠించు అని ఆజ్ఞాపించారట.
విగ్రహం లభించడం..
మరుసటి రోజు ఉదయాన్నే వ్యాసరాజులు గ్రామస్థుల సహాయంతో స్వామివారు స్వప్నంలో చెప్పిన ప్రదేశాన్ని తవ్వించగా, ఆంజనేయస్వామి విగ్రహం లభించింది.
ప్రతిష్ఠాపన..
ఆ విగ్రహాన్ని శ్రీ వ్యాసరాజులు శాస్త్రోక్తంగా కసాపురం వద్ద ప్రతిష్ఠించారు. వ్యాసరాజులు ప్రతిష్ఠించిన అనేక ఆంజనేయస్వామి విగ్రహాలలో ఈ నెట్టికంటి స్వామి ఒకరు.
నెట్టికంటి స్వామి అని పేరు ఎలా వచ్చింది?
ఈ స్వామికి నెట్టికంటి స్వామి అనే పేరు రావడం వెనుక ఒక ప్రత్యేకమైన రహస్యం , కారణం ఉంది
సూటిగా చూసే కన్ను (నెట్టి-కన్ను)..
ఈ క్షేత్రంలో ఆంజనేయస్వామి విగ్రహం దక్షిణ ముఖంగా ఉంటుంది. స్వామివారి పశ్చిమ నయనము (ఎడమ కన్ను లేదా నేత్రము) చాలా స్పష్టంగా, భక్తుల వైపు ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగా కనిపిస్తుంది.
రాయలసీమ మాండలికంలో లేదా పాత తెలుగులో సూటిగా లేదా నేరుగా చూడటాన్ని నెట్టి అని అంటారు. అలా తన భక్తులను సూటిగా తన కంటి చూపుతో అనుగ్రహించే స్వామి కాబట్టి నెట్టికంటి ఆంజనేయస్వామి అని పేరు వచ్చింది.
క్షేత్ర రహస్యం & మహిమలు..
నెట్టికంటి క్షేత్రానికి వచ్చేవారికి స్వామివారు అనేక రకాల ఆధ్యాత్మిక, శారీరక, మనోభీష్ట నివారణలు చేస్తుంటారని నమ్మకం.
గ్రహ దోషాలు & దిష్టి నివారణ..
భయంకరమైన నరదిష్టి, శని దోషాలు, రాహు-కేతు దోషాలు లేదా ఏలినాటి శని ప్రభావంతో బాధపడేవారు ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటే దోషాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు.
చేతబడులు, దుష్టశక్తుల నివారణ..
నెట్టికంటి ఆంజనేయ స్వామి దివ్య దృష్టి పడితే చాలు దుష్టశక్తులు, భూత ప్రేత పిశాచ బాధలు, చేతబడి ప్రయోగాలు పటాపంచలైపోతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామివారి ముందు ప్రార్థిస్తే ఎలాంటి మానసిక భయాలైనా తొలగిపోతాయి.
నల్ల తాడు (రక్షా బంధనం)..
ఆలయంలో ఇచ్చే నల్ల దారము ఇస్తారు. ఇది చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. స్వామివారి పాదాల వద్ద ఉంచి పూజించిన ఈ దారాన్ని చేతికి లేదా మెడలో ధరిస్తే సకల అరిష్టాలు, దుష్ట శక్తుల నుండి రక్షణ లభిస్తుంది.
పూజా విధానాలు & ప్రసిద్ధ రోజులు..
శనివారం , మంగళవారం..
ఈ రోజుల్లో నెట్టికంటి స్వామివారికి విశేష పూజలు, తమలపాకుల పూజ, ప్రదక్షిణలు జరుగుతాయి. వేలాదిమంది భక్తులు క్యూలైన్లలో వచ్చి దర్శించుకుంటారు.
41 రోజుల ప్రదక్షిణ దీక్..
మానసిక స్థిరత్వం, శారీరక రుగ్మతలు తొలగడం కోసం భక్తులు ఇక్కడ నియమనిష్టలతో ప్రదక్షిణలు చేస్తారు.
ప్రసిద్ధ ఉత్సవాలు..
హనుమజ్జయంతి, శ్రావణ మాసం, మరియు ఉగాది పండగల సమయంలో ఇక్కడ భారీ ఎత్తున ఉత్సవాలు మరియు రథోత్సవం జరుగుతాయి.
*రూపశ్రీ.






