
నిన్న వరల్డ్ వైడ్ గా 'స్పైడర్ మెన్ బ్రాండ్ న్యూడే'(Spider man brand new)రిలీజైన విషయం తెలిసిందే. ప్రపంచ సినీ ప్రేమికులతో పోటీపడుతూ తెలుగు ప్రేక్షకులు కూడా స్పైడర్ మెన్ గా 'టామ్ హోలాం డ్ చేసే విన్యాసాలని చూడటానికి ఉదయం ఎనిమిది గంటల షో నుంచే భారీ ఎత్తున తరలి వెళ్లారు. దీంతో సారీ ఫర్ ది డిస్ట్రబెన్స్ అనే రీతిలో మొన్న వచ్చిన ది 'ఒడిస్సి' నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని చిత్రాల తొలిరోజు వసూళ్ల రికార్డును కూడా దాటేసి, ఇండియాలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన నంబర్ వన్ ఇండియన్ చిత్రంగా నిలిచింది.
ఇండియాలో తొలిరోజే 60.60 కోట్ల నెట్ కలెక్షన్ సాధించగా, గ్రాస్ కలెక్షన్స్ 74.46 కోట్లు గతంలో 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' 53.60 కోట్ల నెట్ ఓపెనింగ్‌తో మొదటి స్థానంలో ఉండగా, ఆ రికార్డుని సునాయాసంగా తుడిచిపెట్టేసింది. అలాగే గతంలో వచ్చిన 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' తొలిరోజు 32.67 కోట్లు సాధించగా, ఈ కొత్త చిత్రం ఆ సంఖ్యను దాదాపు రెట్టింపు చేసి బాక్సాఫీస్ వద్ద తన అసలైన స్టామినా ఏంటో నిరూపించుకుంది. ఎలాంటి ప్రివ్యూ షోలు, ముందస్తు బ్లాక్ బుకింగ్‌లు లేకుండా కేవలం రెగ్యులర్ థియేట్రికల్ రిలీజ్‌తో ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం విశేషం.
ఈ భారీ విజయంలో భారతీయ ప్రాంతీయ భాషల పాత్ర కూడా చాలా కీలకమైనది. మొదటి రోజు దేశవ్యాప్తంగా మొత్తం 17,250 షోలలో ప్రదర్శితమైన ఈ సినిమా సగటున 72% కంటే ఎక్కువ ఆక్యుపెన్సీని నమోదు చేసింది. భాషల వారీగా చూస్తే, ఇంగ్లీష్ వెర్షన్ ద్వారా 32.25 కోట్ల నెట్ వసూలు కాగా, హిందీ వెర్షన్ రికార్డు స్థాయిలో 22 కోట్లని రాబట్టింది. తెలుగు వెర్షన్ 3.25 కోట్లు, తమిళ వెర్షన్ 3 కోట్లు వసూలు చేయగా, కన్నడ మరియు మలయాళ భాషలు వరుసగా 3 లక్షలు, 7 లక్షలు వసూలు చేసాయి. దేశంలోని టాప్ 3 నేషనల్ మల్టీప్లెక్స్ చైన్స్ నుంచే మొదటిరోజే దాదాపు 32 కోట్ల కలెక్షన్లు రావడం హాలీవుడ్ చిత్రాల చరిత్రలో మరో విశేషమైన మైలురాయి.
Also read: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి.. రూమర్ నిజమైందా?
డెస్టిన్ డానియల్ క్రెటన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో టామ్ హోలాండ్‌తో పాటు జెండయా, సాడీ సింక్, ఫ్లోరెన్స్ పగ్ కీలక పాత్రల్లో నటించారు. పీటర్ పార్కర్ ఐడెంటిటీని లోకం మరిచిపోయిన తర్వాత సాగే ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామా ప్రేక్షక లోకాన్ని అమితంగా ఆకట్టుకుంది. ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం, ఈ సినిమా తొలి 4 రోజుల లాంగ్ వీకెండ్‌లోనే ఇండియాలో 225 కోట్ల మార్కును చేరుకునే అవకాశం ఉంది. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద కూడా మొదటి వారానికి $820 మిలియన్లకు పైగా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 956 కోట్లు వసూలు చేసింది.
Spider Man Brand New, Tom Holland, Spiderman 4






