Home

»

Latest News

లవ్‌ మేట‌ర్‌.. తాప్సి రియాక్ష‌న్‌..

May 11, 2015

క‌థానాయిక‌లూ వారి ప్రేమ వ్య‌వ‌హారాల కంటే హాట్ టాపిక్ ఏముంటుంది?? టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా హీరోయిన్ల రొమాన్స్ కంటే టాక్ ఆఫ్ ది టౌన్ మ‌రోక‌టి ఉండ‌దు. ఈమ‌ధ్య తాప్సిపై కూడా ఓ ప్రేమ వార్త షికారు చేస్తోంది. ఓ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌తో తాప్సి ప్రేమ‌లో ప‌డింద‌ని, ఇద్ద‌రూ ప్రేమ ప‌క్షుల్లా.. విహ‌రిస్తున్నార‌ని వార్త‌లొస్తున్నాయి. వీటిపై తాప్సి స్పందించింది. ``ప్రేమ‌, పెళ్లి, రొమాన్స్‌... ఇవ‌న్నీ నా ప‌ర్స‌న‌ల్ విష‌యాలు. వాటిని మ‌రొక‌రితో చ‌ర్చించ‌డానికి నాకు ఇష్టం ఉండ‌దు. మా అమ్మానాన్న ద‌గ్గ‌ర నేను ఏ విష‌యం దాచ‌లేదు. వాళ్ల ద‌గ్గ‌ర నేనెప్పుడూ ఓపెన్‌. ప్రేమ‌లో ప‌డ్డానా, లేదా.. అనేది వాళ్ల‌కు తెలిస్తే సరిపోతుంది. మీకు చెప్పాల్సిన ప‌నిలేదు..`` అంటూ కాస్త ఘాటుగానే బ‌దులిచ్చింది తాప్సి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com