Home

»

Latest News

శ్రీమంతుడు ప్రీమియర్ టాక్: హిట్..వన్ టైమ్ వాచ్

Aug 7, 2015 10:54AM

మహేష్ బాబు శ్రీమంతుడు హంగామా మిడ్ నైట్ నుంచే మొదలైంది. తెలంగాణ, ఆంధ్రాలో అభిమానుల కోసం భారీ రెంజులో బెనిఫిట్ షోలు వేశారు. సాధారణంగా ఫ్యాన్స్ షో అంటేనే సినిమాకు విపరీతమైన పాజిటివ్ టాక్ రావాలి. కానీ శ్రీమంతుడు విషయంలో సీన్ రివర్స్ అయినట్టు ఇండస్ట్రీ టాక్. ఈ సినిమా బెనిఫిట్ షోలు అయిపోయిన వెంటనే మిక్స్ డ్ టాక్ మొదలైంది. కొంతమంది సినిమా సూపరంటే మరికొంతమంది సినిమా పర్వాలేదని అంటున్నారు.

సినిమా మొత్త‌మ్మీద హైలెట్ - శ్రీ‌మంతుడిగా మ‌హేష్ క్యారెక్ట‌రైజేష‌న్‌. అది త‌ప్ప ఈ సినిమాలో ఇంకేంలేదని అంటున్నారు. ఫ‌స్టాఫ్ త‌ర‌వాత సెకండాఫ్ లో ఏం జ‌రుగుతుంది? అనే విష‌యం ఇట్టే తెలిసిపోతుందట. ఈ సినిమా కథ మీద ఇంకొంచెం కొరత శివ రిసర్చ్ చేసి వుంటే బాగుండేదని అంటున్నారు. మ‌ది కెమెరా పనితనం చాలా బాగుందని అంటున్నారు. సినిమా ప్రతి ఫ్రేమూ బాగా చూపించాడట. మొత్తానికి శ్రీమంతుడు డివైడ్ టాక్ తో సినిమాని మొదలెట్టాడు.అయితే ఈ సినిమా ఏ రెంజుకి వెళ్ళిదానేది మాత్రం వీకెండ్ గడిస్తే గానీ చెప్పలేం అంటున్నారు.   

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com