బాలీవుడ్‌లో "రాజన్న"ను డైరెక్ట్ చేస్తున్న రాజమౌళి ఫాదర్
on Apr 23, 2016

వి.విజయేంద్రప్రసాద్..దర్శకధీరుడు రాజమౌళి తండ్రి అంతేకాదు..ఎన్నో సూపర్ హిట్ మూవీస్‌కి స్టోరీ అందించిన రచయిత. తెలుగులో ఈయన కథలకు యమక్రేజ్ ఉంది. టాలీవుడ్‌లో బిజిగా ఉన్న సమయంలోనే "బాహుబలి", "భజరంగీ భాయ్‌జాన్" చిత్రాలతో రచయితగా బాలీవుడ్‌లోనూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. కేవలం రచయితగానే కాకుండా దర్శకుడిగా కూడా ఆయన నిరూపించుకున్నారు. కింగ్ నాగార్జున నటించిన "రాజన్న" చిత్రానికి దర్శకుడు ఆయనే.
ఇప్పుడా చిత్రాన్ని హిందీలోకి తీసుకువెళ్లే ఆలోచనలో ఉన్నారంట విజయేంద్రప్రసాద్. నాగార్జున పోషించిన పాత్రకి సన్నీడియోల్‌ని ఎంపిక చేసినట్లు సమాచారంజ ఈ చిత్రానికి మేరా భారత్ మహాన్ అనే పేరు పరిశీలనలో ఉంది. రాజన్నలోని థీమ్‌ని మాత్రమే తీసుకుని బాలీవుడ్ నేటివిటికి తగ్గట్టు మార్పులు, చేర్పులు చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ చిత్రానికి రాజమౌళి క్రియేటివ్ హెడ్‌గా పనిచేస్తారని చెబుతున్నారు. రాజన్నలోని యాక్షన్ సీన్లను రాజమౌళి డైరెక్ట్చ్ చేశారు. అంతా అనుకున్నట్టు జరిగితే రాజన్న ఈ ఏడాది చివరికి సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



