ఆ హీరోతో సహజీవనం కట్ చేసిన నిత్యా మీనన్
on Jun 17, 2017

తెలుగులో తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేక మార్కు తెచ్చుకున్న కేరళ కుట్టి నిత్యా మీనన్ ఈ మధ్య ఇక్కడ సినిమాలు విపరీతంగా తగ్గించేసింది. తన మాతృక మలయాళంలో కూడా కాదని కన్నడలో ఎక్కువ సినిమాలు చేస్తుంది. ఈ మధ్య ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టిన ఒక గాసిప్ ఏంటంటే నిత్యా మీనన్ ఒక కన్నడ హీరోతో సహజీవనం అదే అండీ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంది అని. తన భార్య ప్రియకి విడాకులు ఇద్దాం అని నిర్ణయించుకున్న తర్వాత సుదీప్ అదే ఈగ విలన్ గా చేసాడు కదా ఆయనే, నిత్యాకి దగ్గరయ్యాడట.
ఇద్దరూ బెంగుళూరులో ఒకే అపార్ట్మెంట్ లో కలిసి ఉన్నారని సాండల్వుడ్ లో ఒక రూమర్. నిత్యాని వీలయినంత వరకు బెంగళూరు ఉంచే ప్రయత్నంలో భాగంగా కన్నడలో ఆమెకి వరుసగా సినిమాలు వచ్చేలా చేసాడట. అయితే, ఈ మధ్య ఎందుకు చెడిందో తెలియదు కానీ, ఇద్దరూ వేరువేరుగా ఉంటున్నారట. సుదీప్ తన భార్య ప్రియకి మళ్ళీ దగ్గరవుతుండడమే దీనికి కారణమని చెబుతున్నారు. బెంగుళూరు ఫామిలీ కోర్ట్ లో హాజరుకావాల్సిన సుదీప్, ప్రియ ఇప్పటికే ఎనిమిది సార్లు డుమ్మా కొట్టారట. కోర్ట్ వీళ్లిద్దరికీ వార్నింగ్ కూడా ఇచ్చిందట. ఇప్పుడు సాండల్వుడ్ లో నిత్యా, సుదీప్ ల బ్రేక్ అప్ హాట్ టాపిక్ అయింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



