రికార్డులు సృష్టిస్తున్న సూపర్ స్టార్ సినిమా..!
on May 23, 2016
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే ఆ మాత్రం ఉండాలి బాస్. రిలీజయ్యాక రికార్డ్స్ ను మామూలు స్టార్స్ క్రియేట్ చేస్తారు. అయితే రజనీకాంత్ సినిమాలు మాత్రం విడుదల కాకముందే కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తుంటాయి. ఆయన లేటెస్ట్ సినిమా కబాలీ. ఇప్పటికే యూట్యూబ్ లో ఈ సినిమా టీజర్ రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టీజర్ తో అంచనాలను మరింతగా పెంచేసుకుందీ సినిమా. రజనీకి కేవలం సౌత్ ఇండియా, నార్త్ ఇండియానే కాదు. ఆసియా అంతా ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆయన సినిమాలను అక్కడ కూడా డబ్ చేస్తుంటారు. ముఖ్యంగా మలేషియాలో తమిళ సినిమాలకు ఆదరణ బాగుంటుంది. అక్కడ మెజారిటీ తమిళులుండటమే అందుక్కారణం. ఇన్నాళ్లూ డైరెక్ట్ గా తమిళ్ లో సినిమాలను రిలీజ్ చేసేవారు. అయితే మొదటి సారిగా సూపర్ స్టార్ సినిమా కబాలీని అక్కడి స్థానిక మలయ్ భాషలో డబ్ చేస్తున్నారు. ఈ లాంగ్వేజ్ లోకి డబ్ అయిన ఫస్ట్ తమిళ్ మూవీ కబాలీయే కావడం రికార్డ్. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన కబాలీ, 70 శాతం షూటింగ్ మలేషియాలోనే జరిగింది. అక్కడ కబాలీ రికార్డ్ స్ఠాయిలో కలెక్షన్లు కురిపిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.