Home

»

Latest News

క‌ర్చీఫ్ నెం.1.... దిల్‌రాజు

Aug 17, 2015 4:47PM

టాలీవుడ్‌లో కొత్త టాలెంట్ క‌నీక‌నిపించ‌గానే అమాంతం ఒడిసిప‌ట్టేయ‌డంలో దిట్ట‌... దిల్‌రాజు. కొత్త ద‌ర్శ‌కుడెవ‌రైనా హిట్టు కొడితే.. అమాంతంగా క‌ర్చీఫ్ వేసేస్తారు. కొత్త క‌థానాయిక మెరిస్తే... అడ్వాన్సులు ఇచ్చేస్తారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు. ఈ శుక్ర‌వారం విడుద‌లై హిట్ కొట్టిన చిత్రం సినిమా చూపిస్త మావ‌. త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సింపుల్ స్టోరీలైన్‌ని ఆయ‌న డీల్ చేసిన విధానం అంద‌రికీ న‌చ్చింది. చిన్న బ‌డ్జెట్‌లో క్వాలిటీ ఉన్న సినిమా తీశారాయ‌న‌.

ఈసినిమా విడుద‌ల‌కు ఉందే లాభాల‌ను తెచ్చుకొంది. సినిమా చూపిస్త మావ‌ని నైజాంలో పంపిణీ చేసిన దిల్‌రాజు.. ఇప్పుడు త్రినాథ‌రావుకి అడ్వాన్సులు ఇచ్చారు. త్రినాథ‌రావు త‌దుప‌రి సినిమా దిల్‌రాజు బ్యాన‌ర్‌లోనే అని తెలుస్తోంది. 'నీకు కావ‌ల్సిన టీమ్ ఇస్తా.. సినిమా చేసిపెట్టు' అని బ్లాంక్ చెక్ చేతిలో పెట్టిన‌ట్టు తెలుస్తోంది. అలా... క‌ర్చీఫ్ వేయ‌డంలో టాలీవుడ్‌లో త‌న‌కంటే మొన‌గాడు లేడ‌న్న విష‌యాన్ని మ‌రోసారి నిరూపించుకొన్నారీయ‌న‌.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com