Home

»

Latest News

సత్యమూర్తి బెనిఫిట్‌ షో హంగామా

Apr 6, 2015 6:54PM

ఫిబ్రవరిలో ‘టెంపర్‌’ సందడి చేశాక.. మళ్లీ పెద్ద సినిమాల హంగామానే లేదు టాలీవుడ్‌లో. అడ్వాన్స్‌ బుకింగులు.. ఫ్యాన్సీ షోలు.. హౌస్‌ఫుల్‌ బోర్డులు.. ఇలాంటివేమీ కనిపించలేదు. మళ్లీ ఇప్పుడు ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’తో ఈ హంగామా మొదలవుతోంది. సినిమా విడుదలకు ఐదు రోజుల ముందు నుంచే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ మొదలైపోయాయి. హైదరాబాద్‌లో కొన్ని ప్రధానమైన మల్టీప్లెక్స్‌లు, పెద్ద థియేటర్లను మినహాయిస్తే అన్ని చోట్లా అడ్వాన్స్‌ బుకింగ్స్‌ యమ స్పీడు మీదున్నాయి. విడుదలకింకా మూడు రోజులుండగానే టికెట్లు దాదాపుగా అయిపోవచ్చాయి. విదేశాల్లో చాలాచోట్ల ముందు రోజే ప్రీమియర్‌ షోలు పడుతుండగా.. విడుదల రోజు తెల్లవారు జామునే రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల ఫ్యాన్స్‌ కోసం బెనిఫిట్‌ షోలు వేస్తున్నారు. స్టార్‌ హీరోల సినిమాలు ఏవి విడుదలైనా తెల్లవారు జామున బెనిఫిట్‌ షోలు వేయడంలో హైదరాబాద్‌ కూకట్‌ పల్లిలోని భ్రమరాంభ థియేటర్‌ ముందుంటుంది. బన్నీ ఫ్యాన్స్‌ కోసం సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమా బెనిఫిట్‌ షో కూడా ఈ థియేటర్లో వేస్తున్నారు. ట్విట్టర్లో ఈ షోకు సంబంధించి డీటైల్స్‌ కూడా పెట్టారు. పొద్దున ఐదు గంటలకు షో వేస్తున్నారు. ఇంకా హైదరాబాద్‌లోని మరికొన్ని థియేటర్లలో బెనిఫిట్‌ షో పడుతోంది. ఇంకా రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల అర్ధరాత్రి నుంచే షోలు వేయబోతున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com