సైమాలో అందాలారబోసిన శ్రీయ... మీరూ ఓ లుక్కేయండి
on Jul 3, 2017

అవార్డు ఫంక్షన్లలో ఖచ్చితంగా కనిపించే సెలబ్రిటీ ఎవరంటే శ్రీయ శరన్. లేటు వయసులో కూడా ఆహుతుల్ని తన చందాలతో మంత్ర ముగ్ధుల్ని చేసి కట్టిపడేసే సోయగం ఈ అమ్మడి సొంతం. అందుకే, ఏ ఫంక్షన్లలో అయినా నిర్వాహకులు శ్రీయ కి ప్రత్యేక ఆహ్వానం పంపిస్తారు. శ్రీయ కూడా ఈ ఫంక్షన్లకి రావడానికి మరో కారణం తానింకా సినిమాలు చేసే వయసులోనే ఉన్నానని దర్శక, నిర్మాతలకి స్ట్రాంగ్ మెసేజ్ పంపించడం. గౌతమీపుత్ర శాతకర్ణి తో హిట్ కొట్టిన శ్రీయ ప్రస్తుతం బాలకృష్ణ పైసా వసూల్ లో చేస్తుంది. అయితే, అనుకున్నంత ఆఫర్లు రాకపోవడంతో సైమా ని వేడుకగా చేసుకొని తెలుగు పెద్దల్ని మెప్పించే ప్రయత్నం చేసింది.
సైమా ఫంక్షన్కి ఎందరో యువ నటీమణులు హాజరయినా, శ్రీయ తన అందాల ఆరబోతతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి... అందరి దృష్టి తన వైపు మళ్లించుకుంది. వామ్మో శ్రీయ ఏంటి ఇప్పటికీ ఇంత సౌందర్యం ఎలా మైంటైన్ చేస్తుంది అని నోళ్లు తెరవడం అక్కడికి హాజరయిన ఆహుతుల వంతయింది అంటే నమ్మండి. ఇంతకీ, శ్రీయ వయస్సు ఎంతయి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ఆమె పుట్టిన సంవత్సరం కోసం ప్రయత్నించకండి, కేవలం ఈ ఫోటోలు చూసి మాత్రమే చెప్పండి!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



