Home

»

Latest News

జయం.. జయం అంటే అతనికి నచ్చదు

Jul 30, 2015

చిత్రంతో హిట్ కొట్టి, జయంతో బ్లాక్ బ్లాస్టర్ ఇచ్చి, నువ్వు నేనుతో టాప్ లీగ్ లోకి ఎంటరయ్యాడు తేజ. ఈ సినిమాల త‌ర‌వాత త‌న‌దైన సినిమా తీయ‌లేక‌పోయాడు తేజ‌. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఫ్లాపులే ఎదురయ్యాయి. అంద‌రూ త‌న నుంచి జ‌యంలాంటి సినిమానే కోరుకొంటున్నార‌ట‌. ఆ సినిమా పేరు వింటుంటే త‌న‌కు ఇరిటేట్ క‌లుగుతోంద‌ని చెప్తున్నాడు. ఆ సినిమా అన‌వ‌స‌రంగా తీశాన‌ని బాధ‌ప‌డుతున్నాడు. ఎన్ని కొత్త క‌థ‌లు తీసినా త‌న‌పై ప్రేమ‌క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడిగానే ముద్ర వేశాడ‌ని ఆరోపిస్తున్నాడు. అయితే ఇప్పుడు తీసిన హోరా హోరీ కూడా ఓ ల‌వ్ స్టోరీనే. కానీ ఓ డిఫ‌రెంట్ వేలో ప్ర‌జెంట్ చేశాడ‌ట‌. అయితే తేజ హిట్ కోడతాడో లేక మళ్ళీ జయన్నే గుర్తుకు తెస్తారా అనేది వేచి చూడాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com