Home

»

Latest News

సత్యమూర్తిని నడిపిస్తున్న త్రివిక్రమ్

Apr 21, 2015 6:06PM

స‌న్నాఫ్ స‌త్య‌మూర్తికి విప‌రీత‌మైన డివైడ్ టాక్ వచ్చిన కలెక్షన్లు మాత్రం బాగానే రాబడుతోంది. దీనికి అసలు కారణం త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ అని అందరూ అంటున్నారు. వేసవి సెలవులు కావడంతో సినిమా బాలేదు అంటున్నా.. త్రివిక్రమ్ సినిమా ఎలా ఉందో ఓసారి చూసొద్దాం.. అనేవాళ్లే ఎక్కువ‌య్యారు. దీంతో ఈ సినిమా వసూళ్ళ పండగ చేసుకొంటోంది. ఈ వీకెండ్ విడుదలైన ‘ఓకే బంగారం’ A సెంటర్స్‌లో పోటీ ఇస్తున్నా.. B-C కేంద్రాల్లో ‘సత్యమూర్తి’కి ఈ గురువారం వరకు కలెక్షన్స్ బాగానే వస్తాయని సమాచారం. 23న వైజాగ్‌లో భారీగా థాంక్యూ మీట్‌కు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా పదకొండు రోజుల కలెక్షన్ల వివరాలు ఇలా వున్నాయి.

నైజాం-12 కోట్ల 3 లక్షలు
సీడెడ్- 5.33
ఉత్తరాంధ్ర- 3.20
గుంటూరు- 2.81
ఈస్ట్ గోదావరి- 2.28
కృష్ణా- 2.11
వెస్ట్ గోదావరి- 1.96
నెల్లూరు-1.13
టోటల్ ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ కలెక్షన్: 30 కోట్ల 85 లక్షలు.
ఓవర్సీస్- 6.20,
కర్నాటక 5.25,
రెస్టాఫ్ ఇండియా-1.34. 
టోటల్ వరల్డ్ వైడ్ 43 కోట్ల 64 లక్షలు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com