సంజయ్ దత్ కూతురిగా మహేష్ హీరోయిన్..!
on Apr 26, 2016

మహేష్ తో నేనొక్కడినే లో నటించిన కృతి సనన్ కు టాలీవుడ్ ఆ తర్వాత నాగచైతన్య సినిమా తప్ప అవకాశాలు రాలేదు. బాలీవుడ్ లోనే మంచి అవకాశాలు వస్తుండటంతో అక్కడి సినిమాలపైనే దృష్టి పెట్టిందీభామ. లేటెస్ట్ గా బాలీవుడ్ మున్నాభాయ్ సంజయ్ దత్ తో నటించే అవకాశం కృతిని వరించింది. సంజయ్ దత్ జైలు నుంచి విడుదలైన తర్వాత చాలా అవకాశాలే వచ్చాయి. ప్రస్తుతం వాటన్నింటిలో బెస్ట్ స్క్రిప్ట్ అనిపించిన దాన్ని సెలక్ట్ చేసుకుని వర్క్ చేయబోతున్నాడట. సినిమా పేరు మార్కో అని, ఇది తండ్రి కూతుళ్ల అనుబంధం గురించి ఉంటుందని సమాచారం. సంజయ్ కు కూతురిగా చేయడానికి కృతిని తీసుకున్నారట. జైలు నుంచి విడుదలైన తర్వాత దత్ లో చాలా మార్పు వచ్చింది. ఇకపై తాను కమర్షియల్ సినిమాలు చేయనని, కేవలం కొత్త రకం సినిమాలు, వైవిధ్యమైన జానర్లున్న సినిమాలు మాత్రమే చేస్తానని, ఇంకా చెప్పాలంటే గొప్ప సినిమాలుగా నిలిచిపోయే సినిమాలే చేస్తానంటున్నాడు మున్నాభాయ్. ఇప్పటికే మూడు సినిమాలకు సైన్ చేశాడు. సంజయ్ దత్ లైఫ్ మీదే, వేరే హీరోతో రాజ్ కుమార్ హిరానీ సినిమా చేస్తుండటం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



