
'దసరా' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'ది ప్యారడైజ్'. సెప్టెంబర్ 24న థియేటర్లలో అడుగు పెట్టనున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మూవీ ఇన్‌సైడ్ టాక్ ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకొని వెళ్తుంది.
ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్ అసలు నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. కథను చాలా గ్రిప్పింగ్‌గా, ఎక్కడా బోర్ కొట్టకుండా డైరెక్టర్ నడిపించిన తీరు సూపర్ అని టాక్ వస్తోంది. ప్రతి సీన్ ప్రేక్షకులను సినిమాలో మమేకం చేసేలా డిజైన్ చేశారట. అసలు అసలైన మైండ్ బ్లోయింగ్ ఎపిసోడ్స్ ఏంటంటే... ఇంటర్వెల్ బ్లాక్, ప్రీ క్లైమాక్స్. ఇవి రెండూ వేరే లెవెల్‌లో ఉండబోతున్నాయట. ఈ రెండు ఎపిసోడ్స్ థియేటర్లలో ఆడియన్స్‌కి పూనకాలు తెప్పించడం ఖాయం. ఈ పార్ట్స్ చూస్తున్నంతసేపు థియేటర్లో సీటు అంచున కూర్చోవాల్సిందే. ఆ రేంజ్ హై-వోల్టేజ్ డ్రామా, మాస్ ఎలివేషన్స్ ఇందులో దాగున్నాయట.

ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మ్యాజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనిరుధ్ ఇప్పటికే ఫస్ట్ హాఫ్ ఆర్ఆర్ కంప్లీట్ చేశారు. అంతేకాకుండా, ప్రస్తుతం సెకండాఫ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులను చాలా వేగంగా పూర్తి చేస్తున్నారు. ఆయన ఇచ్చే బిజిఎమ్ వల్ల ప్రతి సీన్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తుందని టీమ్ ధీమాగా ఉంది. అనిరుధ్ మ్యూజిక్ వింటుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
మరో బిగ్ న్యూస్ ఏంటంటే.. నిన్నటితో ఈ సినిమా టోటల్ షూట్ సక్సెస్ ఫుల్‌గా ఫినిష్ అయింది. చివరి షాట్ వరకు పర్ఫెక్షన్ కోసం టీమ్ ఎంతగానో కష్టపడింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. రన్‌టైమ్ వచ్చేసి దాదాపు 2 గంటల 40 నిమిషాలు ఉండబోతోంది. పర్ఫెక్ట్ లెంగ్త్‌లో ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా, ఫుల్ పైసా వసూల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి డైరెక్టర్ శ్రీకాంత్ పక్కా ప్లాన్‌తో వస్తున్నాడని టాక్.
[The Paradise Movie, Natural Star Nani, Srikanth Odela, Anirudh Ravichander, Telugu Film News, Tollywood News, Telugu News]





