ENGLISH | TELUGU  

సన్నీ లియోన్ కు ఈ రోజు చాలా స్పెషల్..!

on May 13, 2016

సన్నీ లియోన్.. యూత్ సెన్సేషన్. దేశంలో కుర్రకారుకు చాలా ఇష్టమైన పేరు. అయితే ఈ ఇండో కెనేడియన్ భామ ఇంత ఫ్యామస్ అవడం వెనుక గత జీవితపు మెరుపుల కంటే, ఆమె కష్టమే ఎక్కువ ఉంది. టీనేజ్ లో ఉన్న సమయంలో డబ్బు కోసం పోర్న్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అక్కడే ఎన్నో సినిమాలు చేసిన సన్నీకి, బిగ్ బాస్ తో మరో లైఫ్ మొదలైంది. ఈ షో తో మొట్టమొదటిసారి బాలీవుడ్ లో ఆమె పేరు వినిపించింది.

నీలి చిత్రాల తారగా ఆమెకున్న క్రేజ్ ను ఉపయోగించుకునే ప్రయత్నంగా జిస్మ్ 2 సినిమా తెరకెక్కింది. ఆ సినిమాతో అడల్ట్ కామెడీ, ఎరోటిక్ సినిమాల్లో వరస అవకాశాలతో బాలీవుడ్ లో తనకంటూ చిన్న స్థానాన్ని సంపాదించుకుందీ భామ. ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఏకంగా షారుఖ్ తోనే రయీస్ ఐటెం సాంగ్ లో స్టెప్పులేసి, కెరీర్ తో మరో మెట్టు పైకెక్కింది. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే, సన్నీ తన కెరీర్ ను పక్కాగా ప్లాన్ చేసుకుంటుందని అర్ధమవుతుంది.

మొదట నీలిచిత్రాల స్టార్, ఆ తర్వాత బాలీవుడ్ అడల్ట్ స్టార్, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ హీరోల సరసన బాలీవుడ్ స్టార్ గా ఎదిగింది. తాజాగా లిప్ కిస్సులకు కూడా నో చెబుతూ, తన రేంజ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది సన్నీ. తన భర్తతో డానియల్ వెబర్ తో సాయంతో గతం అనే మురికికూపం నుంచి, తామర పువ్వులా బయటికొచ్చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ యాక్ట్రెస్ గా ఎదుగుతోంది. త్వరలోనే అందాల ఆరబోతకు గుడ్ బై చెప్పేసి, కేవలం తన యాక్టింగ్ టాలెంట్ మీదే సినిమాలు చేస్తానని చెప్పడం కుర్రకారు కాస్త ఇబ్బంది కలిగించేదే అయినా, అది సంతోషించదగ్గ విషయం.

ఆమె గతాన్ని చూసి తప్పుగా మాట్లాడేవాళ్లు, వెకిలిచేష్టలు చేసేవాళ్లు, చులకనగా చూసేవాళ్లు చాలా మంది ఉంటారు. వాళ్లందరినీ దాటుకుని ఇప్పుడున్న స్థాయికి చేరుకోవడం మామూలు విషయం కాదు. మొన్నీమధ్యే ఒక బాలీవుడ్ విలేకరి అడిగిన ఇబ్బందికరమైన ప్రశ్నలన్నింటికీ చిరునవ్వుతోనే సమాధానమిచ్చి, ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుంది సన్నీ. త్వరలోనే అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ సినిమాల్లో కూడా ఛాన్స్ కొట్టేసే అవకాశం లేకపోలేదు. కాన్ఫిడెన్స్ తో కష్టపడితే ఎలాంటి గతాన్నైనా మార్చుకోవచ్చు అని చెప్పడానికి సన్నీ లియోన్ నిదర్శనంగా నిలుస్తోంది. ఇంతకీ ఈరోజు సన్నీకి ఎందుకు స్పెషలో చెప్పలేదు కదూ..ఈరోజు ఆమె పుట్టిన రోజు. హ్యాపీ బర్త్ డే టు కరెన్ జీత్ కౌర్ వోహ్రా..కంగారు పడకండి. అది సన్నీ అసలు పేరు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.