Home » Comedy Stories » Producer Wanted Joke
Producer Wanted Joke
" సరదాగా కాసేపు " లో ప్రొడ్యూసర్ కావలెను
.jpg)
నేను సినిమాలకి కథలు రాస్తుంటాను. నా దగ్గర ప్రేమకథలు, ఏడిపించే కథలు, నవ్వించే కథలు, సెంటిమెంట్ కథలు, భయపెట్టే కథలు, సస్పెన్స్ కథలు చాలా ఉన్నాయి. రచయితగా, దర్శకుడిగా మంచిపేరు తెచ్చుకోవాలన్నది నా ఆశయం. నా కథను సినిమాగా తీయడానికి ప్రొడ్యూసర్ కావాలి. ఇంతకీ మీకు నా పేరు చెప్పలేదు కదా...నా పేరు గోల్ మాల్ గోవిందం.
ప్రొడ్యూసర్ కి ఉండవలసిన అర్హతలు.
* గుండెపరంగా ఎలాంటి సమస్యలు ఉండకూడదు.
* ఏడు తరాలు తిని కూర్చున్నా తరగని ఆస్తిపరుడై ఉండాలి.
* సినిమా పరిజ్ఞానం లేకున్నా పరువాలేదు.
* నేను చెప్పిన ప్రతి విషయానికి తలాడించాలి.
* ముఖ్యంగా యువకులకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది.
ఒకవేళ పొరబాటున సినిమా గనుక హిట్టయితే నా తరువాతి సినిమాలకి కూడా వారినే ప్రొడ్యూసర్ గా తీసుకుంటాను. ఆసక్తిగలవారు తగిన సర్టిఫికేట్లాతో ఈ కింది చిరునామాలో సంప్రదించగలరు.
ఇట్లు
గోల్ మాల్ గోవిందం
గోవిందా నిలయం
గోల్ మాల్ పురం.




