Home

»

Latest News

"హీరో అంటే వీడేరా బాబూ" - రాజమౌళి

Dec 19, 2011 3:14PM

యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా "స్టూడెంట్ నం 1" సినిమా చేసేటప్పుడు హీరో యన్ డటి ఆర్ ని చూడగానే "వీడు హీరో ఎంట్రా బాబూ" అని అనుకున్నాడట. తర్వాత యన్.టి.ఆర్.నటించే విధానం, డైలాగ్ చెప్పే విధానం, అతని డ్యాన్సింగ్ స్టైల్ చూసిన తర్వాత రాజమౌళి "హీరో అంటే వీడేరా బాబూ" అనుకున్నాడట. యన్ టి ఆర్ హీరోగా, రాజమమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు మూడు. "స్టూడెంట్ నం 1", "సింహాద్రి", "యమదొంగ".

ఈ మూడు చిత్రాలూ సూపర్ హిట్టయ్యాయి. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చే చిత్రమంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలుంటాయి. ప్రస్తుతం రాజమౌళి "ఈగ" చిత్రం, దాని తర్వాత యణగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించే చిత్రానికీ దర్శకత్వం వహిస్తారు. యన్ టి.ఆర్. ప్రస్తుతమ బోయపాటి శీను దర్శకత్వంలో "దమ్ము" చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలోని చిత్రంలో నటించటానికి అంగీకరించారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com