Home

»

Latest News

టీజర్ రివ్యూ: స్పైడర్

Aug 9, 2017 10:16AM

అందరూ ఊహించినట్లుగానే సూపర్‌స్టార్ మహేశ్ బాబు తన బర్త్‌డే గిఫ్ట్‌గా స్పైడర్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఫస్ట్ రిలీజ్ చేసిన టీజర్లో హావభావాలు మాత్రమే ఉండి..సైలెంట్‌గా స్పైడర్‌ను చూపించిన మురుగదాస్ తాజా టీజర్లో మాత్రం దుమ్ములేపాడు. "పెరుగుతున్న జనాభాను కంట్రోల్ చేసేందుకు గవర్నమెంట్, భూకంపం, ఈ సునామీలా నేనూ ఒక భాగమే" అని ఎస్‌జే సూర్య చెప్పే డైలాగ్ అదిరిపోయింది. మరి విలనే అంత పవర్‌ఫుల్ డైలాగ్ చెబితే మహేశ్ ఎంతలా రెచ్చిపోవాలి..అందుకే "అదే భయం..భయపెట్టడం మాకూ తెలుసు" అంటూ ప్రిన్స్ ఇచ్చిన ఫినిషింగ్ టచ్ అభిమానుల్లో అంచనాలు పెంచుతోంది. ఎప్పటిలాగే మురుగదాస్ మార్క్ యాక్షన్ సీన్స్ థియేటర్లో కేకలు పెట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక‌గా నటిస్తోన్న ఈ మూవీని ఠాగూర్ ప్రసాద్ సమర్పణలో ఎన్‌.వి.ప్రసాద్ నిర్మిస్తున్నారు. విజయదశమికి సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com