
మన శంకర వరప్రసాద్ గారు రికార్డ్స్ ని బద్దలు కొట్టడానికి చిరు తన 'కాకా' ని ముస్తాబు చేస్తున్న విషయం తెలిసిందే. వాల్తేరు వీరయ్య బాబీ దర్శకుడు కావడం విజయానికి లభించే బోనస్ గా ఫ్యాన్స్ భావిస్తున్నారు. జనవరి 13 రిలీజ్ డేట్ కావడంతో శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది.
తాజాగా సంగీత దర్శకుడు థమన్ ఎక్స్ వేదికగా ‘కాకా’ సెట్స్ నుంచి చిరంజీవితో కలిసి దిగిన పిక్ ని అభిమానులతో పంచుకున్నారు. పిక్ లో చిరంజీవి, థమన్ ఇద్దరూ ఎంతో ఆనందంగా నవ్వుతూ ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్ క్షణాల్లోనే అభిమానుల దృష్టిని ఆకర్షించడంతో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో సదరు పిక్ వైరల్ అయ్యే పనిలో బిజీగా ఉంది. ముఖ్యంగా చిరు లుక్. పనిలో పనిగా చిరు క్యారక్టర్ పై పలు రకాల చర్చలు కూడా జరుగుతున్నాయి. మ్యూజిక్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read: త్రివిక్రమ్ క్రేజీ ప్లాన్.. ఆ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు..అసలు మ్యాటర్ ఇదేనా
చిరు కూతురుగా అనస్వర రాజన్ అమ్ములు పాప' అనే మెడికల్ కాలేజ్ విద్యార్థిని పాత్రలో నటిస్తోందని మేకర్స్ ఆమె పుట్టినరోజున (సెప్టెంబర్ 8, 2026) ఫస్ట్ లుక్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ పోస్టర్‌లో అనస్వర వెనుక గోడపై చిరంజీవి సిల్హౌట్ నీడ కనిపిస్తూ, ఆమెను కాపాడే సత్యం పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో క్లూ ఇచ్చారు. దీనితో పాటు నివేదా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను వంటి బలమైన తారాగణం ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. జనగణమన, టాక్సిక్ ఫేమ్ ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ పై నిర్మాత వెంకట్ కే నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
[Kaaka, Chiranjeevi, Thaman, Anaswara Rajan, Telugu Cinema News, TeluguNews, Tollywood, Tollywood News, TeluguCinema]






