Home

»

Latest News

ఫైనల్‌గా సక్సెస్ ఇచ్చేశావు దేవుడా!

Dec 17, 2019 3:53PM

 

"ఓరి దేవుడా.. సరిగ్గా లంచ్ టైంకు ముందు నా చేతికి మైక్ ఎందుకిచ్చారు దేవుడా.. ఏదిచ్చినా దేవుడా.. ఫైనల్‌గా సక్సెస్ ఇచ్చేశావు దేవుడా.. థాంక్యూ సో మచ్" అని నవ్వించారు వెంకటేశ్. 'వెంకీమామ' థాంక్యూమీట్‌లో ఆయన అందరికంటే చివర మాట్లాడారు. అప్పటికి లంచ్ టైం దాటుతోంది. దీని దృష్టిలో పెట్టుకొని ఆయన చమత్కారంగా తన స్పీచ్ మొదలుపెట్టారు. 

"రెండు నిర్మాణ సంస్థలు సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి చెందిన టీం సమష్టి కృషి ఈ విజయం. ఒక మంచి సినిమా తియ్యాలనే ఉద్దేశంతో కష్టపడి ఈ సినిమా చేశాం. ప్రేక్షకులు బాగా ఆదరించి ఈ రేంజ్ బ్లాక్‌బస్టర్ విజయం సాధించి పెట్టారు. నిన్న చిరంజీవి సినిమా చూసి మెచ్చుకున్నారు. థాక్యూ చిరు. మహేశ్ ఈ సినిమాని ఎంకరేజ్ చేశాడు. సినిమా రిలీజయ్యాక ఇండస్ట్రీ అంతా పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యింది. ఇండస్ట్రీ ఒక్కటిగా ఉండటం చాలా ముఖ్యం. నెగటివిటీ అనే దాన్ని తీసేస్తే ఇండస్ట్రీ ఎప్పుడూ బాగుంటుంది. అందుకే అందరూ ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండాలి. మనం పైరసీని కంట్రోల్ చెయ్యాలి. ఎంతో కష్టపడి సినిమాలు తీస్తుంటాం. అందరూ ఒక్కతాటిపై ఉండి పైరాసీని నిలువరించాలి. దాన్ని ప్రోత్సహించొద్దు" అని చెప్పారు వెంకటేశ్.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com