Home

»

Latest News

త్రివిక్రమ్ కి యమా తొందరగా వుందట

Jun 23, 2015 4:49PM

పెద్ద హీరోలతో సినిమా చేద్దామంటే..ఇప్పట్లో ఎవరు ఖాళీ అయ్యేటట్లు లేరు. కనీసం ఆరు నెలలు అయినా ఆగాల్సిందే. అయితే సాధారణంగా సినిమా.. సినిమాకి మధ్య కొంచెం ఎక్కువ గ్యాప్ తీసుకునే త్రివిక్రమ్, ఈ సారి మాత్రం ఏదో ఒక సినిమా అర్జెంట్ గా చేయాలని తొందరపడుతన్నట్లు కనిపిస్తున్నారని టాలీవుడ్ టాక్. అదెందుకన్నదే తెలియదు. అందుకోసమే ఓ ఫ్యామిలీ స్టోరీని ఎంచుకున్నారట. ఇందులో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఎక్కువే కానీ, మరీ హీరోయిన్ ఓరియెంటెడ్ మాత్రం కాదట. హీరోకి మంచి పాత్ర వుంటుందని వినికిడి. అయితే ఆ హీరో హీరోయిన్లు ఎవరు అన్నదే ఇప్పుడ మిలియన్ డాలర్ల క్వశ్చన్. అది తేలడం లేదని వినికిడి. అది తేలితే బండి పట్టాలమీదకు వెళ్తుంది..మళ్లీ త్రివిక్రమ్ స్టయిల్ సినిమా కనిపించడానికి అవకాశం వుంటుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com