Home

»

Latest News

ప్రభాస్ గురించి సతమతమవుతున్న శ్రద్దా..

Aug 12, 2017 4:50PM

 

బాహుబలి తరువాత ప్రభాస్ చేస్తున్న కొత్త సినిమా 'సాహో'. అయితే ఈ సినిమా టైటిల్ ఎప్పుడో ఖరారైంది కానీ... పూర్తి స్థాయిలో షూటింగ్ మాత్రం ఇంకా జరగడంలేదు. మరోపక్క ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంలో కూడా ఇంకా క్లారిటీ లేదు. అయితే శ్రద్దా కపూర్ పేరు మాత్రం ఎక్కువగా వినిపిస్తోంది.  ఇదిలా ఉండగా ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది. అదేంటంటే... ఈ సినిమా డేట్స్ కోసం శ్రద్దా కపూర్ డేట్స్ అడ్జస్ట్ చేయడానికి సతమతమవుతుందట. వేరే కమిట్మెంట్స్ ఉండటం వలన, డేట్స్ సర్దుబాటు చేయడం కాస్త కష్టంగా మారిందట. మరి ఒకవేళ శ్రద్దా కనుక డేట్స్ ఇవ్వలేకపోతే మరో హీరోయిన్ కోసం వేట తప్పదు. అయితే తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో రానున్న ఈసినిమాలో ఛాన్స్ కోసం చాలా మంది హీరోయిన్స్ ఎదురుచూస్తున్నారట. చూద్దాం.. ఒకవేళ శ్రద్దా కపూర్ లేకపోతే ఈ సినిమాలో ఎవరికి ఛాన్స్ దొరుకుతుందో..

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com