మిస్టర్ లో వరుణ్ తేజ్ సిక్స్ ప్యాక్..!
on Apr 30, 2016

మెగా హీరోల్లో లేటుగా వచ్చినా, తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. మెగాబ్రదర్ నాగబాబు వారసుడిగానే కాక, మొత్తం ఫ్యామిలీలోనే అందగాడు అంటూ మెగాస్టార్ తోనే అనిపించుకున్నాడు. ఈ ఆరడుగుల అందగాడు ఇప్పటి వరకూ నటనతోనే అలరించినా శ్రీను వైట్ల తో తీసే మిస్టర్ లో మాత్రం సిక్స్ ప్యాక్ తో కూడా అభిమానుల్ని మెప్పించాలనుకుంటున్నాడట. దీని కోసం తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాడు. కష్టే ఫలి అన్నది వరుణ్ తొందరగానే గుర్తించినట్టున్నాడు. అందుకే పగలు రాత్రి జిమ్ చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ, మిస్టర్ లో తన సిక్స్ ప్యాక్ చూపించాలని హార్డ్ వర్క్ చేస్తున్నాడట. ఇప్పటికే మెగా హీరోల్లో, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ సిక్స్ ప్యాక్ లు చేసేశారు. అందుకే వాళ్ల సరసన చేరాలని వరుణ్ చూస్తున్నట్టున్నాడు. ఇక మిస్టర్ విషయానికొస్తే, చాలా రోజుల తర్వాత శ్రీను వైట్ల చేస్తున్న కాలేజీ లవ్ స్టోరీ ఇది. సినిమాలో వరుణ్ యూనివర్సిటీ టాపర్ గా కనిపిస్తాడని శ్రీనువైట్ల చెప్పడం విశేషం. స్పెయిన్, బ్రెజిల్ లో షెడ్యూల్ జరుపుకుని ఆ తర్వాత మూవీ టీం కర్ణాటక బోర్డర్ లో కీలక సన్నివేశాలని షూట్ చేస్తారని సమాచారం. అన్ని కుదిరితే మిస్టర్ సంక్రాంతి బరిలోకి దిగే అవకాశం ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



