ఇల్లు తడిబట్ట పెట్టడానికి మీరు ఇలాంటి బట్టలు వాడుతుంటారా!

ఇంటి పరిశుభ్రతను పాటించే ఇళ్లలో సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెబుతారు. అయితే, శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టని ఇళ్లలో పేదరికం, దరిద్రం ఉంటుందని చెబుతారు. అందుకే ఇళ్లలో మహిళలు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇంటికి వీలైనప్పుడల్లా తడిబట్ట పెడుతుంటారు. అయితే ఇల్లు తుడవడానికి ఉపయోగించే బట్టలు ఇంటి అదృష్టాన్ని సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి ఆహ్వానాన్ని ప్రభావితం చేస్తాయట.  దీని గురించి  మరింత వివరంగా తెలుసుకుంటే..

నేల తుడవడానికి ఏ బట్టలు ఉపయోగించకూడదు?


వాడిన లోదుస్తులు, చిరిగిన బట్టలు లేదా టీ-షర్టులను తుడువడానికి ఉపయోగించడం మంచిది కాదట. ఇలా చేయడం ఇంట్లోని సానుకూల శక్తిని నాశనం చేస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాటు ఇంటి సంతోషాన్ని, శ్రేయస్సును కూడా నాశనం చేస్తుందట. అంతేకాకుండా,  పాతబట్టలతో ఇంటిని  శుభ్రపరిచే పొరపాటు ఇంటికి ధనం రావడం,  ఆర్థికంగా ఎదగడానికి ఆటంకం కలిగిస్తుందట.

శుక్ర ప్రభావం..

జ్యోతిష్యం , వాస్తు శాస్త్రంలో వస్త్రాలకు  శుక్ర గ్రహంతో సంబంధం ఉంటుంది. ముఖ్యంగా తెల్లని వస్త్రాలు శుక్ర గ్రహానికి ప్రతీక. శుక్రుడిని సంపద, శ్రేయస్సు, విలాసం, ఆనందానికి కారకంగా పరిగణిస్తారు. అందుకే పాత లేదా వాడిన బట్టలతో నేలను తుడవడం జాతకంలో శుక్రుడిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. శుక్రుడి  ఈ ప్రతికూల ప్రభావం ఆర్థిక నష్టం , అప్పులకు దారితీయవచ్చట.

పాత చొక్కాలు, లో దుస్తులు..

వాడిన బట్టలు మనిషి శక్తి , భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయి. అందువల్ల, ఈ బట్టలతో ఇంటిని తుడుస్తున్నప్పుడు, సానుకూల శక్తి క్షీణించడం ప్రారంభమవుతుందట. అంతేకాకుండా, ఇంట్లోని వాతావరణం అస్తవ్యస్తంగా మారి, కుటుంబ సభ్యుల మానసిక స్థితి క్షీణించడానికి దారితీస్తుంది. ఈ అలవాటు ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది, దీనివల్ల కూడబెట్టిన సంపదను కోల్పోవాల్సి వస్తుందట.

సరైన నియమాలు..

నేలను తుడవడానికి ఎల్లప్పుడూ శుభ్రమైన, కొత్త బట్టలను ఉపయోగించాలి. అంతేకాకుండా, ఈ పని కోసం ఎల్లప్పుడూ తెల్లని బట్టలనే వాడాలి. ఎందుకంటే తెల్లని బట్టలపై శుక్ర గ్రహ ప్రభావం అత్యధికంగా ఉంటుంది. అంతేకాక, తెల్లని బట్టలతో నేలను తుడవడం వల్ల శుక్రుడు అనుకూలంగా మారతాడట. ఫలితంగా మంచి ఆర్థిక పరిస్థితి ఏర్పడుతుందట.

                              *రూపశ్రీ.


More Aacharalu