'సంఘమిత్ర' అభిమానమిత్ర కానుందా...!?
on May 19, 2017
అధునాతన సాంకేతికతను జోడించి...అంచనాలను మించి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'సంఘమిత్ర' సినిమాలో శృతి హాసన్ ప్రధాన పాత్రలో యువరాణిగా దర్శనమీయనుంది. తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన తొలి ప్రచార చిత్రాన్ని బట్టి ఈ చిత్రంపై అభిమానులు ఒక ఆలోచనకు వచ్చారని తెలుస్తుంది. గుర్రం స్వారీ చేస్తూ యువరాణి సంఘమిత్ర చేసే విన్యాసాలు అద్భుతం గా ఉండబోతున్నాయని వినిపిస్తుంది. ఇంచు మించు బాహుబలి చిత్రంలో ఉండే అరుదైన విన్యాసాలు ఈ చిత్రం ద్వారా చూడనున్నట్లు తెలుస్తుంది.
ఈ చిత్రం కోసం కథానాయకి శృతిహాసన్ కత్తి సాము ను విదేశాలలో నేర్చుకున్న నేపథ్యంలో పోరాట సన్నివేశాలు వైవిద్యం గా కొనసాగనున్నాయి. దర్శకుడు సుందర్ తన నైపుణ్యానికి నాణ్యతను అద్ది అభిమాన మిత్ర గా సంఘమిత్రను తెరకెక్కించే పనిలో ఉన్నట్లు వినిపిస్తుంది. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం ఈ చిత్రానికి కలిసొచ్చేలా ఉంది. ఈ సినిమాను తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించబోతున్నారు. అంతేకాదు ఈ చిత్రం కూడా బాహుబలి చిత్రంలాగా రెండు భాగాలుగా రానున్నట్లు సమాచారం.