Read more!

సుభాషితం - (Subhashitam) హృదయాన్ని కాల్చేసే ఐదు అంశాలు

 

సుభాషితం - (Subhashitam)

హృదయాన్ని కాల్చేసే ఐదు అంశాలు


భార్యా వియోగశ్చ జనాపవాదో

ఋణస్య శేషః కుజనస్య సేవా

దారిద్ర్య కాలే ప్రియ దర్శనం చ

వినా౭గ్నినాపంగ్చ దహంతి కాయం

 

భార్యా వియోగం, (స్త్రీలు భర్త అని అన్వయించుకోవాలి) లోక నింద, రుణభారం (అప్పులు), నీచులకు తగ్గి ఉండాల్సిన పరిస్థితి, దారిద్ర్యం అనుభవిస్తున్న తరుణంలో ఇష్టమైనవారు వచ్చి పలకరించడం - ఇవన్నీ తట్టుకోలేని బాధలు. ఈ ఐదు అంశాలు నిప్పు అవసరం లేకుండా హృదయాన్ని కాల్చేస్తాయి. అవమానభారంతో దహించుకుపోతారు.