Home

»

Latest News

ఆమె క్రేజ్ ముందు సూపర్ స్టార్లయినా దిగదుడుపే!

Aug 19, 2017


ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు రామ్ గోపాల్ వర్మ కామెంట్లకు బలైపోయినవారిలో ఉన్నారు. ఈ దఫా.. కేరళ సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్ లాల్ ల వంతు వచ్చంది. వర్మ... రీసెంట్ గా ఫేస్ బుక్ లో ఈ ఇద్దరు సూపర్ స్టార్లను కూడా టార్గెట్ చేశాడు. దేనికి? అనేగా మీ ప్రశ్న.  కేరళ కొచ్చీలోని  ఓ మొబైల్ కంపెనీ ఇనాగరేషన్ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా సన్నిలియోన్ హాజరైంది. దాంతో ఆమెను చూడటానికి జనాలు తండోపతండాలుగా తరలివచ్చారు.

ఆ షాప్ ఉన్న ఏరియా అంతా జన సంద్రంగా మారిపోయింది. సన్నీలియోన్ క్రేజ్ చూసి.. చాలామంది అవాక్కయ్యారు. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ విషయం మీదే.. వర్మ కామెంట్లు చేశారు. ‘సన్నీలియోన్ క్రేజ్ చూస్తే... కేరళ సూపర్ స్టార్స్ మమ్ముటి, మోహన్ లాల్ లు అసూయతో ఏడుస్తారు. నిజానికి ఆమె క్రేజ్ ముందు ఈ సూపర్ స్టార్లు కూడా దిగదుడిపే’అని ఫేస్ బుక్ లో కామెంట్ పోస్ట్ చేశాడు వర్మ. ఈ కామెంట్ చూసిన కేరళ అభిమానులు... వర్మపై భగ్గుమంటున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com