Home

»

Latest News

ప్ర‌భాస్ బాగా బ‌ల‌వంతం చేశాడ‌ట‌!

Jul 1, 2015 10:28AM

ప్ర‌భాస్ అతిథి మ‌ర్యాద‌ల గురించి సెట్లో అంద‌రూ గొప్ప‌గా చెప్తుంటారు. ప్ర‌తి రోజూ షూటింగ్‌కి ప్ర‌భాస్ కోసం క్యారియ‌ర్ల‌కు క్యారియ‌ర్లు మోసుకొస్తుంటార‌ట‌. ప్ర‌భాసేమో డైటింగ్‌లో ఉంటాడు. అందుకే ప్ర‌భాస్‌తో పాటున్న‌వాళ్లంతా ఆ ఇంటి భోజ‌నం లాగించాల్సిందేన‌ట‌. ప్ర‌భాస్ ద‌గ్గ‌రుండి మ‌రీ ఒడ్డిస్తాడ‌ట‌. 'క‌డుపు నిండిపోయింది బాబోయ్‌' అన్నా వ‌దిలిపెట్ట‌డ‌ట‌. ఒక ద‌శ‌లో ఇదేదో టార్చ‌ర్‌లా అనిపిస్తుంద‌ట‌.

త‌మ‌న్నా కూడా ఈ టార్చ‌ర్ అనుభ‌వించింద‌ట‌. ''ప‌ది ప‌దిహేను ర‌కాల వంట‌కాల‌తో ప్ర‌భాస్ ఇంటి నుంచి క్యారియ‌ర్ వ‌స్తుంది. దాదాపుగా అన్నీ నాన్ వెజ్ వంట‌కాలే. నేనేమో... కొంచెం  కొంచెం తినే టైపు. కానీ ప్ర‌భాస్ మాత్రం బ‌ల‌వంతంగా అన్ని వెరైటీలూ ద‌గ్గ‌రుండి తినిపించేవాడు. క‌డుపు నిండిపోయినా వ‌దిలేవాడు కాదు. ఇంకా తినండి.. అంటూ వ‌డ్డించేవాడు. ఒక్క మాట‌లో చెప్పాలంటే తిండిపెట్టీ పెట్టి విసిగించేశాడు...'' అని బాహుబ‌లి సెట్లో అనుభ‌వాల్ని పంచుకొంది త‌మ‌న్నా.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com