Home

»

Latest News

య‌శ్.. వ‌న్ మోర్ పాన్ ఇండియా ప్రాజెక్ట్

Mar 04, 2021

`కేజీఎఫ్`తో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు క‌న్న‌డ క‌థానాయ‌కుడు య‌శ్. నేష‌న‌ల్ వైడ్ సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ సినిమా తాలూకు  రెండో భాగం `కేజీఎఫ్ ఛాప్టర్ 2` జూలై 16న థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది. `ఛాప్ట‌ర్ 1`కి మించిన హీరోయిజం `ఛాప్ట‌ర్ 2`లో ఉండ‌బోతుందంటూ టీజ‌ర్ లో స్ప‌ష్టం కావ‌డంతో.. య‌శ్ పై మ‌రింత అంచ‌నాలు పెరిగాయి.

ఇదిలా ఉంటే.. `కేజీఎఫ్ ఛాప్ట‌ర్ 2` త‌రువాత `మ‌ఫ్టీ` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని రూపొందించిన శాండ‌ల్ వుడ్ కెప్టెన్ న‌ర్త‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో పాన్ ఇండియా మూవీని సెట్ చేసుకున్నారు య‌శ్. త్వ‌ర‌లోనే ఈ క్రేజీ వెంచ‌ర్ సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. ఈ లోపే.. ఇంకో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట రాకీ భాయ్.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ విష్ణు ఇందూరి నిర్మాణంలో య‌శ్ ఓ చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. ఇప్ప‌టికే ఇద్ద‌రి మ‌ధ్య ప‌లుమార్లు దీనికి సంబంధించి చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని టాక్. కాగా, న‌ర్త‌న్ కాంబినేష‌న్ మూవీ పూర్త‌య్యాకే ఈ ఫ్లిక్ ప‌ట్టాలెక్కే అవ‌కాశ‌ముంద‌ని టాక్. త్వ‌ర‌లోనే య‌శ్ - విష్ణు ఇందూరి కాంబో వెంచ‌ర్ పై క్లారిటీ వ‌స్తుంది.


Yash in talks with 83 producer Vishnu Induri for a Pan India film after KGF 2,gf star yash PAN India Movie,Yash going to turn a producer Vishnu Induri

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com